ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకులు, సంక్రాంతి కానుకల పంపిణీ నిలిచిపోయింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకులు, సంక్రాంతి కానుకల పంపిణీ నిలిచిపోయింది. ఈ-పాస్ యంత్రాలు సర్వర్లు నాలుగు రోజులుగా పనిచేయకపోవడంతో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేయలేకపోయారు. కోటికిపైగా రేషన్ కార్డులకు సరుకులు అందలేదు. డబుల్ ఎంట్రీ విధానంలో సర్వర్లు మొరాయించాయి. సామర్థ్యం పెంచకుండా డబుల్ ఎంట్రీ విధానాన్ని తీసుకురావడంతో సమస్యలు తలెత్తాయి.
నాలుగు రోజులుగా రేషన్ సరుకుల కోసం జనం అవస్థలు పడుతున్నారు. సర్వర్ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేషన్ డీలర్లు మొరపెట్టుకున్నారు.