ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూడు దశల్లో ఈ పథకం అమలుకు ప్రణాళికను నిర్దేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించేందకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- సాంకేతిక విద్యాబోధనకు శ్రీకారం
- తొలి దశలో 118 పాఠశాలల ఎంపిక
- ప్రభుత్వ పాఠశాలల్లో 20 నుంచి ప్రారంభం
- పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలను ప్రొజెక్టర్ ద్వారా దృశ్య రూపంలో విద్యార్థులు తెరపైన చూస్తారు.
- ప్రతి పాఠానికి సంబంధించిన సీడీల ద్వారా దృశ్య బోధన ఉంటుంది.
- విద్యార్థులు తరగతిలో విన్నదానికంటే తేలికగా అర్ధం చేసుకోగలరు.
- సాధారణ బోధనలో విజ్ఞాన పటాలు, అంతరిక్షం, వివిధ ప్రయోగాలు చూడడం ద్వారా విద్యార్థి మదిలో ఆ విషయాలు నిక్షిప్తమవుతాయి.
- తరగతి గది బోధన అనంతరం తెరపై తిరిగి దృశ్యరూపంలో చూడడం వల్ల పలు అనుమానాల నివృత్తికి అవకాశం ఉంటుంది.
- పరీక్షల సమయంలో దృవ్య రూపంలో చూడడం వల్ల ఆ సమస్య కళ్ల ముందు కదలాడి సరైన జవాటు రాసే వీలుంటుంది.
- ఆంగ్ల మాధ్యమంలో బోధనలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు పలికే విధానం, వాస్తవంగా పలకాల్సిన విధానం ఉపాధ్యాయులకు సైతం ఉపయోగకరంగా ఉంటుంది.
- వెనుకబడిన విద్యార్థులకు ఈ–బోధన ఎంతో ప్రయోజనం. పాఠాన్ని వేగంగా అవగాహన చేసుకోవచ్చు.
- ప్రస్తుతం ఇంగ్లిషు మీడియంలో ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు, తెలుగు మీడియంలో 6 నుంచి 10వ తరగతి వరకు రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యాంశాల వారీగా దృశ్య రూపంలోకి పాఠ్యాంశాలను మారుస్తున్నారు.
- డిజిటల్ తరగతుల నిర్వహణకు ఎంపికైన పాఠశాలలకు ఇంటర్నెట్, ప్రొజెక్టర్, కంప్యూటర్ తెర అమరుస్తారు. కంప్యూటర్ తెరపై టచ్ స్క్రీన్ మాదిరిగా పనిచేయడం విశేషం. వీటితో పాటు రెండు కంప్యూటర్లు, యూపీఎస్, ప్రింటర్, అదనపు హార్డ్ డిస్క్‌లను సరఫరా చేస్తారు.
- డిజిటల్ తరగతుల నిర్వహణలో నెట్ సౌకర్యం ఉండడంతో ఇంటర్నెట్ నుంచి పాఠాలకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ౖడౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు ప్రదర్శించే వీలుంటుంది.
- ఇప్పటికే వందలాది విద్యా వెబ్‌సైట్‌లు, యూట్యూబ్‌లో అనేక విద్యా సంబంధిత వీడియోలు ఉచితంగా లభిస్తున్నాయి.
- ఎంపిక చేసిన పాఠశాలల్లోని ఆసక్తిగల టీచర్స్‌కు ఈ బోధనపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.