మాల్స్‌గా మారనున్న రేషన్ దుకాణాలు
గూడూరు:
త్వరలో రేషన్ దుకాణాలన్నీ అన్ని సరుకులు దొరికే మాల్స్‌లా మారనున్నాయని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ అన్నారు. గూడూరు రెండో పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎ థియేటర్ సమీపంలో ఉన్న పౌర సరఫరా గోదామును ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో ఉన్న సరుకుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వాటి తూకాల్లో తేడాలేమైనా ఉన్నాయా? అని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో రేషన్ దుకాణాలు మాల్స్‌ను తలపించేలా అన్ని సరుకులను అందజేస్తామన్నారు. ప్రభుత్వం హమాలీలు, రేషన్ డీలర్లకు కమీషన్లు పెంచిందన్నారు. రానున్న క్రిస్‌మస్, సంక్రాంతి పండగలకు చంద్రన్న కానుకలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటన్నింటికి రూ. 400 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆయన వెంట డీటీ నిరంజన్ ఉన్నారు.