రూ.120కే కిలో కందిపప్పు | kg kandipappu 120 rupees | Sakshi
Sakshi News home page

రూ.120కే కిలో కందిపప్పు

Published Thu, Jul 21 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

kg kandipappu 120 rupees

  • నగరంలో విక్రయ కేంద్రాలు 
  • ప్రారంభించిన జాయింట్‌ కలెక్టర్‌ దేవసేన
  • ముకరంపుర : పప్పుధరల నియంత్రణకు ప్రభుత్వం నడుం బిగించింది. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పును రూ.165కు పైగా విక్రయిస్తున్న విషయం తెల్సిందే. ఈ ధరలకు కళ్లెం వేసి రూ.120కే కిలో విక్రయించేలా సర్కారు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని కిరాణావర్తక సంఘాల ఆధ్వర్యంలో వివిధ దుకాణాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
    ముందస్తుగా కరీంనగర్‌లోని గంజ్‌ప్రాంతంలో ఐదు, రైతుబజార్, కాశ్మీర్‌గడ్డ రైతుబజార్‌లో ఒక్కో విక్రయ కేంద్రం చొప్పున మొత్తం ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా పప్పు విక్రయాలను గురువారం జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గంజ్‌లో పెద్ది సురేష్‌ ట్రేడర్స్, తిరుమల, శ్రీశైలం, ఓంగాయత్రి, సదానందం కిరాణాల్లో పప్పులు లభించనున్నాయి. కార్యక్రమంలో మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్, నాయకులు ఎడ్ల అశోక్, కార్పొరేటర్‌ రూప్‌సింగ్, డీఎస్‌వో నాగేశ్వర్‌రావు, ఏజీపీవో కాశీవిశ్వనాథ్, ఏఎస్‌వో కిరణ్, ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ వరప్రసాద్, కిరాణవర్తక సంఘం అధ్యక్షుడు ఎలగందుల మునీందర్‌ తదితరులున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement