- డీఎస్‌ఓ జి.ఉమామహేశ్వరరావు
జిల్లాలో 300 కొత్త రేషన్ దుకాణాలు
Published Sun, Oct 2 2016 10:40 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
రావులపాలెం :
జిల్లాలో కొత్తగా 300 రేషన్ దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం రాత్రి రావులపాలెంలోని 31, 34, రేషన్ దుకాణాల్లో జరుగుతున్న సరుకుల పంపిణీని ఆయన తనిఖీ చేశారు. తూనిక యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద ప్రస్తుతం 138 షాపులు ఖాళీ ఉన్నాయన్నారు. ఒక డీలర్‌కు 500లోపు కార్డు ప్రాతిపదికన విడదీసి కొత్తగా 300 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 438 షాపులకు సంబంధించి ఇప్పటికే ఆర్డీవో సబ్ కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్లు జారీ అయ్యాయన్నారు. జిల్లాలో బెస్ట్ ఫింగర్ డిటెక్షన్(బీఎఫ్‌డీ) 92 శాతం కార్డులు పూర్తి అయ్యాయన్నారు. యూనిట్లు సంఖ్య ద్వారా 70 శాతం పూర్తి అయ్యిందన్నారు. బీఎఫ్‌డీతోపాటు కార్డుదారుల వారి కుటుంబ సభ్యుల ఐరీష్ కూడా చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలను డీలర్లు వారి ఇళ్ళకు వెళ్ళి పూర్తి చేయాలన్నారు. ఒకటో తేదీ నుంచి 15 తేదీ వరకూ రేషన్ ఇస్తామని అయితే సాధ్యమైనంత ముందుగానే రేషన్ పంపిణీ పూర్తి చేయాలని డీలర్లను ఆదేశిస్తున్నామన్నారు. ఆయన వెంట ఎంఎస్‌ఓ టి.సుభాష్ ఉన్నారు.
Advertisement