మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం రన్‌వేను 1,750 మీటర్ల నుంచి 3,165 మీటర్లకు విస్తరించే పనులకు సోమవారం భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పలువురు రాష్ట్రమంత్రులు హాజరుకానున్నారు.
-
విమానాశ్రయ విస్తరణకు భూమి పూజ
-
హాజరు కానున్న కేంద్ర మంత్రులు
సాక్షి, రాజమహేంద్రవరం :
మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం రన్‌వేను 1,750 మీటర్ల నుంచి 3,165 మీటర్లకు విస్తరించే పనులకు సోమవారం భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పలువురు రాష్ట్రమంత్రులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. భూమిపూజ అనంతరం రాష్ట్రంలోని విమానాశ్రయాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య చర్చలు జరగనున్నాయి. అనంతరం అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు సీఎం చేతుల మీదుగా సన్మానం చేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమాల అనంతరం చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్నారు.