- ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు జయేంద్ర సరస్వతి సూచన
- చిన్న దేవాలయాలను పెద్ద ఆలయాలు దత్తత తీసుకోవాలి
- సత్యదేవునికి కంచి పీఠాధిపతి, ఉత్తరాధికారి విశేష పూజలు
సత్యదేవుని సన్నిధిలో కంచి పీఠాధిపతులు
Published Sun, Nov 20 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
అన్నవరం :
హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు ’ప్రజల వద్దకు «ధర్మం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలని కంచి కామకోటి పీఠా«ధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు సూచించారు. రత్నగిరికి విచ్చేసిన జయేంద్ర సరస్వతి స్వామీజీ, విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆదివారం ఉదయం గర్భాలయంలో సత్యదేవుడికి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం చినరాజప్ప వారిని కలిసి ఆశీస్సులు పొందారు. జయేంద్ర సరస్వతి తరఫున విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ టీటీడీ నిర్వహిస్తున్న ’మనగుడి’ కార్యక్రమం చాలా బాగుందని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలు కనీసం రెండు జిల్లాల్లోని దేవాలయాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. వేదపాఠశాలలను ఎక్కువగా స్థాపించి ఎక్కువ మంది విద్యార్థులు వేదం అభ్యసించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్నవరం దేవస్థానంలో రూ.2.3 కోట్లతో స్మార్త, ఆగమ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, దానిని వేదపాఠశాలగా మార్చే ప్రతిపాదన కూడా ఉందని దేవస్థానం ఈఓ కె. నాగేశ్వరరావు పీఠాధిపతులకు వివరించారు.
పీఠాధిపతి, ఉత్తరాధికారికి
ఘనంగా పూజలు
సత్యదేవుని దర్శనం అనంతరం ఆలయంలోని విశిష్ట వ్రతమండపంలో పీఠా«ధిపతి, ఉత్తరాధికారులకు దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు పూజలు చేశారు. పండితులు ఆశీర్వచనాలు అందచేశారు. నాలుగు వేదాల పండితులు వేదాలను పఠించారు. ఐదు రకాల పళ్లు, రూ. 10,116 నగదు పారితోషికాన్ని చైర్మన్, ఈఓ వారికి సమర్పించారు. కంచి పీఠం తరఫున పీఠాధిపతి జయేంద్రసరస్వతి స్వామీజీ చైర్మన్, ఈఓలకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నా«థరావు పాల్గొన్నారు.
అతిరుద్ర మహాయాగం సందర్శించిన ఉత్తరాధికారి
పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి కావాలనే ధ్యేయంతో రత్నగిరిపై నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగాన్ని ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించారు.
Advertisement
Advertisement