రేపు సీఎం రాక
Published Tue, Jan 3 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
కాకినాడ సిటీ :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గు రువారం జిల్లా పర్యటనకు రానున్నా రు. ఆ రోజు ఉదయం 9 గంటలకు విజయవా డ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరే సీఎం 9. 55 గంటలకు రామచంద్రపురం చేరుకుంటారు. 10 గంటలకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని, కొత్తగా నిర్మించిన కార్యాలయ భవనం, క్యాంపు కార్యాలయం, స్త్రీశక్తి భవనాలను ప్రారంభిస్తారు. కాజులూరు మండలం జగన్నాథగిరివద్ద కోరంగి కెనాల్‌పై నిర్మించిన వంతెనను, రెండు పంచాయతీరాజ్ రోడ్లను, పట్టణంలోని చప్పిడివారి సావరంలో నిర్మించి న మున్సిపల్ ఓపె¯ŒS ఆడిటోరియాలను ప్రా రంభిస్తారు. 10.55 గంటలకు వీఎస్‌ఎం కళాశాలకు చేరుకుని, 19వ వార్డు జన్మభూమి గ్రా మసభలో పాల్గొంటారు. 1.10 గంటలకు బైపాస్ రోడ్డులోని హెలిప్యాడ్‌కు చేరుకుం టారు. 1.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు పిఠాపురం చేరుకుం టారు. 2.15 గంటలకు పాదగయ సమీపంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన స్థూపాన్ని ఆవిష్కరించి, శంకుస్థాపన చేస్తారు. 5 గంటల వరకూ జరిగే సభలో పాల్గొంటారు. 5.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళతారు.
Advertisement
Advertisement