రేషన్ షాపు డీలర్ల కోసం నిర్వహిస్తున్న పరీక్షలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ చేతివాటం చూపించారు. తమకు అనుకూలమైన వారికి ముందుగానే పరీక్షా పత్రం అందించి తమవంతు సాయం చేశారు. కాకినాడ డివిజన్ పరిధిలోని 128 రేషన్ షాపులకు డీలర్ల ఎంపిక కోసం ఈ రోజు పరీక్ష జరగనుండగా.. నిన్న సాయంత్రమే అధికార పార్టీ నేతలు జవాబులతో కూడిన ప్రశ్నపత్రాలను తమ అనుకూలులకు అందించారు.