నగదు రహిత రేషన్ కు రూ.లక్ష నజరానా | money cards use in ration shops | Sakshi
Sakshi News home page

నగదు రహిత రేషన్ కు రూ.లక్ష నజరానా

Published Fri, Mar 31 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

money cards use in ration shops

కాకినాడ సిటీ :
రేషన్ షాపుల్లో నగదు రహిత సేవలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం గత నెలలో నజరానాలు ప్రకటించిన నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి విజయవాడలో పౌరసరఫరాల శాఖాధికారులు లాటరీ తీయగా జిల్లాకు సంబంధించి కాకినాడకు చెందిన మాగంటి జానకి రూ.లక్ష గెలుచుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు శుక్రవారం రాత్రి సమాచారం అందించడంతో ఆమెను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. త్వరలో విజయవాడలో జరిగే కార్యక్రమంలో గెలుచుకున్న నజరానా చెక్కును జానకికి ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేస్తారని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. కాకినాడ సాంబమూర్తినగర్‌ 3వ వీధిలో నివాసముంటున్న జానకి మార్చి 6వ తేదీన రేచర్లపేటలోని షాపు నంబర్‌ ఒకటిలో రూ.42.50 పైసలతో నగదు రహితంగా రేష¯ŒS తీసుకుందని తెలిపారు. గత నెలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా నగదు రహితంగా రేష¯ŒS సరుకులు తీసుకున్న 5లక్షల 82వేల మంది కార్డుదారులను కలిపి లాటరీ తీయగా జానకి నజరానాను గెలుచుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వి.రవికిరణ్, అర్బ¯ŒS తహసీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, పౌరసరఫరాలశాఖ ఏఎస్‌వో పి.సురేష్, డిప్యూటి తహసీల్దార్‌ శ్రీనివాస్, ఎంఎస్‌వో సూరిబాబు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement