హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.. మేరీ మేరీ క్రిస్మస్
పాపుల రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి, సత్యం, ధర్మం, శాంతి, దయ, ప్రేమ మార్గంలో మనందరం నడవాలని లోకానికి బోధించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆదివారం జిల్లాలో ఉత్సాహంగా జరుపుకున్నారు. పలు చర్చిల్లో పశువుల పాకలో క్రీస్తు జననాన్ని తెలిపే ఇతివృత్తాలను ప్రదర్శించారు. వాటి ముందు కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థనలు చేశారు. విద్యార్థులు క్రిస్మస్ తాత వేషధారణతో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ పాటలు పాడారు. కేక్‌లు కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాస్టర్లు భక్తి సందేశాన్ని వినిపించారు.