రూ.120కే కిలో కందిపప్పు | less cost kandipappu from august ration shops | Sakshi
Sakshi News home page

రూ.120కే కిలో కందిపప్పు

Published Sat, Jul 16 2016 7:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

less cost kandipappu from august ration shops

 ఆగస్టు నుంచి చౌక దుకాణాల్లో విక్రయం
 అనంతపురం అర్బన్: ఆగస్టు నుంచి చౌక దుకాణాల్లో కందిపప్పు కిలో రూ.120కి అందించేందుకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. తొలి దశలో అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గ, గుత్తి, కదిరి మునిసిపాలిటీల్లోని చౌక దుకాణాల్లో కార్డుదారులకు ఒక కిలో కందిపప్పును రూ.120కి ఇస్తారన్నారు.

ఇందుకు సంబంధించి 175 టన్నులు కందిపప్పు స్టాక్ తెప్పిస్తున్నామన్నారు. కిలో రూ.119.45 పైసలు చొప్పున అవసరమైన మొత్తానికి డీలర్లతో డీడీలు తీయించాలని తహసీల్దార్లను ఆదేశించామన్నారు. ఈ ఎనిమిది మునిసిపాలిటీల్లో విక్రయాలను పరిశీలించిన తరువాత పుట్టపర్తి, పామిడి మునిసిపాలిటీల్లో అమలు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement