kandipappu
-
8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రైస్ కార్డుదారులందరికీ సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జనవరిలో ఎనిమిదివేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 23వ తేదీలోగా మండలస్థాయి నిల్వ కేంద్రాలకు (ఎంఎల్ఎస్ పాయింట్లకు) సరుకు తరలించనుంది. ప్రస్తుత నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది. గిరిజన ప్రాంతాల్లోని జీసీసీల ద్వారా కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు సాగించేలా ప్రోత్సహించనుంది. ఏడాదిగా మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రలో భారీవర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కందిపప్పునకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్తపంట వస్తుండటంతో రేటు నెమ్మదిగా దిగొస్తోంది. ఒకప్పుడు మార్కెట్లో కిలో కందిపప్పు రూ.115 ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేటు రూ.160–170కి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు. మధ్యలో మూడు, నాలుగునెలలు మార్కెట్లో లోటు ఉండటంతో పీడీఎస్‌లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గోధుమపిండికి డిమాండ్ పీడీఎస్ లబ్దిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టికాహార పదార్థాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫోరి్టఫైడ్ (విటమిన్లతో కూడిన) గోధుమపిండిని పరిచయం చేసింది. ప్రజల నుంచి స్పందన బాగుండటంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు మూడువేల టన్నుల గోధుమపిండి సరఫరా చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కిలో రూ.16కే అందిస్తుండటం గమనార్హం. లబ్ధిదారులకు దీన్ని మరింత తక్కువ రేటుకు ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపనుంది. రైస్ కార్డుదారుల ఇష్టం మేరకు కిలో బియ్యానికి బదులు కిలో గోధుమపిండి ఇవ్వనుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిమాణాన్ని తగ్గించుకుని దానికి బదులు గోధుమలను సరఫరా చేస్తుంది. వాటిని ప్రాసెసింగ్ చేసి ఫోరి్టఫైడ్ అనంతరం ప్యాకింగ్, రవాణాకు అయ్యే ఖర్చులను లెక్కించి పౌరసరఫరాలశాఖ ధర నిర్ణయించనుంది. ఈ విధంగా కిలో రూ.11–12కే గోధుమపిండి ఇవ్వొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే నెలకు 1,800 టన్నుల గోధుమలను కేంద్రం అందిస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొత్తం కార్డుదారులకు గోధుమపిండిని అందుబాటులో ఉంచేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు పంచదార, రాయలసీమలో చిరుధాన్యాల పంపిణీకి అవసరమైన నిల్వలను తరలిస్తోంది. నెలాఖరులోగా కందుల సేకరణ పౌరసరఫరాలసంస్థ ద్వారా స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందులు సేకరించడంతోపాటు వాటిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసి తిరిగి పీడీఎస్‌లోకి ప్రవేశపెట్టేలా పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ నెలాఖరులోగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. అవసరమైతే మార్కెట్ రేటును చెల్లించైనా రైతుల నుంచి 35 వేల టన్నులకుపైగా కందులను సేకరించాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగానే రవాణా, కూలీ, గోతాల ఖర్చులను సైతం రైతులకు ఇవ్వనుంది. కందులు సేకరించిన వారంలోగా రైతుల ఖాతాల్లో మద్దతు ధరను జమచేయనుంది. నాణ్యతలో రాజీలేకుండా ఇప్పటివరకు పీడీఎస్‌లో పంపిణీ చేస్తున్న కందిపప్పు బయట ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నదే. తొలిసారిగా ఏపీలో పండిన పంటను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి మర ఆడించి ప్రత్యేక ప్యాకింగ్‌లో రైస్ కార్డుదారులకు ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా అక్కడక్కడ కందిపప్పు నాణ్యతపై వస్తున్న విమర్శలను అధిగమించవచ్చు. ఏపీ అవసరాలకు తగినంత నిల్వలను ఇక్కడే సేకరిస్తాం. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇకపై జాప్యం లేని పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకేలోని క్షేత్రస్థాయి సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలసంస్థ సిబ్బంది సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించి కందులు కొనుగోలు చేస్తా – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ -
వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల (నవంబర్) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు ఆర్డర్ ఇచ్చింది. అయితే హాకా వద్ద కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు అంగీకరించింది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా పప్పుధాన్యాల కొరతతో రేట్లు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)వద్ద కూడా నిల్వలు కరువయ్యాయి. ఫలితంగా కందిపప్పు పంపిణీకి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ నెలాఖరుకు సరుకు తరలింపు ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హాకా నుంచి మద్దతు ధర ప్రాతిపదికనే కందులు సేకరించినప్పటికీ.. వాటికి అదనంగా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు అవ్వనున్నాయి. ఈ మొత్తంలో రూ.67కు మాత్రమే కిలో కందిపప్పును ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపేణా ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల వద్దకు అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనుంది. డిసెంబర్, జనవరిల్లో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మార్కెట్ రేటుకే కందుల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా 50 వేల టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసింది. తొలుత కర్ణాటకలోని బఫర్ స్టాక్ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లోపించింది. ఆ తర్వాత రెండుసార్లు జూన్, సెపె్టంబర్‌ల్లో కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ, కేంద్రం నుంచి స్పందన రాలేదు. మండల స్టాక్ సెంటర్ (ఎంఎల్ఎస్)ల్లోని స్టాక్ మొత్తాన్ని పంపిణీకి విడుదల చేయడంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం హాకా నుంచి కందిపప్పును తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలలకు హాకా సరఫరా చేసే కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది. భవిష్యత్తులో అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు జనవరి నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధరకు ప్రభుత్వం కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్‌లో 30 వేల టన్నులు సేకరించాలనే యోచనలో ఉన్నారు. వాటిని స్వయంగా మరాడించి ప్యాకింగ్ చేయించి సబ్సిడీపై కార్డుదారులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. బాబుగారి ‘పప్పు’ డ్రామా అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి డిమాండ్, సప్లై ఆధారంగా నిత్యావసరాల రేట్లు మారుతుంటాయి. చంద్రబాబు హయాంలో రేట్లు ఎంత పెరిగినా ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరిగేది కాదు. పైగా ఆయన పాలన చేపట్టిన తర్వాత సెపె్టంబర్ 2014–జూలై 2015 వరకు కందిపప్పు ఊసే లేదు. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50 నుంచి రూ.120 మధ్యన రేట్లు పెంచి విక్రయించారు. 2015 డిసెంబర్లో ఏకంగా రూ.90కి పెంచారు. 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120 చేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.63 ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.23 రాయితీ ఇచ్చింది. చివరి ఏడాది మాత్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు కిలోల కందిపప్పు డ్రామా ఆడారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మొత్తం పంపిణీ చేసింది కేవలం 93 వేల టన్నులు మాత్రమే. ఇందు కోసం రూ.1605 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 3.15 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.3,084 కోట్లు ఖర్చు చేసింది. కరోనా సమయంలో నిత్యావసరాలను పూర్తి ఉచితంగా అందించింది. కార్డుదారులకు నిరంతరాయంగా పంపిణీ చేసేలా చర్యలు కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. హాకా ద్వారా కందిపప్పును సేకరిస్తున్నాం. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించాం. ఈ నెలాఖరు నాటికి ఎఫ్పీ దుకాణాలకు సరుకు చేర్చేలా ఆదేశాలు జారీ చేశాం. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తాం. ఈ ఖరీఫ్‌లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించాలని ఆదేశించాం. మన రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
దాల్ మే కుచ్ కాలా హై!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు టెండర్ దాఖలు ప్రక్రియలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు తతంగం వెలుగుచూసింది. బహిరంగ మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా ధరను సూచించి కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ టెండర్ ప్రక్రియనే రద్దు చేసింది. మళ్లీ టెండర్ పిలవాలని యోచిస్తోంది. 54% పెంచేశారు...: రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలోగర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది నయోదయ్యారు. వారికి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద సంపూర్ణ పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు. గర్భిణి/బాలింతకు రోజుకు 30 గ్రాములు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున కందిపప్పును ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సగటున 500 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. పప్పు సరఫరాకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్ పద్ధతిలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైన కాంట్రాక్టర్ ఆరు నెలలపాటు కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం తొలి 6 నెలల కోసం గత నెల అధికారులు టెండర్ పిలవగా 8 మంది పాల్గొన్నారు. అయితే వారంతా కిలో కందిపప్పు ధరను రూ. 176కు కాస్త అటుఇటుగా పేర్కొన్నారు. గత టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్ కోట్ చేసిన కనిష్ట ధర రూ. 114 కాగా... ఇప్పుడు ఆ ధర రూ.176కు పెరిగింది. అంటే ఏకంగా 54 శాతం అధికంగా ధర కోట్ అయింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 120లోపే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో... టెండర్లో పాల్గొన్న 8 మందిని వ్యక్తిగతంగా అధికారులు పిలిచి మాట్లాడగా మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు ధర తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా ధర కోట్ చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లలో కందిపప్పు ధర ఈ స్థాయిలో లేకపోవడం, త్వరలో పంట ఉత్పత్తులు సైతం చేతికి అందే సమయం ఉన్నప్పడు ఇంత ఎక్కువ ధరను కోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేశారు. అలాగే ఈసారి కాంట్రాక్టర్ల మార్పుపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘జెమ్’(గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్) నేషనల్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని... అప్పటివరకు పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా సరఫరా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
రూ.120కే కిలో కందిపప్పు
నగరంలో విక్రయ కేంద్రాలు ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ దేవసేన ముకరంపుర : పప్పుధరల నియంత్రణకు ప్రభుత్వం నడుం బిగించింది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పును రూ.165కు పైగా విక్రయిస్తున్న విషయం తెల్సిందే. ఈ ధరలకు కళ్లెం వేసి రూ.120కే కిలో విక్రయించేలా సర్కారు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని కిరాణావర్తక సంఘాల ఆధ్వర్యంలో వివిధ దుకాణాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ముందస్తుగా కరీంనగర్‌లోని గంజ్‌ప్రాంతంలో ఐదు, రైతుబజార్, కాశ్మీర్‌గడ్డ రైతుబజార్లో ఒక్కో విక్రయ కేంద్రం చొప్పున మొత్తం ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా పప్పు విక్రయాలను గురువారం జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గంజ్‌లో పెద్ది సురేష్ ట్రేడర్స్, తిరుమల, శ్రీశైలం, ఓంగాయత్రి, సదానందం కిరాణాల్లో పప్పులు లభించనున్నాయి. కార్యక్రమంలో మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నాయకులు ఎడ్ల అశోక్, కార్పొరేటర్ రూప్సింగ్, డీఎస్వో నాగేశ్వర్రావు, ఏజీపీవో కాశీవిశ్వనాథ్, ఏఎస్వో కిరణ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, కిరాణవర్తక సంఘం అధ్యక్షుడు ఎలగందుల మునీందర్ తదితరులున్నారు. -
రూ.120కే కిలో కందిపప్పు
ఆగస్టు నుంచి చౌక దుకాణాల్లో విక్రయం అనంతపురం అర్బన్: ఆగస్టు నుంచి చౌక దుకాణాల్లో కందిపప్పు కిలో రూ.120కి అందించేందుకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. తొలి దశలో అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గ, గుత్తి, కదిరి మునిసిపాలిటీల్లోని చౌక దుకాణాల్లో కార్డుదారులకు ఒక కిలో కందిపప్పును రూ.120కి ఇస్తారన్నారు. ఇందుకు సంబంధించి 175 టన్నులు కందిపప్పు స్టాక్ తెప్పిస్తున్నామన్నారు. కిలో రూ.119.45 పైసలు చొప్పున అవసరమైన మొత్తానికి డీలర్లతో డీడీలు తీయించాలని తహసీల్దార్లను ఆదేశించామన్నారు. ఈ ఎనిమిది మునిసిపాలిటీల్లో విక్రయాలను పరిశీలించిన తరువాత పుట్టపర్తి, పామిడి మునిసిపాలిటీల్లో అమలు చేస్తామన్నారు. -
పప్పు తిప్పలు...!
పండగొస్తున్నదంటే బెంగపడే రోజులొచ్చినట్టున్నాయి. నెల్లాళ్లక్రితం మొదలై పైపైకి ఎగబాకుతున్న పప్పుల ధరల్ని అందుకోలేక సామాన్యులు బెంబేలెత్తుతుంటే ప్రభుత్వాలు పట్టనట్టు ఉండిపోతున్నాయి. బజారుకెళ్లి ఇంటికొచ్చేసరికి జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప సంచీ నిండటం లేదు. పండగ పూట పిండి వంటల మాట అలా ఉంచి కనీసం పప్పన్నం తినడానికి కూడా సాధ్యంకాని స్థితి ఏర్పడింది. కిలో చికెన్ ధరతో పోలిస్తే కందిపప్పు ధర రెట్టింపు ఉన్నదంటే ధరల వేలంవెర్రి ఎలా ముదిరిందో అర్ధం చేసుకోవచ్చు. ఏం ధరలివి? గత నెలలో కిలో ధర రూ. 140కి మించని కందిపప్పు ఇప్పుడు రూ. 200కు చేరుకుంది. రూ. 135 ఉండే మినప్పప్పు ప్రస్తుతం రూ. 185 పలుకుతోంది. కిలో రూ. 110 ఉన్న ఎండుమిర్చి ఇప్పుడు రూ. 140కి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశమంతా పప్పుల ధరలు రాకెట్ వేగాన్ని మించి దూసుకు పోతున్నాయి. శరీర పోషణకు అవసరమయ్యే మాంసకృత్తులు చవకలో లభ్యమయ్యేది పప్పుల్లోనే గనుక సగటు పౌరులు వాటిపైనే ప్రధానంగా ఆధారపడతారు. మాంసాహారులకైనా చికెన్, మటన్ రోజూ తినే స్తోమత ఉండదు. ఇంత ప్రధాన పాత్రవహించే పప్పుల సరఫరా, వాటి ధరలపై దృష్టి సారించి అవి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న స్పృహ పాలకులకూ, విధాన నిర్ణేతలకూ కొరవడింది. వలస పాలకుల ధోరణుల్ని మన పాలకులు పుణికిపుచ్చుకోవడమే ఇందుకు కారణమని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతారు. వారు రోజూ తీసుకునే ఆహారంలో పప్పులు భాగం కాదు గనుక వాటి సంగతే ఆ పాలకులకు పట్టేది కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కాయ ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించలేదు. ఆఫ్రికా దేశాల్లోగానీ, మయన్మార్, ఉరుగ్వే వంటి చోట్ల గానీ పండించి ఆ దేశాలనుంచి దిగుమతి చేసుకోవచ్చునని కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో శరద్ పవార్ ఆలోచించారు. వాస్తవానికి మంచి మద్దతు ధరలిస్తామని ప్రకటిస్తే రైతులు ఉత్సాహంగా కదిలి ఆ పంటల్ని మరింతగా పండించడానికి ప్రయత్నిస్తారు. ఆ పని చేయడంలో ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలూ పదే పదే విఫలమవుతున్నారు. 2014-15లో మన దేశం మొత్తంగా రూ. 18,000 కోట్ల రూపాయల విలువైన కాయ ధాన్యాలను దిగుమతి చేసుకుంది. మెరుగైన మద్దతు ధరలిస్తామంటే ఇంతకన్నా తక్కువ వ్యయంతోనే మన దేశంలో కాయ ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయి. ఎంఎస్పీని ప్రకటించి ఊరుకోవడమే కాదు...రైతులకు ఆ ధర వచ్చేలా ప్రభుత్వాలు చూడాలి. నిరుడూ, ఈసారీ కూడా నైరుతి రుతు పవనాలు దగా చేసిన మాట నిజమే. పంటల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిన మాట కూడా వాస్తవమే. వర్షాలు లేకపోవడం, అకాల వర్షాలు ముంచెత్తడం వంటి కారణాలవల్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అంతక్రితం కాయ ధాన్యాల ఉత్పత్తి 20 లక్షల టన్నులు మించగా 2014-15లో అది 17 లక్షల టన్నులకు పడిపోయింది. అయితే ఇదంతా ఊహించని ఉపద్రవం కాదు. ఈ ఏడాది కూడా కరువు తప్పదని మన వాతావరణ విభాగం చాలా ముందుగానే చెప్పింది. ఆ హెచ్చరికల్ని గమనంలోకి తీసుకుని ఏ ఏ పంటలు దెబ్బతినడానికి ఆస్కారమున్నదో అంచనా వేసుకుని వాటి దిగుమతికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవాల్సింది ప్రభుత్వమే. అది సకాలంలో జరగకపోవడంవల్లనే పప్పుల ధరలిలా మండుతున్నాయి. వాస్తవానికి మొన్న జూన్‌లోనే దిగుమతులు చేసుకోవాలన్న నిర్ణయం జరిగినా అది ఆచరణకొచ్చేసరికి ఆలస్యమైంది. ఈలోగా జూలై కూడా గడిచిపోయింది. పోర్టులకు చేరుకున్న కాయధాన్యాల్ని వెంటనే తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామని, అందుకు సంబంధించి కూడా జాప్యం చోటు చేసుకోవడంవల్ల మార్కెట్లో ధరలు పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరిస్తున్నారు. వివిధ పోర్టుల్లో 5,000 టన్నుల సరుకు సిద్ధంగా ఉండగా మరో 4,000 టన్నులు చేరుకోబోతున్నాయని చెబుతున్నారు. ఈ చర్యలతోపాటు ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామని అంటున్నారు. నిజానికి ఈ చర్యలన్నీ ఇంకాస్త ముందు మొదలై ఉంటే పప్పుల ధరలిలా భగ్గున మండేవి కాదు. మిగిలిన పంటలతో పోలిస్తే కాయ ధాన్యాల విషయంలో తగినంతగా పరిశోధనలు జరగడంలేదు. కాయ ధాన్యాల పంటలు చేతికందడానికి ఎక్కువ రోజుల సమయం పడుతుందని, అలాగే వాటికి చీడపీడల బెడద కూడా ఎక్కువేనని రైతులంటారు. వీటన్నిటికీ అయ్యే ఖర్చుల్ని భరించాక వచ్చే దిగుబడి చూసినా తమకు గిట్టుబాటయ్యే పరిస్థితి కనబడదని చెబుతారు. కనుక ఈ రంగంలో మరింతగా పరిశోధనల్ని ప్రోత్సహించి రైతుకు మెరుగైన వంగడాలను అందుబాటులోకి తీసుకురాగలిగితే వాటి ఉత్పత్తి పెరుగుతుంది. పంట చేతికొచ్చాక వాటిని అమ్ముకోవడం మరో సమస్య. ప్రస్తుతం కాయ ధాన్యాల దిగుమతిపై సుంకాలు లేకపోవడంవల్ల విదేశాల నుంచి సరుకొచ్చి రైతుల దగ్గరున్న ఉత్పత్తులతో పోటీ పడుతోంది. దళారులు రంగప్రవేశం చేసి రైతుల కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నారు. పంట చేతికొచ్చే సమయానికి దళారులు, వ్యాపారులూ సొమ్ము చేసుకుంటుంటే రైతు నిస్సహాయంగా మిగులుతున్నాడు. కనుకనే కాయ ధాన్యాల వైపు మొగ్గు చూపాలంటే హ డలెత్తుతున్నాడు. అటు రైతులు ఆ విధంగా నష్టపోతుంటే నల్ల బజారుకు పప్పులు తరలి కృత్రిమ కొరత ఏర్పడటంవల్ల సామాన్య పౌరులు తలకిందులవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. నెపాన్ని రుతుపవనాలపై నెట్టేసి పప్పు గింజల కొరతకూ, వాటి ధరలకూ అదే కారణమని చెప్పడం కాక సరైన విధానాలను రూపొందించుకోవాలి. -
కందిపప్పు డబుల్ సెంచరీ
ఆల్‌టైమ్ రికార్డు ధర.. కిలో రూ.200 సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో కందిపప్పు ధర మండిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుధవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. కేజీ ధర హోల్‌సేల్‌లోనే రూ.200కి ఎగబాకింది. రిటైల్ మార్కెట్లో మరో రూ.5 నుంచి రూ.6 అదనంగా గుంజుతున్నారు. కందిపప్పు ధర రూ.200 దాటడం ఎన్నడూ చూడలేదని వ్యాపారులే ఆశ్చర్యపోతున్నారు. కొందరు హోల్‌సేల్ వ్యాపారులు పెద్దమొత్తంలో కందిపప్పును నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించటంతో రేట్లు పెరిగిపోతున్నాయి. మినపపప్పు కూడా చుక్కలనంటుతోంది. హోల్‌సేల్‌లో కిలో రూ.185, రిటైల్‌లో రూ.190 పలుకుతోంది.