exam paper leak
-
నీట్ పై ఆగ్రహం.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు
-
గుజరాత్ ఎగ్జామ్ పేపర్.. హైదరాబాద్‌లోనే ‘లీకు’వీరులు!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(జీపీఎస్ఎస్బీ) నిర్వహించతలపెట్టిన పంచాయత్ జూనియర్ క్లర్క్ పరీక్షపత్రం లీక్ లింకులు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. నగర శివార్లలో ఉన్న కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రితమైన ఈ పరీక్షపత్రం అక్కడ నుంచే బయటకు వచి్చనట్లు తేలింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం మెరుపుదాడి చేసిన ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు ఈ లీకేజ్ స్కామ్‌లో మొత్తం 15 మంది అరెస్టు అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన పరీక్షను జీపీఎస్ఎస్బీ రద్దు చేసింది. వాస్తవానికి గుజరాజ్ పంచాయత్ శాఖలో 1,181 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 9.53 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్రంలోని 2,995 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అయితే శనివారంరాత్రి ఈ పేపర్ లీక్ జరిగినట్లు ఏటీఎస్‌కు ఉప్పందడంతో వడోదరలోని అట్లాదర ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌పై అధికారులు దాడి చేశారు. ఈ సెంటర్ నిర్వాహకుడు భాస్కర్ చౌదరితోపాటు ఏడుగురిని అరెస్టు చేసిన ఏటీఎస్ అక్కడ ఉన్న పరీక్షపత్రం ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురిలో ఇద్దరు 2019 నాటి బిట్స్ పిలానీ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గోల్మాల్ వ్యవహారంలో ఉన్నారని, అప్పట్లో సీబీఐ ఈ ద్వయాన్ని అరెస్టు చేసిందని ఏటీఎస్ ప్రకటించింది. ఒడిశా నుంచి..: భాస్కర్‌చౌదరి గుజరాత్‌లోని వివిధ నగరాలతోపాటు బిహార్, ఒడిశాల్లోనూ పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఒడిశాలో మరో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రదీప్ నాయక్ ద్వారా తనకు పరీక్షపత్రం అందిందని, దాని కోసం భారీ మొత్తం ఖర్చు చేశా నని విచారణలో అతడు బయటపెట్టాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లింకులు వెలుగుచూశాయి. వివిధ సెట్స్ పరీక్షపత్రాలు ముద్రించే బాధ్యతల్ని జీపీఎస్ఎస్బీ ఐడీఏ బొల్లారంలోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్‌తోపాటు ఏపీలో ఉన్న మరో ప్రెస్‌కు అప్పగించింది. ఈ ప్రెస్‌లో ఒడిశాకు చెందిన జీతి నాయక్, సర్దోకర్ రోహా పనిచేస్తున్నారు. జీతినాయక్‌కు ప్రదీప్‌నాయక్‌తో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. జీతి ఈ పేపర్‌ను అతడికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు. సర్దోకర్ రోహా సహకారంతో పరీక్షపత్రాన్ని ప్రింటింగ్ ప్రెస్ నుంచి తస్కరించాడు. దీన్ని వాట్సాప్ ద్వారా ప్రదీప్‌కు పంపగా, అతడి నుంచి భాస్కర్‌కు చేరింది. ఈ వ్యవహారంలో మరికొందరు మధ్యవర్తులుగా వ్యవహరించారని ఏటీఎస్ గుర్తించింది. వీరితోపాటు ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్న అభ్యర్థుల కోసం గాలిస్తోంది. -
పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాలు లీక్.. ఆ రెండు పరీక్షలు రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నా పత్రాలు లీక్ అవ్వడంతో ఈ నెల 8,9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సాంకేతిక విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. రద్దైన రెండు పరీక్షలు ఈ నెల 15,16 తేదీల్లో జరుగుతాయని బోర్డు అధికారులు వెల్లడించారు. కాగా ఫిబ్రవరి 8న మొదలైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే బాలసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీకయినట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన ఇతర జిల్లాల్లోని ప్రిన్సిపల్స్ బోర్డుకు సమాచారం అందించడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. బోర్డు అధికారుల ఫిర్యాదు మేరకు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అబ్జర్వర్‌గా ఉన్న అధికారిని సస్పెండ్ చేశారు. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో పరీక్ష కేంద్రాన్ని కూడా రద్దు చేశారు. అక్కడ పరీక్షలు రాస్తున విద్యార్థులను వేరే కేంద్రాలకు బదిలీ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీకి షోకాజు నోటీసులు జారీ చేశారు. కాలేజీ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని విద్యామండలి ప్రశ్నించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. చదవండి: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -
Abdullapurmet: పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్స్ లీక్
-
స్టీల్‌ప్లాంట్ జేటీ పరీక్ష పేపర్ లీక్..!
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ పరీక్ష పత్రం లీకేజీపై వదంతులు చెలరేగాయి. మంగళవారం రాత్రి మెకానికల్ పేపర్‌కు సంబంధించిన ప్రశ్నలు స్క్రీన్ షాట్లు రూపంలో వాట్సప్‌లలో హల్చల్ చేశాయి. స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ, ఓసీఎం పరీక్షకు ఈ నెల 7, 8వ తేదీల్లో దేశంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 68 వేల మంది దరఖాస్తు చేశారు. అయితే పరీక్షలు ముగిసిన వెంటనే కాకుండా రెండు రోజుల తర్వాత వాట్సాప్‌లలో ప్రశ్నలు రావడంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చిన ప్రశ్నలు ఈసారి జరిగిన పరీక్షలవా..? లేక గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించినవా..? లేదా మార్ఫింగ్ చేశారా..? అన్నది తెలియాల్సి ఉంది. వచ్చిన ప్రశ్నలు ఈ నెల 8న పరీక్ష జరిగిన ఒక కేంద్రం నుంచి ఒకే సిస్టం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌లను అనుమతించనప్పటికీ ప్రశ్నలు ఎలా వచ్చాయన్నది సందేహాస్పదంగా ఉంది. ఈ అంశంపై యాజమాన్యం స్పందిస్తేనే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. -
ఉరుకులు.. పరుగులు
సాక్షి, నెట్వర్క్ : మరికల్లో జరిగిన ఎస్సెస్సీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్‌గానే స్పందించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ అనురాధ, ఆర్జేడీ విజయలక్ష్మి, డీఈఓ సోమిరెడ్డిలతోపాటు ఇతర అధికారులు బుధశారం ఉరుకులు, పరుగులు పెట్టడంతోపాటు క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని సైతం పరుగులు పెట్టించారు. స్వయంగా ఉన్నతాధికారులు సైతం సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా బాధ్యులపై కఠినంగా వ్యవహరించారు. ఇప్పటికే 11 మందిపై వేటుపడింది. ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. భూత్పూర్ ఓ విద్యార్థి డిబార్ మండల కేంద్రంలోని రెండు సెంటర్లలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను బుధవారం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆకస్మిక తనిఖీ చేశారు. పంచవటి విద్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదుల వెనుక నుంచి వెళ్లి కలెక్టర్ పర్యవేక్షించారు. విద్యార్థులు కిటికీల నుంచి చీటీలు పడేసినట్లు గమనించిన కలెక్టర్ కొన్ని చీటీలు తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిలో ఉన్న అక్షరాలను గుర్తించి ఓ గదిలో విద్యార్థుల రాత ట్యాలీ చేసి పరిశీలించారు. మరో చీటీలో ఏకంగా విద్యార్ధి పేరు చీటీపై రాసినట్లు గుర్తించిన కలెక్టర్ ఆ విద్యార్థి గురించి ఆరా తీశారు. కాసేపటి తర్వాత మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని గురించి డీబార్ చేయాలని చీఫ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించి వెళ్లి పోయారు. ఇదిలాఉండగా కలెక్టర్ తనిఖీకి రావడంతో ఇన్విజిలేటర్లు ఆందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారుల తనిఖీ నారాయణపేట రూరల్: మరికల్లో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై అప్రమత్తమైన విద్యాశాఖా అధికారులు పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి పరీక్ష కేంద్రాల తనిఖీ ముమ్మరం చేశారు. డీఈఓ సోమిరెడ్డి, నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాధిత్యాతో పాటు మండలానికి ప్రత్యేక పరిశీలకులుగా నియమించిన జిల్లా సివిల్ సప్లయీస్ డీఎం భిక్షపతి, ఏఎంఓ రవీందర్, ఎంపీడీఓ వెంకటయ్య పట్టణంలోని ఆరు కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ గ్రౌండ్, బాలికల ఉన్నత పాఠశాల చుట్టు పోలీసు, రెవిన్యూ సిబ్బందితో బందోబస్తు పెంచారు. అలాగే మోడ్రన్ స్కూల్ కేంద్రంలో ఎస్ఐ ఎం.కృష్ణయ్య ఆధ్వర్యాన వీడియో చిత్రీకరణ చేపట్టారు. డీఈఓ హల్చల్ మరికల్: స్థానిక బాలుర, బాలికల ఉన్నత పాఠశాలోని పరీక్ష కేంద్రాలను బుధవారం డీఈఓ సొమిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి హల్చల్ చేశారు. గణితం పేపర్–1 పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్యాడ్లు, చూట్టు పక్కల ప్రాంతాలను క్షుణంగా పరిశీలించారు. ఎవరైనా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎఫ్ఓ పరిశీలన అడ్డాకుల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎఫ్ఓ గంగారెడ్డి తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని గదులన్నింటినీ ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావుతో కలిసి పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లను, నిర్వాహకులను ఆదేశించారు. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ : ఎస్పీ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో కలకలం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌పై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే మరికల్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీక్‌పై కేసు నమోదు చేయించిన ఎస్పీ అనురాధ స్వయంగా దృష్టిసారించారు. ఈ కేసులో పోలీసులు చేసిన విచారణలో లభించిన సాక్ష్యాధారాల మేరకు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఎస్పీ ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెన్షన్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ సున్నితమైన అంశాల పట్ల నిర్లక్ష్యం వహించడం, వ్యక్తిగత లాభాపేక్షతో వ్యవహరించడం ఏమాత్రం సహించరాదని స్పష్టం చేశారు. విధులు పట్ల ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. భూత్పూర్లోని ఓ పరీక్ష కేంద్రం వెనకాల -
ఆర్మీ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్షలు రద్దు
థానె: ఆర్మీలో పలు ఉద్యోగాల నియామకాలకు ఆదివారం నిర్వహించాల్సిన ప్రశ్నా పత్రం లీక్ అయింది. దీనికి సంబంధించి పుణె, నాగ్‌పూర్, నాసిక్ లకు చెందిన 300 మంది విద్యార్థులను, 18 మంది నిందితులను థానె పోలీసులు అరెస్టు చేశారు. పుణెలో ప్రశ్నా పత్రం లీక్ అయినట్టు గుర్తించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగాల నియామకాల పరీక్షలను రద్దు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 350మంది విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ప్రశ్నాపత్రాన్ని అమ్మాయి. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేశారు. పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. పలు కోచింగ్ సెంటర్ల యాజమానులను, ఆర్మీ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు థానె క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నితిన్ ఠాక్రే తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం లీక్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు. -
రేషన్ డీలర్ల ఎగ్జామ్ పేపర్ లీక్
కాకినాడ: రేషన్ షాపు డీలర్ల కోసం నిర్వహిస్తున్న పరీక్షలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ చేతివాటం చూపించారు. తమకు అనుకూలమైన వారికి ముందుగానే పరీక్షా పత్రం అందించి తమవంతు సాయం చేశారు. కాకినాడ డివిజన్ పరిధిలోని 128 రేషన్ షాపులకు డీలర్ల ఎంపిక కోసం ఈ రోజు పరీక్ష జరగనుండగా.. నిన్న సాయంత్రమే అధికార పార్టీ నేతలు జవాబులతో కూడిన ప్రశ్నపత్రాలను తమ అనుకూలులకు అందించారు. కాకినాడలోని మెక్లారెర్స్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 10:30కు జరిగే ఈ పరీక్షకు 660 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్న విషయం తెలిసిందే. -
రేషన్ డీలర్ల ఎగ్జామ్ పేపర్ లీక్
-
ఎంసెట్ పేపర్ లీకేజీ ఆరోపణల పై దర్యాప్తు