అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్: నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా నిర్వహించుకునేందుకు అంతా ప్లాన్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలని కొందరు సన్నాహాలు చేసుకుంటుంటే.. సొంతూళ్లలోనే ఘనంగా శుభాకాంక్షలు చెప్పుకోవాలని మరికొందరు భావిస్తునానరు. దైవ దర్శనానికి వెళ్లే వారు కొందరైతే.. పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లేవారు మరికొందరు. మొత్తానికి అర్ధరాత్రి నుంచి హంగామా చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుని తెల్లవారే వరకు సందడి చేసేందుకు అపార్ట్‌మెంట్స్ వాసులు రెడీ అయిపోయారు.
ఇక యువతైతే తమ బైక్‌లకు పని చెప్పే పనిలో పడ్డారు. అర్ధరాత్రి సెలైన్సర్లు తీసేసి నగరమంతా చక్కర్లు కొట్టేందుకు తహతహలాడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. న్యూ ఇయర్ నేపథ్యంలో వస్త్ర దుకాణాలన్నీ అప్పుడే కిటకిటలాడుతున్నారు. బేకరీలు, రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, బార్లు ప్రత్యేక ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నాయి. కాగా ఆధునిక టెక్నాలజీ ప్రభావంతో గ్రీటింగ్ కార్డుల కళ తప్పుతోంది. ఒకప్పుడు న్యూ ఇయర్ వేడుకలలో గ్రీటింగ్ కార్డు పాత్ర విడదీయరానిదిగా ఉండేది. చిన్నా పెద్ద అందరూ రంగురంగుల గ్రీటింగుకార్డులను తీసుకుని వారి భావాలను అందులో రాసిచ్చేవారు. కానీ, కాలం తెచ్చిన మార్పులకు గ్రీటింగ్‌కార్డు వెలవెలబోతోంది. సెల్‌ఫోన్ రాకతో ఎస్‌ఎంఎస్ ద్వారానే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. గ్రీటింగ్ కార్డులకు ఈ ఏడాది అంతగా డిమాండ్ లేదని కార్డుల విక్రేతలు చెబుతున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) చౌక ధాన్యపు డిపో (రేషన్ షాపు) ద్వారా పేదలకు అందజేసే సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. వ్యాపారులు-మిల్లర్లు సబ్సిడీ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యం అంటూ బ్రాండెడ్ పేర్లపై ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా బియ్యం మాఫియా సాగుతోంది. నియోజకవర్గం పరిధిలో ఉన్న కొడికొండ, తూమకుంట చెక్‌పోస్టుల్లో మామూళ్లు ముట్టజెప్పి బియ్యాన్ని యథేచ్ఛగా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గోరంట్ల మండలం కోరేవాండ్లపల్లి మీదుగా కదిరి, నల్లమాడ, తలుపుల, గాండ్లపెంటతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే బియ్యాన్ని రాష్ర్ట సరిహద్దు దాటిచ్చేస్తున్నారు. చిలమత్తూరు మండలం మరవకొత్తపల్లి, లక్ష్మీపురం(వీరాపురం) మార్గం గుండా కర్ణాటకకు చేరవేస్తున్నారు.
- న్యూస్‌లైన్, హిందూపురం మునిసిపాలిటీ
రీ సైక్లింగ్ చేసి..!
జిల్లా వ్యాప్తంగా 2,720 చౌక డిపోల ద్వారా పేదలకు కిలో రూపాయితో ప్రభుత్వం బియ్యం అందిస్తోంది. 11,53,713 రేషన్ కార్డులకు నెలకు 14,745.756 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. కార్డుదారుల్లో కొందరు బియ్యం తీసుకోవడం లేదు. మరికొందరు తీసుకున్నా కిలో రూ.8 నుంచి రూ.10కు విక్రయించుకుంటున్నారు. స్టోర్లలో మిగిలిన, రేషన్‌కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని వ్యాపారులు పాలిష్ చేసి.. వాటిని మిల్లర్లకు కిలో రూ.12 నుంచి రూ.14 వరకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ చే సి.. ఇందులో కొంత సన్న బియ్యం కలుపుతున్నారు. కర్నూలు, నంద్యాల, బళ్లారి, కణేకల్లు ప్రాంతాల్లో పండిన సోనామసూరి అంటూ వీటిని ఆరంజ్‌ఫైన్ రైస్, దిల్‌కుష్, అంగూర్ ధార, వైట్ గోల్డ్ బ్రాండ్ సంచుల్లో నింపుతున్నారు. ప్యాకింగ్‌ను చూసి అందులో ఉన్నవి అసలైన సోనా అని వినియోగదారులు నమ్మి క్వింటాలు రూ.4వేలు పైబడి పెట్టి కొంటున్నారు. తర్వాత సోనామసూరి బియ్యం రుచి కనిపించకపోవడంతో తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు.
కేసుల నమోదులో ఉదాసీనత
చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడంలో అధికారులు ఉదాసీనత చూపుతున్నారు. సరుకు స్వాధీనం, జరిమానా విధించే పసలేని సెక్షన్ 6ఏ నిబంధనపైనే ఎక్కువగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ కేసును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విచారించి.. అపరాధ రుసుం విధించడం, స్వాధీనం చేసుకున్న సరుకులో 20 నుంచి 30 శాతాన్ని ప్రభుత్వ పరం చేసే వెసులుబాటు ఉంటుంది. ఇది అక్రమార్కులకు అంత నష్టం ఉండదు. పటిష్టమైన సెక్షన్‌గా భావించే పీడీఎస్ అక్రమ నియంత్రణ నిబంధన 17డీ కింద క్రిమినల్ కేసు నమోదు చేస్తే.. అక్రమార్కుల ఆట కట్టించే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ ్లకు తలొగ్గి అధికారులు 17డీ నిబంధన కింద కేసులే నమోదు చేయడం లేదు. హిందూపురం నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో 6ఏ నిబంధన కింద ఆరు కేసులు నమోదయ్యాయి.
అనంతలో వీవీఎస్
భారత జట్టు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఏడాది జూలై 18న ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు. అకాడమీ క్రీడాకారులకు పలు సూచనలు ఇచ్చి స్టేడియంలోని సౌకర్యాలపై ప్రశంసలు కురిపించాడు.
ఆర్టీసీ క్రీడోత్సవాలు అదరహో
నవంబర్ 26 నుంచి 28 వరకు ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రస్థాయి సాృస్కతిక, క్రీడోత్సవాలు అనంతపురంలో జరి గాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జోన్ల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు వచ్చారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి.
సత్తా చాటిన బుద్ధిమాంద్య క్రీడాకారులు
ఆస్ట్రేలియాలో జరిగిన పసిఫిక్ స్పెషల్ ఒలింపిక్స్‌లో ఆర్డీటీకి చెందిన బుద్ధిమ్యాంద్యపు క్రీడాకారులు సత్తాచాటారు. ఏకంగా 26 పతకాలు సాధిం చారు. ఇందులో 10 బంగారు పతకాలు ఉన్నాయి.
హాకీలో ఆణిముత్యాలు
ఇండియా సబ్ జూనియర్ హాకీ శిబిరానికి ఆర్డీటీ క్రీడాకారిణులు మాధవి, నళిని ఎంపికయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సౌత్ ఇండియా హాకీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన, ఆర్డీటీ హాకీ అకాడమీలోని 12 మంది క్రీడాకారిణులు ఎంపికయ్యారు. 18 మంది ఉండే జట్టులో 12 మంది మన జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.
రంజీలకు ప్రసాద్‌రెడ్డి గుడ్‌బై
ఆంధ్ర రంజీ జట్టుకి ప్రసాద్‌రెడ్డి గుడ్‌బై చెప్పాడు. నవంబర్ 17న తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఆంధ్ర క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాంఛోఫై తదితరులు ప్రసాద్ రెడ్డి సేవలను కొనియాడారు.
ఆంధ్ర రంజీ కెప్టెన్‌గా ప్రశాంత్
అనంత క్రికెట్ ఆణిముత్యం డీబీ ప్రశాంత్ అతి చిన్న వయసులో ఆంధ్ర జట్టు పగ్గాలు చేపట్టాడు. జిల్లా క్రికెట్ చరిత్రలో ప్రసాద్ రెడ్డి, షాబుద్దీన్ తర్వాతి స్థానాన్ని భర్తీ చేసి యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. తన కెప్టెన్సీలో తొలి మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌పై 199 పరుగులు చేశాడు.
తొలిసారి బ్యాడ్మింటన్ పోటీలు
బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు అనంతపురంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. పుల్లెల గోపీచంద్ కుమారుడు సాయివిష్ణు, కుమార్తె గాయత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆల్ ఇండియా హాకీ టోర్నీ
అనంత క్రీడాగ్రామంలో ఆల్ ఇండియా హాకీ టోర్నీ డిసెంబర్‌లో జరిగింది. దేశవ్యాప్తంగా 19 విశ్వవిద్యాలయాల జట్లు పాల్గొన్నాయి. టోర్నీ విజేతగా బెంగళూరు జట్టు, రన్నర్స్‌గా పూర్వాంచల్ జట్లు నిలిచాయి. సౌత్‌జోన్ హాకీ పోటీల ప్రారంభోత్సవానికి డీజీపీ ఆపరేషన్స్ రాముడు, ముగింపు కార్యక్రమానికి డీపీజీ ప్రసాద్ రావు హాజరయ్యారు. 11 రోజుల పాటు హాకీ పోటీలు పండుగలా జరిగాయి. ఎస్కేయూ తొలిసారిగా సూపర్ లీగ్ పోటీలకు అర్హత సాధించింది. కాగా పోటీల్లో ఎంపీడీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకపోవడం పెద్ద దుమారం రేపింది.
సాఫ్ట్‌బాల్ జట్టులోకి జగదీష్
జిల్లాకు చెందిన జగదీష్ ఇండియా సాఫ్ట్‌బాల్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జగదీష్ ఎంపికను ప్రకటించింది. ఇండియా జట్టు మేనేజర్‌గా ఉప ఖజానా అధికారి నరసింహం నియమితులయ్యారు.
బియ్యం మాఫియా
Published Tue, Dec 31 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement