ఆదాయం ప‘డిపో’యింది
Published Tue, Nov 15 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
రాజమహేంద్రవరం సిటీ :
ప్రధానమంత్రి మోదీ చేపట్టిన నోట్ల రద్దుతో జిల్లా ఆర్టీసీ రీజియ¯ŒSను 50 లక్షల మేర నష్టాల్లోకి నెట్టి వేసింది. ఐదు రోజులుగా రోజుకు రూ.10 లక్షల చొప్పున ఈ నష్టం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది డిపోలనుంచి ప్రతి రోజూ 6 లక్షలమంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. జిల్లాలో 650 సంస్థ బస్సులు, 200 అద్దె ప్రాతిపదికన 900 సర్వీసులను నడుపుతూ మూడు లక్షల 25 వేల కిలోమీటర్ల మేర ప్రయాణాలు సాగిస్తున్న ఈ బస్సులు నడిచేందుకు 55 నుంచి 60 వేల లీటర్ల డీసెల్ వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణకు సంస్థ రోజుకు రూ.1.10 కోట్ల వ్యయమవుతోంది. నోట్ల రద్దుతో ఐదు రోజులుగా డబ్బులు లేక ప్రయాణికులు బస్సులు ఎక్కలేక ప్రయాణాలను విరమించుకున్నారు. రోజుకు ఆరు లక్షల మంది ప్రయాణించే ప్రజలు సుమారు 75 వేల మంది వరకూ బస్సులు ఎక్కకపోవడంతో సంస్థ నష్టాల్లో చిక్కుకుంది. రోజుకు తొమ్మిది డిపోల నుంచి రూ.కోటి పైబడి రావాల్చి ఉండగా 10 శాతం మేర నష్టాలు రావడంతో రోజుకు రూ.10 లక్షల పైబడి సంస్థ నష్టాలను చవిచూడాల్చిన పరిస్థితి ఎదురైంది. ఆవిషయమై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్‌ను వివరణ కోరగా ప్రయాణికుల వద్ద సక్రమంగా డబ్బులు లేకపోవడం వల్ల 10 శాతం పైబడి ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోయాయని, రోజుకు కోటి పైబడి రావల్సిన ఆదాయం రూ.85 లక్షలకు పడిపోయిందని తెలిపారు.
Advertisement