పాఠశాలల్లో 15 నుంచి డిజిటల్ క్లాసులు
పాఠశాలల్లో 15 నుంచి డిజిటల్ క్లాసులు
Published Sun, Oct 9 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 20 ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నట్లు డీవైఈఓలు పి.మౌలాలి, శివరాముడు, వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆదివారం సర్వ శిక్షా అభియాన్ సమావేశ మందిరంలో డిజిటల్ క్లాసు రూం నిర్వహణ కోసం ఎంపిక చేసిన ప్ర«ధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌ఎంఎస్‌ఏ డీవైఈఓ పి.మౌలాలి మాట్లాడుతూ..స్కూల్ గ్రాంట్ల నుంచి డిజిటల్ క్లాసు రూంలకు కావాల్సిన ప్రొజెక్టర్లు, స్క్రీన్లు, ఇతర విడిభాగాలను అమర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న ప్రాజెక్టులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ సేవలను అందించే భాగంలోనే డిజిటల్‌క్లాసు రూంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే డిజిటల్ క్లాసు రూంలో బోధన చేసే సబ్జెక్టు టీచర్లకు బోధన పై శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నిడ్జూరు హెచ్‌ఎం మారుతి, ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులు పాల్గొన్నారు.
Advertisement