మెదక్ (నారాయణఖేడ్) : రేషన్ షాపులపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నారాయణఖేడ్లోని రెండు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రెండు వారాల నుంచి రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తున్న అధికారులు ఓ డీలర్‌పై చర్యలు తీసుకున్నారు. తాజాగా డీఎస్‌ఓ రమేష్ ఆదేశాల మేరకు పటాన్‌చెరు డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్, సంగారెడ్డి డిప్యూటీ తహశీల్దార్ సురేష్‌కుమార్‌లు పట్టణంలోని 34, 49 నెంబరు రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను, నిల్వ వస్తువులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పలువురు కార్డుదారులతో సరుకుల పంపిణీ తీరుపై అడగి తెలుసుకున్నారు. ఏ ఏ సరుకులు ఎంతమేర ఇస్తున్నారు, కార్డులో ఉన్న సభ్యుల సంఖ్య, ఇచ్చే ధరలపై కార్డుదారులను వివరాలు అడగి నమోదు చేసుకున్నారు. పట్టణంలో సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదన్న ఫిర్యాదులపై డీఎస్‌ఓ ఆదేశాలమేరకు తనిఖీలు చేపట్టినట్లు డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్ తెలిపారు. కార్డుదారుల స్టేట్‌మెంట్ నమోదు చేస్తున్నామన్నారు. ఏవైనా తేడాలు వస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
Published Thu, Jul 16 2015 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement