ఉసురు తీసిన సినిమా సరదా..
Published Sun, Jan 15 2017 11:34 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
మూడు రోజుల సంక్రాంతి పండుగల ను ముచ్చటగా చేసుకునేందుకు పట్టరాని ఉత్సాహంతో ఊరూర సందడి నెలకొంటే.. మరోవైపు వేర్వేరు ప్రమాదాల్లో జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. వీటిలో 23 మంది గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు. బైక్‌లపై ప్రమాదాలకు గురైన ఇద్దరు యువకులు, రెండు బైక్‌లు ఢీకొని మరో ఇద్దరు, రెండు ఆటోల ఢీకొన్న ప్రమాదంలో వృద్ధుడు, గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.
రాయవరం/కపిలేశ్వరపురం (మండపేట) :
సంక్రాంతి పండుగ.. సినిమా చూసిన సరదా జోరులో బైక్‌పై దూసుకుపోతున్న వారికి.. మృత్యువు ఆర్టీసీ బస్సు రూపంలో ఎదురొచ్చింది. ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ఒకరు అక్కడికక్కడే మృతి చెందిగా, మరొకడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనకు మృతుడి కుటుంబీకుల ఆవేదన కట్టలు తెచ్చుకుంది. సంక్రాంతి సందడితో ఉత్సాహంగా ఉన్న కపిలేశ్వరపురం మండలంలోని నల్లూరి గ్రామం.. ఒక్కసారి విషణ్ణ వదనంతో దిగాలుపడింది. కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామానికి చెందిన నరాల వెంకటేష్ (18), బక్కి క్రాంతికుమార్ మోటార్‌సైకిల్‌పై సినిమా చూసేందుకు రామచంద్రపురం వెళ్లారు. సినిమా చూసి వస్తుండగా మాచవరం–పసలపూ డి గ్రామాల మధ్య మండపేట– కాకినాడ ప్రధాన రహదారిపై.. రావులపాలెం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఢీకొట్టింది. వెంకటేష్ తలపై నుంచి బస్సు టైరు వెళ్లడంతో అతడి తల ఛిద్రమైంది. రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన క్రాంతి కుమార్‌ను రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అతడిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గ్రామంలో విషాదం
పండగనాడు జరిగిన ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది. రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో ప్ర మాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
ఆవిరైన ఆనందం..
సినిమా చూసి ఇంటికి వస్తారనుకుంటున్న వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఈ ఘటన సమాచారం అందడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలింది. వెంకటేష్ తండ్రి ఏడుకొండలు, తల్లి వెంకటలక్షి్మల ఆవేదనను అదుపు చేయడం గ్రామస్తులకు కష్టమైంది. చేతికి అందివచ్చాడనుకుంటున్న తరుణంలో వెంకటేష్ మృతి చెందడాన్ని వారు తట్టుకోలేకపోయారు. వెంకటేష్‌కు ఇద్దరు సోదరిలు ఉన్నాయి. పెద్ద సోదరి మహాలక్షి్మకి వివాహం కాగా, లోవకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. పండుగ అనంతరం లోవకు వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్న తరుణంలో ఈ షాక్‌ను ఎలా తట్టుకోవాలని వారు తల్లిడిల్లిపోయారు. ఇదిలాఉండగా, మృతుడు వెంకటేష్ తల్లి వెంకటలక్షి్మకి ఇటీవలే మేజర్ ఆపరేష¯ŒS అయింది. ప్రమాద ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయవరం ఎస్సై వెలుగుల సురేష్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు.
బస్సు ఢీకొని సైక్లిస్టు మృతి
గండేపల్లి (జగ్గంపేట) : మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో సైక్లిస్టు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు తాళ్లూరుకు చెందిన చిట్టూరి వెంకట్రావు (ఆనందరావు) (65) సైకిల్‌పై గ్రామంలోని డివైడర్ దాటుతుండగా విశాఖ వైపు నుంచి విజయవాడ వెళుతున్న అద్దెకు తీసుకున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై కొనఊపిరితో కొట్టుకుంటున్న క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు 108 అంబులె¯Œ్సకు సమాచారం అందజేశారు. అంబులె¯Œ్స సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. స్ధానికులు, ఏఎస్సై వరహాలరాజు, నాగేశ్వర్రావు, చిరంజీవి స్తంభించిన ట్రాఫిక్‌ను నియంత్రించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రజనీకుమార్ తెలిపారు.
సైకిల్‌ను ఢీకొని...
సామర్లకోట (పెద్దాపురం) : సినిమా చూసేందుకు హడావుడిగా బైక్‌పై వెళుతోన్న ఇద్దరు యువకులను సైకిల్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక కెనాల్ రోడ్డులో శనివారం రాత్రి వేట్లపాలెం గ్రామానికి చెందిన కడిమిపల్లి ఏసుబాబు (26), అతడి స్నేహితుడు ఆకుమర్తి సత్యనారాయణ మోటారుసైకిలుపై సామర్లకోటలోని సినిమా చూడటానికి వస్తున్నారు. సుగర్ ఫ్యాక్టరీ వద్ద సైకిలు ఢీకొనడంతో బైక్‌పై ఉన్న వారు రోడ్డుపై పడిపొయారు. దీంతో ఏసుబాబు అకడిక్కడే మృతి చెందాడు. సత్యనారాయణ గాయపడ్డాడు. మృతుడు ఏసుబాబుకు భార్య, ఐదు ఏళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement