- కాకినాడ బీచ్, కోరంగి, హోప్ ఐలాండ్‌లు వేదికలు
- వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
బీచ్ ఫెస్టివల్‌కు చురుగ్గా ఏర్పాట్లు
Published Fri, Jan 6 2017 11:11 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కాకినాడ సిటీ :
సంక్రాంతి నేపథ్యంలో పండగ వాతావరణం ఉట్టిపడేలా కాకినాడ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ బీచ్, కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్‌లు వేదికలుగా వినూత్న రీతిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి 15 వరకూ నాలుగు రోజులు ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రధాన వేదికైన బీచ్‌లో వేడుకలు జరుగనున్నాయి. పగలు బీచ్ కబడ్డీ, వాలీబాల్, కుస్తీ, యోగ, డ్యా¯Œ్స విత్ కలర్స్ తదితర కార్యక్రమాలతో పాటు వాటర్ జెట్స్, స్కీయింగ్, పారాసైలింగ్, హెలికాఫ్టర్ రైడ్ వంటి వినూత్న ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు హాట్ ఎయిర్ బెలూ¯ŒS రైడింగ్ ఏర్పాటుకు ఆయా సంస్థలతో సంప్రదిస్తున్నారు. సైకత శిల్పకళా ప్రదర్శనలు, రంగోలీ పోటీలు పర్యాటకులను అలరించనుండగా, అరుదైన చేపలు, ఫల పుష్పాదులతో ఆక్వేరియం, ప్లోరీషోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
వివిధ వంటకాల రుచులు
ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు చేప, రొయ్య, పీత వంటకాలతో సీఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన మన ఫౌల్ట్రీపరిశ్రమ, నేషనల్ ఎగ్ కార్పొరేష¯ŒS సహకారంతో కోడిగుడ్లతో వివిధ రకాల వంటకాల ‘ఎగ్ ఫెస్టివల్’ నిర్వహించనున్నారు. సందర్శకులకు మంచి షాపింగ్ అనుభూతి కోసం సూరత్, సేలం, ఉత్తరప్రదేశ్‌ల ఉత్పత్తులతో నేషనల్ టెక్స్‌టైల్స్ ఎగ్జిబిషన్, శిల్పారామం కాస్మొటిక్స్, జ్యూయలరీ ఫిమేల్ షాపింగ్, డ్వాక్రా బజార్ తదితర స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా పర్యాటక ఆకర్షణలను ఫొటోలుగా టీవీ స్క్రీ¯ŒSలపై చూపే స్లైడ్‌షోలు ప్రదర్శించే ఫొటో ఎగ్జిబిష¯ŒS ఏర్పాటు చేస్తున్నారు.
రోజుకో థీమ్‌లో సందడి
సంబరాలను ఒక్కో రోజు ఒకో థీమ్‌తో నిర్వహించనున్నారు. 12న ఇంటీనైట్, 13న సౌల్ నైట్, 14న బ్లూ నైట్, 15న వుయ్ ఆర్‌ది నైట్ థీమ్‌లు ఉంటాయి. జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందిన కళాకారులు కేకే, సోనునిగమ్, నరేష్ అయ్యర్ వంటి ప్రముఖ కళాకారులు తమ ప్రదర్శనలతో సందర్శకులను ఉర్రూతలూగించనున్నారు.
హోప్ ఐలాండ్‌కు బోట్ యాత్ర
కోరంగి నుంచి హోప్ ఐలాండ్ వరకూ బోట్ క్రూయిజ్ యాత్ర, అందర్నీ అలరించనుంది. హోప్ ఐలాండ్‌లో సాయంత్రం గడిపేందుకు తాత్కాలిక కుటీరాలు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అటవీశాఖ సహకారంతో హోప్‌ఐలాండ్ ఇసుక తిన్నెల్లో ఆలీవ్ రిడ్లీ తాబేళ్ల సంచారం, గుడ్లు పెట్టే అరుదైన దృశ్యాలను చూసే అవకాశం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా...
జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా బీచ్ ఫెస్టివల్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీచ్‌ఫెస్టివల్ ఏర్పాట్లను వివరించారు. ఈ ఫెస్టివల్ నిర్వహణకు రాష్ట్ర పర్యాటకశాఖ రూ.2.5 కోట్లు కేటాయించిందన్నారు. కాకినాడ బీచ్‌తో పాటు కోరంగి అభయారణ్యం, హోప్‌ఐలాండ్‌లలో పర్యావరణానికి విఘాతం లేని విధంగా ఆహ్లాదకర అంశాలను ఈ సంబరాల్లో చేర్చామన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపరంగా గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, అఖండ గోదావరి ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ భీమశంకరం, టూరిజం అసిస్టెంట్ ఆఫీసర్ వెంకటాచలం పాల్గొన్నారు.
Advertisement