- మూడు నియోజకవర్గాల పరిధిలో పలు ప్రారంభాలు, శంకుస్థాపనలు
నేడు సీఎం రాక
Published Fri, Nov 18 2016 11:50 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
సాక్షి, రాజమహేంద్రవరం :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9.20 నుంచి రాత్రి 8 గంటల వరకు రాజమహేంద్రవరం నగరం, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో ఎనిమిది ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉదయం 9.20 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారం చేరుకుని పరిపాలనాభవనాన్ని ప్రారంభిస్తారు. ఖైదీల కోసం నిర్మించే 50 పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేస్తారు. 10.10 గంటలకు రూరల్ పరిధిలోని శాటిలైట్ సిటీలో నిర్వహించే జనచైతన్య యాత్రలో పాల్గొంటారు. తర్వాత 11.45 గంటలకు చెరుకూరి కల్యాణ మండపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు నగరంలోని మున్సిపల్ స్టేడియానికి చేరుకుని డ్వాక్రా సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కారెం శివాజీ నిర్వహించే దళిత సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు దివా¯ŒSచెరువులోని నగరవనాన్ని ప్రారంభించి, ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేస్తారు. రాత్రి 7.10 గంటలకు నన్నయ యూనివర్సిటీకి చేరుకుని లైబ్రరీ భవనం, హాస్టల్ సముదాయం ప్రారంభిస్తారు. అక్కడ నుంచి 7.30 గంటలకు బయలుదేరి జీఎస్‌ఎల్ ఆస్పతికి చేరుకుని డెంటల్ కళాశాలను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి మధురపూడి చేరుకుని రాత్రి 8:.0గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడ వెళతారు. శుక్రవారం డిప్యూటీ సీఎం చినరాజప్ప, కలెక్టర్ అరుణ్‌కుమార్, రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఇ¯ŒSచార్జి ఎస్పీ గోపీనాథ్ జెట్టి, సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ఇతర అధికారులు సీఎం పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.
Advertisement