పోలీస్‌ పద్మవ్యూహంలో సీఎం పర్యటన | police protection in east godavari | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పద్మవ్యూహంలో సీఎం పర్యటన

Published Fri, Nov 18 2016 10:53 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

police protection in east godavari

  • విస్తృత బందోబస్తు
  • 1600 మంది పోలీసులతో పహారా
  • ముఖ్యమైన కాపు నేతల గృహ నిర్బంధం!
  • రాజమహేంద్రవరం క్రైం : 
    ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృత పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో కాపు ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉండడంతో సీఎం పర్యటనపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా పరిధిలో 600 మంది పోలీసులతో పాటు  సీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్, పోలీస్, ఏజీఎస్‌. హోమ్‌ గార్డులు, (రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా పోలీసులతో) పాటు మొత్తం 1600 మందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. పోలీస్‌ పద్మవ్యూహంలో సీఎం పర్యటన సాగనుంది. ఆయన ఉదయం 9.20 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాజమహేంద్రవరం నగరం, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో 8 ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 
            కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ముందుగానే పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాపు ఉద్యమంలో పాల్గొంటున్న ముఖ్య నాయకులను ఇళ్లకే పరిమితం చేసేలా చర్యలు చేపట్టారు. వారి ఇళ్ల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. చోటా మోటా కాపు నాయకుల కదలికలపై నిఘా పెట్టారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement