Rice mafia
-
కుప్పంలో రైస్ మాఫియా!
-
చంద్రబాబు ఇలాకాలో రైస్ మాఫియా
-
బీఆర్ఎస్ దోపిడీ పత్రాలను విడుదల చేస్తాం
నల్లగొండ: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, దుబారా ఖర్చు, దోపిడీ పెద్ద ఎత్తున జరిగాయని, వాటన్నింటిపై దోపిడీ పత్రాలను విడుదల చేస్తామని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నల్లగొండలో జరిగిన ప్రజాపాలన సన్నాహక సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిందని, ప్రతి శాఖలోనూ అప్పులు పేరుకుపోయాయన్నారు. వాటన్నింటిపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే.. వారు ఏదో చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శ్వేద పత్రం విడుదల చేశారని విమర్శించారు. అందుకే వారు పదేళ్లలో తెలంగాణలో చేసిన దోపిడీపై పత్రాలను విడుదల చేస్తామన్నారు. దేశమే సిగ్గుపడేలా రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసి తామేదో సాధించినట్లు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 1వ తేదీన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిదన్నారు. రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం: మంత్రి ఉత్తమ్ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను కుర్చీలు వేసుకుని కట్టిస్తామని చెప్పిందని, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టించలేదన్నారు. 28వ తేదీ నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పది జాతీయ స్థాయి రోడ్లు వస్తే చాలు: మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రోడ్లు తక్కువగా నిర్మించారని, తాను గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొంత ముందుకు తీసుకుపోయానని, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్డు భవనాల మంత్రి కావడంతో పది జాతీయ స్థాయి రోడ్లను మంజూరు చేయిస్తే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతిరెడ్డి, మందుల సామేల్, బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. -
రైస్ రాకెట్.. రైట్ రైట్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ‘రైస్ మాఫియా’మరింతగా రెచ్చిపోతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి (సీఎంఆర్) బియ్యాన్ని భారత ఆహా ర సంస్థ (ఎఫ్‌సీఐ)కి పంపాల్సిన మిల్లర్లు.. అడ్డ గోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుల నుంచి వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ఆ మంచి బియ్యాన్ని అధిక ధరలకు బయట అమ్ముకుంటున్నారు. ఆ స్థానంలో బయటకొన్న నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తూ, రేషన్ బి య్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ.. ఎఫ్‌సీఐకి అంటగడుతున్నారు. సివిల్ సప్లైస్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బందికి ముడుపులు ఇస్తూ దందా నడిపిస్తున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి ఇటీవల పోటెత్తిన ధాన్యం లారీలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చెక్‌పోస్టులున్నా రవాణా కొనసాగుతుండటాన్ని బట్టి ఆయా శాఖల అధికారుల సహకారమున్నట్టు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 2,200 రైస్ మిల్లులు ఉండగా.. అందులో వెయ్యి వరకు పారాబాయిల్డ్ మిల్లులు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 24నాటికి రాష్ట్ర ప్రభుత్వం 69.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. దీనికి సంబంధించి మిల్లర్లు 46.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇప్పటివరకు 65శాతం మేర కూడా బియ్యాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌తోపాటు పాలమూ రులో ఈ పరిస్థితి ఉంది. మిల్లర్లకు చేసిన కేటాయింపులకు, సీఎంఆర్ లెక్కలకు ప్రతి సీజన్లోనూ తేడాలు ఉండటం ఈ అక్రమాలకు నిదర్శనమని ఆరోపణలు వస్తున్నాయి. క్వింటాల్ రూ.1,400కే కొని.. రాష్ట్రంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్విం టాల్ ధాన్యం ఏ–గ్రేడ్ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర పలుకుతోం ది. అదే కర్ణాటకలో క్వింటాల్‌కు రూ.1,400లే పలుకుతోంది. దీంతో కొందరు మిల్లర్లు ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ వేబిల్లులతో కర్ణాటక నుంచి నాసిరకం ధాన్యాన్ని తీసుకొచ్చి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్లు, వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం కొని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కోటాకు మళ్లిస్తున్నారు. చెక్‌పోస్టులను తప్పించుకుని.. కర్ణాటక సరిహద్దుల్లో తెలంగాణ పరిధిలోని నారాయణపేట జిల్లాలో, గద్వాల జిల్లాలో ఏడు చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. పలు చెక్‌పోస్టుల వద్ద రాత్రివేళ నిఘా అంతంత మాత్రంగానే ఉంటోందని.. సిబ్బంది ఒక్కో ధాన్యం లారీకి రూ.2 వేలు చొప్పున తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఈ చెక్‌పోస్టులే గాకుండా ఇతర దారుల ద్వారా కూడా ధాన్యం లారీలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఎన్ని లారీలు పట్టుబడ్డా.. ♦ఈ నెల 11న కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని మిల్లులకు ధాన్యం తరలిస్తున్న 2 లారీల ను కాన్కుర్తిలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ♦ఈ నెల 15న నారాయణపేట జిల్లా మక్తల్‌లో ధాన్యం లోడ్‌తో వస్తున్న 16 లారీలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని సిర్పూర్, యాద్గిర్, మాన్విల నుంచి ఎలాంటి బిల్లులు లే కుండా హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లోని మి ల్లులకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ♦ఈ నెల 19న కర్ణాటకలోని మాన్వి నుంచి మిర్యాలగూడ, హైదరాబాద్‌లకు ధాన్యం లోడ్‌తో వస్తున్న నాలుగు లారీలను గద్వాల జిల్లా నందిన్నె చెక్‌పోస్టు వద్ద.. మరో రెండు లారీలను ఎర్రవెల్లి చౌరస్తా వద్ద పట్టుకున్నారు. -
రేషన్ రీ సైక్లింగ్ టోకరా!
పేదలు కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం డీలర్ల నుంచి దళారులు, మిల్లర్లు, వ్యాపారుల జేబులు నింపుతోంది. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తూ ఏటా కోట్లాది రూపాయిలు దోచుకుంటున్నారు. ప్రజలకు చేరాల్సిన బియ్యం దొడ్డిదారిలో మిల్లులకు చేర్చి అక్కడ పాలిష్ పట్టించి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. పీడీఎస్ బియ్యాన్నే పాలిష్ పెట్టి సీఎంఆర్‌కు సరఫరా చేస్తూ ప్రభుత్వానికే టోకరా వేస్తున్నారు. అధికార యంత్రాంగం సహకారంతో జరుగుతున్న ఈ అక్రమ దందాకు జిల్లా వేదికగా మారింది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో నెల్లూరు రూరల్, కావలి పరిధిలో దాదాపు 35 రైస్ మిల్లులు ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో రైస్ మిల్లులు ఉండడంతో కొన్ని మిల్లుల యజమానులు రేషన్ బియ్యం సేకరించి రహస్యంగా మిల్లుల్లో నిల్వ చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాల కాలంగా పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకోవడం, అధికారులతో లాలూచీ పెట్టుకొని పేదల బియ్యాన్ని పాలిష్ పెట్టి వివిధ రకాల బ్రాండ్ల పేరిట మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని పాత బియ్యం పేరుతో మార్కెట్లో రూ.45 నుంచి రూ.55 వంతున విక్రయాలు చేస్తున్నారు. మరి కొందరు పాలిష్ పెట్టిన బియ్యాన్ని జాక్‌పాట్ లారీల ద్వారా చెన్నైకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇతర జిల్లాల్లో సేకరణ నెల్లూరు రూరల్ ప్రాంతంలోని అల్లీపురం, నవలాకుతోట, గుడిపల్లిపాడు, నరుకూరు, కొత్తకాలువ సెంటర్, సౌత్ రాజుపాళెం ప్రాంతాల్లో రైస్ మిల్లులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దాదాపు 15 రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కావలి, జలదంకి ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లుల్లో కూడా రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 9 లక్షలకు పైగా కార్డులు అండగా, అందులో లక్షకు పైగా బోగస్ కార్డులు ఉన్నట్లు సమాచారం. కొంత మంది డీలర్లు ఏఏవై కార్డులు సృష్టించారు. ఏఏవై కార్డులకు 35 కేజీల బియ్యం పంపిణీ చేస్తారు. ఇలా ప్రతి నెల సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యం చౌకదుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 30 శాతం మంది కార్డుదారులు బియ్యం తీసుకోకుండా చౌక దుకాణం డీలర్లకు కేజీ రూ.6 చొప్పున విక్రయిస్తారు. జిల్లాలోని రేషన్ డీలర్ల నుంచి రైస్ మిల్లుల యజమానులు ఏర్పాటు చేసిన కొందరు దళారుల ద్వారా పీడీఎస్ బియ్యం సేకరిస్తున్నారు. డీలర్ దళారులకు కేజీ రూ.15 వంతున విక్రయాలు చేస్తున్నారు. జిల్లాలోని డీలర్ల నుంచి నెలవారీగా సేకరణలో పాటు ఎంఎల్ఎస్, పాయింట్ల వద్ద కూడా సిబ్బంది కక్కుర్తితో అక్కడ నుంచి కూడా బియ్యం సేకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా నెలవారీగా దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల వరకు దళారీ వ్యవస్థ ద్వారా రైస్ మిల్లులోకి వెళ్తున్నాయని సమాచారం. పీడీఎస్ బియ్యం సేకరణ నెల్లూరుకే పరిమితం చేయకుండా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా అధికారుల సహకారంతో నెల్లూరుకు అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం. సీఎంఆర్‌కు రేషన్ బియ్యం పౌరసరఫరా శాఖ ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వాటిని మర ఆడించిన బియ్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇలా ఏటా జరిగే ప్రక్రియ అయితే పలువురు రైస్ మిల్లుల యజమానులు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి సీఎంఆర్‌కు ఇస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. వివిధ జిల్లా నుంచి రహస్యంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు సమాచారం. బ్రాండ్ల పేరుతో ఎగుమతి పీడీఎస్ బియ్యాన్ని మూడు దఫాలుగా పాలిష్ పడుతారు. దీంతో ఆ బియ్యం సన్నాలుగా కనిపించేలా చేస్తారు. ఆ బియ్యాన్ని పలు రకాల బ్రాండ్ పేరుతో ఉన్న బ్యాగుల్లో నింపి రాత్రి వేళల్లో చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ బియ్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా జాక్‌పాట్ (బిల్లులు లేకుండా సరుకు తీసుకెళ్లే వాహనాలు) లారీల నుంచి చెన్నైకు తరలిస్తుంటారు. రెండు దశాబ్దాలుగా ప్రతి నిత్యం జాక్‌పాట్ లారీల ద్వారా బియ్యం తరలిస్తున్నారు. జాక్‌పాట్ లారీలను హైవేపై ఏ శాఖ అధికారులు తనిఖీలు చేయకుండా నెలవారీగా మామూళ్లు కూడా ఇస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యమే. రీసైక్లింగ్ బియ్యం అధిక శాతం చెన్నైకు తరలిస్తుంటారు. ప్రతి నెల సుమారు 60 లారీల బియ్యం చెన్నైకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నెల్లూరు మొలగొలుకలు, సన్నాలకు జాతీయ స్థాయి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ఆ బ్రాండ్ పేరుతో పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మాఫియాకు టీడీపీ నేతలు అండ టీడీపీ ఐదేళ్ల పాలనలో అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లుల యజమానులకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అండగా నిలిచారు. పేదల బియ్యాన్ని సేకరించి రీౖసైక్లింగ్ చేసి బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి విడుదల చేసే ప్రక్రియపై ఎలాంటి దాడులు జరగకుండా మాజీమంత్రి అండగా నిలవడంతో అక్రమ దందా ఐదేళ్ల కాలం యథేచ్ఛగా సాగింది. ప్రభుత్వం మారడంతోనే విజిలెన్స్ అధికారులకు స్వేచ్ఛ రావడంతో పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. ఇటీవల అల్లీపురంలోని ఓ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 1,500 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
మంత్రి ప్రత్తిపాటి నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా
-
‘సన్నాల’ పేరిట దగా..!
సూర్యాపేట : సన్న రకాలు.. ఈ బియ్యం కొనుగోలు చేశారంటే.. మరోమారు మా వద్దనే కొనుగోలు చేస్తారంటూ మాయమాటలు చెబుతూ కొందరు వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా కాలనీలు, వీధుల్లో కేకలు వేస్తూ సంచరిస్తున్నారు. సన్న రకం బియ్యం బహిరంగ మార్కెట్లో రూ.4400 కాగా.. తమ వద్ద రూ.3400 మాత్రమే అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. సన్న బియ్యాన్ని ఎలా గుర్తించాలని ప్రజలు అడగడమే ఆలస్యం.. వెంటనే సంచులు విప్పి సన్నబియ్యాన్ని చేతిలో పోసి అంటగడుతున్నారు. వారు వెళ్లిన క్షణాల్లోనే సంచులు విప్పి కొంచెం లోతుగా బస్తాలోకి చెయ్యి పెట్టి బియ్యం తీస్తే దొడ్డు బియ్యం దర్శనమిస్తున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకుని.. సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యం విక్రయిస్తున్న వ్యాపారులు ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ పట్టణాల్లోకి దిగడమే ఆలస్యం.. అక్కడి అక్రమ వ్యాపారులను పరిచయం చేసుకుంటున్నారని సమాచారం. మాస్ కాలనీల పేర్లు తెలుసుకుని అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. సన్న బియ్యం రూ.3400 విక్రయించడం ఏంటని ప్రశ్నిస్తే.. తాము పెద్ద రైతులమని.. మార్కెట్లో నేరుగా విక్రయించే కంటే ఇలా విక్రయిస్తే తమకుకొద్దోగొప్పో లాభమంటూ బుకాయిస్తూ అమాయయకుల నుంచి దోచుకుంటున్నారు.తమపై నమ్మకం లేకపోతే మా ఫోన్ నంబర్లు కూడా తీసుకోండంటూ నంబర్లను కూడా ఇచ్చి వెళ్తున్నారు. కానీ ఆ నంబర్లు పనిచేయకపోవడంతో కంగుతింటున్నారు. ఒక్కరిద్దరు వ్యాపారులు కలిసి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులే ఇలాంటి అక్రమ వ్యాపారాలకు తెర తీశారని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే పరిస్థితులు లేకపోవడంతో వ్యాపారులు ఇక సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి మర ఆడిస్తున్నారు. అట్టిబియ్యాన్ని ఆటోలు, టాటా ఏసీల్లో వేసుకుని ముగ్గురు నలుగురు వ్యాపారులు కలిసి సన్న బియ్యం అంటూ విక్రయిస్తున్నారు. అయితే ఈ అక్రమ వ్యాపారంలో బడా వ్యాపారులు హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా పోలీసు, పౌరసరఫరాల శాఖ అధికారులు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేయకుండా ఎలా కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నారో.. అదే రీతిలో సన్న బియ్యం పేరుతో దొడ్డుబియ్యం అంటగడుతూ మోసగిస్తున్న వారిపై కన్నేసి కటకటాలకు పంపించాలని ప్రజలు వేడుకుంటున్నారు. సూర్యాపేట పట్టణంలోని 10వ వార్డు చర్చికంపౌండ్‌లో బాణోతు సునిత అనే మహిళ నివాసముంటోంది. అయితే వీరునివాసముంటున్న ప్రాంతానికి ముగ్గురు గుర్తుతెలియని వ్యాపారులు ఆటోలో బియ్యం బస్తాలు వేసుకుని సన్న రకం బియ్యం అంటూ కేకలు వేసుకుంటూ వచ్చారు. కాగా, సునిత సన్న బియ్యం కావడంతో క్వింటా బియ్యం రూ. 3400 వెచ్చించి కొనుగోలు చేశారు. ఇంట్లోకి తీసుకెళ్లినబియ్యం సంచులను విప్పి చూడగా.. పై భాగంలో సన్నగా.. కింది భాగంలో మొత్తం దొడ్డు బియ్యం ఉండడంతో ఒక్కసారిగా అవాక్కైపోయింది. చేసేదేమి లేక వెంటనే తేరుకున్న ఆమె మోసం చేసిన బియ్యం వ్యాపారులను వెతుక్కుంటూ చర్చికంపౌండ్ నుంచి సీతారాంపురం కాలనీకి చేరుకుంది. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో లబోదిబోమంది. ఇలా సునిత ఒక్కరే కాదు..జిల్లా వ్యాప్తంగా అమాయకులు మోసపోతున్నారు. ఉదయం ఓ చోట.. సాయంత్రం మరో చోట పీడీఎస్ బియ్యాన్ని మర ఆడించిన కొందరు అక్రమ వ్యాపారులు సన్న బియ్యం పేరుతో అమాయకులకు అంటగట్టేందుకు రోజుకో చోట ప్రత్యక్షమవుతున్నారు. కాగా ఇటీవల కాలంలో నల్లగొండ, దేవరకొండ పట్టణాల్లో వందలాది క్వింటాళ్ల విక్రయించామని ఎక్కడా కూడా తమ బియ్యం బాగోలేదని చెప్పిన వారు లేరంటూ తెలుపుతున్నారు. ఉదయం నల్లగొండలో ఉంటే సాయంత్రానికి భువనగిరి లేదా దేవరకొండ పట్టణాల్లోకి ప్రవేశిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. కానీ ఆ ఫిర్యాదులను పోలీసులు స్వీకరించినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు లేకపోలేదు. -
పేదల బియ్యం.. మాఫియా వశం..!
అండదండలు పుష్కలంగా ఉండటంతో వీరు మరింతగా రెచ్చిపోతున్నారు.. చీకటి వ్యాపారాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు.. అదేమని ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగటమేగాక, ఎదురు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు.. అక్రమ బియ్యం వ్యాపారంతో అధికార పార్టీ చోటా నాయకులు రూ. లక్షలు సంపాదిస్తుంటే.. వారికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్య నేతలు మాత్రం కోట్లు గడిస్తున్నారు.. ముఖ్యంగా నరసరావుపేట, తెనాలి డివిజన్లలో రేషన్ మాఫియా జూలు విదిలిస్తోంది.. వీరిపై ఫిర్యాదు చేస్తే హతమార్చడానికి సైతం వెనకాడకపోవడంతో అధికారులు కూడా సంశయిస్తున్నారు. సాక్షి, గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇసుక, చౌక బియ్యం అక్రమ రవాణాకు అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులే అండదండలు అందిస్తూ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఇసుక మాఫియా రెచ్చిపోతూ మహిళా తహశీల్దారులపై దాడులకు తెగబడుతుండటం గమనార్హం. గుంటూరు జిల్లాలో సైతం ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు లోలోన మదన పడుతూ బయటకు చెప్పుకునేందుకు భయపడుతున్నారు. డీలర్ల జోలికి వెళ్లొద్దు.. జిల్లాలో చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న బియ్యం మాఫియాకు ముచ్చమటలు పట్టించిన విజిలెన్స్ అధికారులు వారి జోలికి వెళ్లకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి భార్య ఆదేశాల మేరకే రేషన్ దుకాణాల జోలికి వెళ్లాలంటే జంకుతున్నట్లు సమాచారం. ఒక వేళ పూర్తి స్థాయిలో సమాచారం అంది తనిఖీకు వెళ్లిన వెంటనే సదరు మంత్రి భార్య ఫోన్ చేసి ఆ దుకాణం తమ పార్టీకి చెందినవారిదేనని, చర్యలు తీసుకోకుండా వెనక్కు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేయడం పరిపాటిగా మారింది. ఇక రెవెన్యూ అధికారులైతే తమకేమైన సమాచారం అందితే వెంటనే సదరు రేషన్ డీలర్‌కు ఫోన్ చేసి తెలియపరచాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో బదిలీవేటు ఖాయమనే స్పష్టమైన ఆదేశాలు సదరు మంత్రి భార్య నుంచి అధికారులకు ఎప్పుడో అందాయి. దీంతో పోలీసు అధికారులు సైతం రేషన్ మాఫియా జోలికి వెళ్ళకుండా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన విజిలెన్స్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డితోపాటు సిబ్బంది కూడా సమర్ధవంతంగా పనిచేసి అక్రమ ఇసుక, బియ్యం రవాణాను నియంత్రించడంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమస్థానంలో గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాంటి విజిలెన్స్ శాఖలో ఏడాది కాలంగా స్తబ్దత నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక, బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందించడంతోపాటు, ప్రభుత్వ ఆదాయాన్ని సైతం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
బియ్యం మాఫియా!
జిల్లాలో బియ్యం మాఫియా విజృంభిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందించే చౌక బియ్యాన్ని దొడ్డిదారిన ఇక్కడకు దిగుమతి చేసుకుని పాలిష్ పట్టి అమ్ముతూ, కర్ణాటకకు ఎగుమతి చేస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. చెక్‌పోస్టులు, పోలీసులతో పాటు పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులకు మామూళ్లు సమర్పించి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చిత్తూరు ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీనేత బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి, చిత్తూరు: తమిళనాడులో పేదలకు ఒక్కో కుటుంబానికి 10 కిలోల మామూలు బియ్యం, 10 కిలోలు ఉప్పుడు బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇక్కడి అక్రమార్కులు ఆ బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి లారీల ద్వారా చిత్తూరుకు తరలిస్తున్నారు. దీంతోపాటు తమిళనాడులోని కాట్పాడి ప్రాంతం నుంచి బొమ్మసముద్రం మీదుగా ట్రైన్‌లోనూ చిత్తూరుకు చేరుస్తున్నారు. ఇక్కడికి చేరిన బియ్యాన్ని పాలిష్ పట్టి జిల్లాలో కొంత మేరకు విక్రయిస్తారు. మిగిలిన బియ్యాన్ని ప్రత్యేక లారీల ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు తరలిస్తారు. అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రమంతటా ఈ బియ్యాన్ని అమ్ముతున్నారు. తమిళనాడులో ఈ బియ్యం కిలో రూ.3 నుంచి రూ.4 కు మాత్రమే కొనుగోలు చేసి పాలిష్ పట్టి కిలో రూ.30 నుంచి రూ.40కి అమ్ముతున్నారు. రోజూ ఇలాంటి బియ్యం జిల్లా నుంచి కర్ణాటకకు 3 నుంచి 5 లారీల్లో తరలుతున్నట్టు సమాచారం. అధికారుల సహకారం.. బియ్యం అక్రమ రవాణాకు అటు తమిళనాడు అధికారులతో పాటు ఇటు చిత్తూరు జిల్లాకు చెందిన చెక్‌పోస్ట్, సివిల్‌పోలీసు, అటవీశాఖ, రెవెన్యూ, విజిలెన్స్, కమర్షియల్‌ట్యాక్స్ విభాగాలకు చెందిన కొందరు అధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ అక్రమ బియ్యం వ్యాపారం చిత్తూరు కేంద్రంగానే సాగుతున్నట్టు సమాచారం. చిత్తూరు ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీనేత మరికొందరితో కలిసి బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 12 సంవత్సరాలుగా ఆ నేత ఇదే వృత్తి సాగిస్తున్నాడు. పై స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతోనే కింది స్థాయి అధికారులు, సిబ్బంది వీరికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 170 బస్తాల బియ్యం స్వాధీనం ఇటీవల కర్ణాటకకు తరలిస్తున్న 170 బస్తాల తమిళనాడు బియ్యాన్ని చిత్తూరు పోలీసులు పెనుమూరు క్రాస్‌వద్ద స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఎస్సార్‌పురం మండలం నెలవాయి గ్రామానికి చెందిన భాస్కర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తాలూకా ఎస్సై ‘సాక్షి’కి తెలిపారు. -
బియ్యం మాఫియా
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్: నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా నిర్వహించుకునేందుకు అంతా ప్లాన్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలని కొందరు సన్నాహాలు చేసుకుంటుంటే.. సొంతూళ్లలోనే ఘనంగా శుభాకాంక్షలు చెప్పుకోవాలని మరికొందరు భావిస్తునానరు. దైవ దర్శనానికి వెళ్లే వారు కొందరైతే.. పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లేవారు మరికొందరు. మొత్తానికి అర్ధరాత్రి నుంచి హంగామా చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుని తెల్లవారే వరకు సందడి చేసేందుకు అపార్ట్మెంట్స్ వాసులు రెడీ అయిపోయారు. ఇక యువతైతే తమ బైక్‌లకు పని చెప్పే పనిలో పడ్డారు. అర్ధరాత్రి సెలైన్సర్లు తీసేసి నగరమంతా చక్కర్లు కొట్టేందుకు తహతహలాడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. న్యూ ఇయర్ నేపథ్యంలో వస్త్ర దుకాణాలన్నీ అప్పుడే కిటకిటలాడుతున్నారు. బేకరీలు, రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, బార్లు ప్రత్యేక ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నాయి. కాగా ఆధునిక టెక్నాలజీ ప్రభావంతో గ్రీటింగ్ కార్డుల కళ తప్పుతోంది. ఒకప్పుడు న్యూ ఇయర్ వేడుకలలో గ్రీటింగ్ కార్డు పాత్ర విడదీయరానిదిగా ఉండేది. చిన్నా పెద్ద అందరూ రంగురంగుల గ్రీటింగుకార్డులను తీసుకుని వారి భావాలను అందులో రాసిచ్చేవారు. కానీ, కాలం తెచ్చిన మార్పులకు గ్రీటింగ్‌కార్డు వెలవెలబోతోంది. సెల్‌ఫోన్ రాకతో ఎస్ఎంఎస్ ద్వారానే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. గ్రీటింగ్ కార్డులకు ఈ ఏడాది అంతగా డిమాండ్ లేదని కార్డుల విక్రేతలు చెబుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) చౌక ధాన్యపు డిపో (రేషన్ షాపు) ద్వారా పేదలకు అందజేసే సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. వ్యాపారులు-మిల్లర్లు సబ్సిడీ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యం అంటూ బ్రాండెడ్ పేర్లపై ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా బియ్యం మాఫియా సాగుతోంది. నియోజకవర్గం పరిధిలో ఉన్న కొడికొండ, తూమకుంట చెక్‌పోస్టుల్లో మామూళ్లు ముట్టజెప్పి బియ్యాన్ని యథేచ్ఛగా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గోరంట్ల మండలం కోరేవాండ్లపల్లి మీదుగా కదిరి, నల్లమాడ, తలుపుల, గాండ్లపెంటతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే బియ్యాన్ని రాష్ర్ట సరిహద్దు దాటిచ్చేస్తున్నారు. చిలమత్తూరు మండలం మరవకొత్తపల్లి, లక్ష్మీపురం(వీరాపురం) మార్గం గుండా కర్ణాటకకు చేరవేస్తున్నారు. - న్యూస్‌లైన్, హిందూపురం మునిసిపాలిటీ రీ సైక్లింగ్ చేసి..! జిల్లా వ్యాప్తంగా 2,720 చౌక డిపోల ద్వారా పేదలకు కిలో రూపాయితో ప్రభుత్వం బియ్యం అందిస్తోంది. 11,53,713 రేషన్ కార్డులకు నెలకు 14,745.756 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. కార్డుదారుల్లో కొందరు బియ్యం తీసుకోవడం లేదు. మరికొందరు తీసుకున్నా కిలో రూ.8 నుంచి రూ.10కు విక్రయించుకుంటున్నారు. స్టోర్లలో మిగిలిన, రేషన్‌కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని వ్యాపారులు పాలిష్ చేసి.. వాటిని మిల్లర్లకు కిలో రూ.12 నుంచి రూ.14 వరకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ చే సి.. ఇందులో కొంత సన్న బియ్యం కలుపుతున్నారు. కర్నూలు, నంద్యాల, బళ్లారి, కణేకల్లు ప్రాంతాల్లో పండిన సోనామసూరి అంటూ వీటిని ఆరంజ్ఫైన్ రైస్, దిల్కుష్, అంగూర్ ధార, వైట్ గోల్డ్ బ్రాండ్ సంచుల్లో నింపుతున్నారు. ప్యాకింగ్‌ను చూసి అందులో ఉన్నవి అసలైన సోనా అని వినియోగదారులు నమ్మి క్వింటాలు రూ.4వేలు పైబడి పెట్టి కొంటున్నారు. తర్వాత సోనామసూరి బియ్యం రుచి కనిపించకపోవడంతో తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు. కేసుల నమోదులో ఉదాసీనత చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడంలో అధికారులు ఉదాసీనత చూపుతున్నారు. సరుకు స్వాధీనం, జరిమానా విధించే పసలేని సెక్షన్ 6ఏ నిబంధనపైనే ఎక్కువగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ కేసును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విచారించి.. అపరాధ రుసుం విధించడం, స్వాధీనం చేసుకున్న సరుకులో 20 నుంచి 30 శాతాన్ని ప్రభుత్వ పరం చేసే వెసులుబాటు ఉంటుంది. ఇది అక్రమార్కులకు అంత నష్టం ఉండదు. పటిష్టమైన సెక్షన్‌గా భావించే పీడీఎస్ అక్రమ నియంత్రణ నిబంధన 17డీ కింద క్రిమినల్ కేసు నమోదు చేస్తే.. అక్రమార్కుల ఆట కట్టించే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ ్లకు తలొగ్గి అధికారులు 17డీ నిబంధన కింద కేసులే నమోదు చేయడం లేదు. హిందూపురం నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో 6ఏ నిబంధన కింద ఆరు కేసులు నమోదయ్యాయి. అనంతలో వీవీఎస్ భారత జట్టు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఏడాది జూలై 18న ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు. అకాడమీ క్రీడాకారులకు పలు సూచనలు ఇచ్చి స్టేడియంలోని సౌకర్యాలపై ప్రశంసలు కురిపించాడు. ఆర్టీసీ క్రీడోత్సవాలు అదరహో నవంబర్ 26 నుంచి 28 వరకు ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రస్థాయి సాృస్కతిక, క్రీడోత్సవాలు అనంతపురంలో జరి గాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జోన్ల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు వచ్చారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి. సత్తా చాటిన బుద్ధిమాంద్య క్రీడాకారులు ఆస్ట్రేలియాలో జరిగిన పసిఫిక్ స్పెషల్ ఒలింపిక్స్‌లో ఆర్డీటీకి చెందిన బుద్ధిమ్యాంద్యపు క్రీడాకారులు సత్తాచాటారు. ఏకంగా 26 పతకాలు సాధిం చారు. ఇందులో 10 బంగారు పతకాలు ఉన్నాయి. హాకీలో ఆణిముత్యాలు ఇండియా సబ్ జూనియర్ హాకీ శిబిరానికి ఆర్డీటీ క్రీడాకారిణులు మాధవి, నళిని ఎంపికయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సౌత్ ఇండియా హాకీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన, ఆర్డీటీ హాకీ అకాడమీలోని 12 మంది క్రీడాకారిణులు ఎంపికయ్యారు. 18 మంది ఉండే జట్టులో 12 మంది మన జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. రంజీలకు ప్రసాద్‌రెడ్డి గుడ్‌బై ఆంధ్ర రంజీ జట్టుకి ప్రసాద్‌రెడ్డి గుడ్‌బై చెప్పాడు. నవంబర్ 17న తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. ఆంధ్ర క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాంఛోఫై తదితరులు ప్రసాద్ రెడ్డి సేవలను కొనియాడారు. ఆంధ్ర రంజీ కెప్టెన్‌గా ప్రశాంత్ అనంత క్రికెట్ ఆణిముత్యం డీబీ ప్రశాంత్ అతి చిన్న వయసులో ఆంధ్ర జట్టు పగ్గాలు చేపట్టాడు. జిల్లా క్రికెట్ చరిత్రలో ప్రసాద్ రెడ్డి, షాబుద్దీన్ తర్వాతి స్థానాన్ని భర్తీ చేసి యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. తన కెప్టెన్సీలో తొలి మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌పై 199 పరుగులు చేశాడు. తొలిసారి బ్యాడ్మింటన్ పోటీలు బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు అనంతపురంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. పుల్లెల గోపీచంద్ కుమారుడు సాయివిష్ణు, కుమార్తె గాయత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆల్ ఇండియా హాకీ టోర్నీ అనంత క్రీడాగ్రామంలో ఆల్ ఇండియా హాకీ టోర్నీ డిసెంబర్లో జరిగింది. దేశవ్యాప్తంగా 19 విశ్వవిద్యాలయాల జట్లు పాల్గొన్నాయి. టోర్నీ విజేతగా బెంగళూరు జట్టు, రన్నర్స్‌గా పూర్వాంచల్ జట్లు నిలిచాయి. సౌత్‌జోన్ హాకీ పోటీల ప్రారంభోత్సవానికి డీజీపీ ఆపరేషన్స్ రాముడు, ముగింపు కార్యక్రమానికి డీపీజీ ప్రసాద్ రావు హాజరయ్యారు. 11 రోజుల పాటు హాకీ పోటీలు పండుగలా జరిగాయి. ఎస్కేయూ తొలిసారిగా సూపర్ లీగ్ పోటీలకు అర్హత సాధించింది. కాగా పోటీల్లో ఎంపీడీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకపోవడం పెద్ద దుమారం రేపింది. సాఫ్ట్‌బాల్ జట్టులోకి జగదీష్ జిల్లాకు చెందిన జగదీష్ ఇండియా సాఫ్ట్‌బాల్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జగదీష్ ఎంపికను ప్రకటించింది. ఇండియా జట్టు మేనేజర్‌గా ఉప ఖజానా అధికారి నరసింహం నియమితులయ్యారు.