civil supplies officers
-
రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 36 మంది రా రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల మేరకు జరిమానా విధించామని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం రైస్‌మిల్లర్లతో సమీక్షించిన అనంతరం 2020–2021 వానాకాలానికి సంబంధించి డిఫాల్ట్ అయిన రా రైస్‌మిల్లర్లకు జరిమానా విధించినట్లు వివరించారు. 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వలేదని, గడువులోగా ఇవ్వని 36 మంది రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ.. తక్షణమే రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. 2022–2023 వానాకాలానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ డెలివరీపై ఖీమ్యానాయక్ ఆరా తీశారు. 1,46,341 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6,931 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత తొందరగా సీఎమ్మార్‌ను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. డీఎస్వో ఎస్.జితేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ జీఎం జితేంద్రప్రసాద్, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు, రైస్‌మిల్లర్లు గరిపెల్లి ప్రభాకర్, చేపూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి..
నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా): ఆమె చదివింది ఏడో తరగతి. అయినా వివిధ శాఖల అధికారినంటూ ప్రజలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడింది. శనివారం దూబచర్లలో బేకరీ, భోజన హోటల్‌ను చెక్ చేసి వసూళ్లకు పాల్పడుతుండగా సివిల్ సప్లయిస్ డీటీ సుజాత, వారి సిబ్బంది ఈ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాడేపల్లిగూడేనికి చెందిన కాళ్ల రమాదేవి నేషనల్ కన్సూ్యమర్ రైట్స్ కమిషన్ మహిళా చైర్‌పర్సన్‌గా ఐడీ కార్డుతో తన షిఫ్ట్ డిజైర్ కారులో వివిధ ప్రాంతాలలో సివిల్ సప్లయిస్ అధికారిగా, ఫుడ్ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తూ హోటళ్లు, బేకరీలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకుంటోంది. చదవండి: ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ.. ఈ విషయం సివిల్ సప్లయిస్ అధికారుల దృష్టికి రాగా కొంతకాలంగా ఆమె కోసం గాలిస్తున్నారు. శనివారం దూబచర్లలో బెంగళూరు బేకరీకి వెళ్లి గృహ వినియోగ గ్యాస్ వ్యాపారానికి వినియోగిస్తున్నారంటూ బెదిరించి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా యజమాని ప్రదీప్ రూ.3 వేలు ఇచ్చాడు. అదే గ్రామంలో శివాలయం దగ్గర భోజన హోటల్‌కు వెళ్లి వంటకు వినియోగిస్తున్న రెండు గ్యాస్ సిలిండర్లు సీజ్ చేస్తానని బెదించింది. కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు ఇవ్వాలంది. యజమాని ముగ్గాల సర్వేశ్వరరావు రూ.2 వేలు ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఆ గ్రామ వీఆర్ఏ రవి తమ సివిల్ సప్లయిస్ డీటీ సుజాతకు సమాచారం అందించి నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమలకు చెందిన చెల్లా ఏసు తప్పించుకుని పారిపోయాడు. పారిపోయిన చెల్లా ఏసుపై, ఆమె కారు డ్రైవరు దూబచర్ల గాంధీకాలనీకి చెందిన బోడిగడ్ల బాలరాజును, నకిలీ అధికారి రమాదేవిపై సీఐ లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు. -
పేదల బియ్యం... పెద్దోళ్లకు వరం
గుంటూరు వెస్ట్: బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తోందని తెలిసి గుంటూరు జిల్లా నరసరావుపేటలో సోదాలకెళ్లిన పౌర సరఫరాల అధికారులను ఓ ప్రముఖ నాయకుడి కుమారుడు బియ్యం గోడౌన్లోనే నిర్బంధిస్తే.. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే గాని వారిని విడుదల చేయలేని దుస్థితి.. లారీ నిండా ఉన్న పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సంగతి తెలుసుకుని ఆ లారీని గురజాల ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌కు అధికారులు తీసుకెళ్తే .. పోలీసులను సైతం బెదిరించి దానిని తన అడ్డాకు తరలించుకుపోయాడు మరోనాయకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా... లెక్కకు మించిన ఉదాహరణలు. పల్నాడు ప్రాంతంలో గత టీడీపీ నాయకుల దాష్టీకాలపై కనీసం ఫిర్యాదు చేసే అవకాశం కూడా ప్రజలకు లేకుండా పోయింది. టీడీపీ నేతల అరాచకాలపై విసిగిపోయిన ప్రజలు ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఇలాఖాలోనే ఈ దోపిడీ జరగడం విశేషం. నెలకు రూ.20 కోట్లకు పైగానే తినేశారు పల్నాడు ప్రాంతంలో దాదాపు 30 శాతం రేషన్ బియ్యం కేవలం కొందరు నాయకుల చేతిలోకి వెళుతోంది. దీని విలువ దాదాపు రూ.20 కోట్లు పైమాటే. ఈ బియ్యాన్ని నాయకులు ఇతర రాష్ట్రాలకే కాకుండా, కృష్ణపట్నం, కాకినాడు పోర్టులగుండా విదేశాలకు తరలిస్తున్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. ఈ అక్రమ బియ్యాన్ని గతంలో ముట్టుకోవాలన్నా అధికారులు భయపడే పరిస్థితి. మరీ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే అసలు రేషన్ దుకాణం నిర్వహించే నిజమైన యజమాని కూడా ఉండకుండా అక్రమార్కులే నేరుగా మొత్తం బియ్యాన్ని కాజేస్తున్న వైనాన్ని కూడా రాష్ట్ర అధికారులు గుర్తించారు. దాడులను ఉధృతం చేసిన అధికారులు రెండు నెలల నుంచి జిల్లా పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖాధికారులు సమన్వయంతో అక్రమ బియ్యం నిల్వలు, రవాణాపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.2 కోట్ల 82 లక్షలకు పైగా విలువైన 337 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వందమందికి పైగా 6ఎ కేసులు నమోదు చేశారు. వీటిలో అధిక సంఖ్యలో పల్నాండు ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం. దాడులు కొనసాగుతాయి పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు కాజేస్తామంటే ఊరుకునేది లేదు. ఇప్పటికే అనేక మందిపై దాడులు చేశాం. రానున్న కాలంలో మరిన్ని దాడులు కొనసాగుతాయి. – టి.శివరామ్ ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి -
మిల్లింగ్ చిచ్చు!
సాక్షి, కొరుట్ల : ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’గా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లాలో మిల్లింగ్ చిచ్చు రేపుతుంది. జిల్లాలో పండిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు తరలించడంపై అధికారులు తలోతీరుగా వ్యవహరించడం చర్చనీయమైంది. జిల్లాలో పండిన వరిధాన్యంలో సగానికి మించి మిల్లింగ్ కోసం పొరుగున ఉన్న జిల్లాలకు సరఫరా చేయాలని వారం క్రితం సివిల్‌సప్లయ్ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో స్థానిక రైస్‌మిల్లర్లకు నష్టమేకాకుండా ప్రభుత్వంపై రవాణాభారం పడుతుందని స్థానిక రైస్‌మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రైస్‌మిల్లర్లు జిల్లాలోని ఓ కీలక అధికారికి విన్నవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మిల్లర్లతో ఓ కీలకాధికారి చేసిన వ్యాఖ్యలు జిల్లా రైస్‌మిల్ వర్గాల్లో చర్చనీయంగా మారడమే కాకుండా.. అధికారుల మధ్య సమన్వయలోపానికి అద్దంపట్టాయి. ఇదీ సంగతి... జగిత్యాల జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో జగిత్యాల జిల్లాలో సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పారాబాయిల్డ్, బాయిల్డ్ రైస్‌మిల్లులు కలిపి మొత్తం 95 వరకు ఉన్నాయి. వీటి మిల్లింగ్ సామర్థ్యం ఎంత తక్కువ అనుకున్న 2.80 లక్షల మెట్రిక్ టన్నులుగా రైస్‌మిల్లర్లు చెప్పుకొస్తున్నారు. అధికారులు మాత్రం జగిత్యాల జిల్లాలోని రైస్‌మిల్లర్లకు కేవలం 1,35,250 మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యం మాత్రమే ఉందని నిర్ణయించారు. దీంతో మిగిలిన 1,15,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని రైస్‌మిల్లులకు పంపి మిల్లింగ్ చేయించాలని నిర్ణయించారు. స్థానిక రైస్‌మిల్లులకు సామర్థ్యం ఉన్నా.. ఇతర జిల్లాలకు ధాన్యం తరలించడంతో తమకు నష్టం జరుగడమే కాకుండా రూ.17కోట్ల మేర రవాణాభారం, సుమారు 5 వేల మంది కార్మికుల ఉపాధికి నష్టం జరుగుతుందని పేర్కొంటూ అధికారుల నిర్ణయంపై రైస్‌మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సమన్వయ లోపమేనా ? పొరుగు జిల్లాల్లో ధాన్యం మిల్లింగ్ విషయంలో జిల్లాలోని రైస్‌మిల్లర్లు చేసిన వినతిని స్వీకరించిన కీలకాధికారి ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైన రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న రైస్‌మిల్లులకు మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ పొరుగు జిల్లాలకు ధాన్యం తరలింపునకు కిందిస్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవడంపై రైసుమిల్లర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చెప్పిన కిందిస్థాయి సిబ్బంది నిర్ణయంతో అయోమయానికి గురవుతున్నారు. అధికారుల మధ్య సమన్వయలోపానికి అద్దంపట్టినట్లయింది. సమన్వయలోపంతోనే స్థానికంగా ఉత్పత్తి అయిన ధాన్యం పొరుగు జిల్లాలకు తరలుతుందనే అనుమానాలు రేకెత్తాయి. జిల్లాలోని రైస్మిల్లర్లలోనూ ఈ విషయం ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. పొరుగు జిల్లాలకు ధాన్యం తరలింపుపై రైస్‌మిల్లర్లు తాజామాజీ ఎమ్మెల్యేలతో మొరపెట్టుకున్న ఫలితం దక్కలేదని సమాచారం. -
సర్వేశ్వరా..!
తెల్లకార్డు.. పేదలకు ఆధారం.. పల్లె నుంచి పట్టణ ప్రజల వరకు కార్డు కోసం ఎదురు చేస్తుంటారు.. రేషన్ నుంచి వైద్యం వరకు కార్డుతోనే లబ్ధి.. సబ్సిడీ అవకాశం ఉండడంతో పేదలు ఆసరాగాభావిస్తున్నారు.. ప్రభుత్వం మాత్రంఎప్పటికప్పడు దొడ్డిదారిన తొలగించేందుకు ఎత్తులు వేస్తుంటోంది.. అందులో భాగంగా సాధికార సర్వే చేయించింది. దీంతో లక్షల కార్డులు రద్దుకానున్నాయని వార్తలు వస్తున్నాయి.. దీంతో పేదలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, విజయవాడ: జిల్లా 12.57లక్షల తెల్ల రేషన్‌కార్డు లున్నాయి. గత ఏడాది జిల్లాలో నిర్వహించిన సాధికార సర్వేలో వేలాది మంది సర్వే చేయించుకోలేకపోయారు. ప్రస్తుతం తెల్లరేషన్‌కార్డు ఉండి సాధికార సర్వే చేయించుకోని వారు జిల్లాలో 2.07 లక్షలు మంది ఉన్నట్లు పౌరసరఫరాల అధికారులు నిర్ధారించారు. ఈ కార్డులను త్వరలోనే సాధికార సర్వే చేయించాలని, సాధికార సర్వేలో గుర్తింపు పొందని కార్డులను తొలగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. సర్వేలో ఆర్థిక పరిస్థితిని తెల్లకార్డు కొనసాగించలా లేదా అని నిర్ణయించనున్నారు. సర్వే జరుగుతున్న సమాచారం చాలా మందికి తెలియదు. సర్వే చేసిన రెవెన్యూ, నగర పాలకసంస్థ సిబ్బంది కేవలం కొన్ని ప్రాంతాలను మాత్రమే చేసి, పేదల బస్తీలు, మారు మూల ప్రాంతాలను సర్వే చేయలేదు. సర్వే సరిగా చేయకుండా ఇప్పుడు కార్డులు తొలగిస్తే తాము ఇబ్బంది పడిపోతామని కార్డుదారులు వాపోతున్నారు. కొత్త రేషన్ కార్డులకు సాధికార సర్వేఅవసరం... జనవరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లాలో సుమారు 30 వేల మంది కొత్తగా తెల్లరేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తుతో పాటు సాధికార సర్వే చేయించినట్లు గుర్తింపు ఉంటేనే కొత్త కార్డు జారీ చేస్తామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. అందువల్ల సాధికార సర్వే చేయించుకోకపోతే చేయించుకుని ఆ తరువాతనే తెల్ల రేషన్‌కార్డులు తీసుకోవాలని సూచిస్తున్నారు. తిరిగి సాధికార సర్వే... జిల్లాలో మరోకసారి సాధికార సర్వే చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 15 రోజుల్లో సర్వేలో ప్రతిఒక్కరూ పాల్గొన్నాలని కలెక్టర్ లక్ష్మీకాంతం కోరారు. దీనికోసం తిరిగి టీమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా తెల్లకార్డు కలిగి ఉండి సాధికార సర్వేలో చేయించుకోని వారు తక్షణం సర్వేలో పాల్గొనాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వరరావు తెలిపారు. అందువల్ల తెల్లకార్డుదారులు తప్పని సరిగా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి సాధికార సర్వేలో తమ పేర్లు నమోదయ్యేటట్లు చూసుకోవాలన్నారు. -
220 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
కొత్తగూడెం రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు కొత్తగూడెం సమీపంలో మంగళవారం పట్టుకున్నారు. సివిల్ సప్లై డీటీ కృష్ణప్రసాద్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని వెంకటసాయి ట్రేడర్స్ నుంచి 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లోడు లారీ సోమవారం రాత్రి 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు బయల్దేరింది. ఈ క్రమంలో కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలోని లోతు వాగు వద్ద డీటీలు కృష్ణప్రసాద్, రామకృష్ణ, జగదీష్, సోందు మాటువేసి బియ్యం లారీని పట్టుకున్నారు. అందులోనివి రేషన్ బియ్యం అని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొంత బియ్యాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. తర్వాత లారీని పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. డ్రైవర్ షణ్ముఖ, లారీ యజమా ని గార్లపాటి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీటీ తెలిపారు. -
65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నల్గొండ: నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం కమ్మారంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 65 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యం బస్తాలను సీజ్ చేశారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేశారు. కమ్మారం గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు ఉన్నతాధికారులు ఆగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో అధికారులు సదరు ఇంటిపై దాడి చేశారు. -
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
మెదక్ (నారాయణఖేడ్) : రేషన్ షాపులపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నారాయణఖేడ్‌లోని రెండు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రెండు వారాల నుంచి రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తున్న అధికారులు ఓ డీలర్‌పై చర్యలు తీసుకున్నారు. తాజాగా డీఎస్ఓ రమేష్ ఆదేశాల మేరకు పటాన్చెరు డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్, సంగారెడ్డి డిప్యూటీ తహశీల్దార్ సురేష్‌కుమార్‌లు పట్టణంలోని 34, 49 నెంబరు రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను, నిల్వ వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కార్డుదారులతో సరుకుల పంపిణీ తీరుపై అడగి తెలుసుకున్నారు. ఏ ఏ సరుకులు ఎంతమేర ఇస్తున్నారు, కార్డులో ఉన్న సభ్యుల సంఖ్య, ఇచ్చే ధరలపై కార్డుదారులను వివరాలు అడగి నమోదు చేసుకున్నారు. పట్టణంలో సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదన్న ఫిర్యాదులపై డీఎస్ఓ ఆదేశాలమేరకు తనిఖీలు చేపట్టినట్లు డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్ తెలిపారు. కార్డుదారుల స్టేట్మెంట్ నమోదు చేస్తున్నామన్నారు. ఏవైనా తేడాలు వస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
రూ. 58 లక్షల విలువైన బియ్యం బస్తాలు పట్టివేత
నెల్లూరు: నెల్లూరు నగరంలోని స్టోనౌన్ పేటలోని రైస్‌మిల్లుపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే జిల్లాలోని కావలి పట్టణంలో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు లారీలలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు లారీలను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ. 8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.