తూకంలో మోసం
తూకంలో మోసం
Published Tue, Dec 6 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
- రేషన్ దుకాణాల్లో అధికారుల తనిఖీ
- కిలో నుంచి రెండు కిలోల వరకు బియ్యం కాజేసీని డీలర్లు
- ముగ్గురిపై కేసులు నమోదు
కర్నూలు(అగ్రికల్చర్) : పౌరసరఫరాల, తూనికలు కొలతల శాఖల అధికారులు సోమవారం కర్నూలులోని వివిధ చౌక ధరల దుకాణాల్లో తూకాలను తనిఖీ చేశారు. దుర్గాంజలికి చెందిన 73వ షాపులో 1.035 కిలోలు, హనుమంతయ్యకు చెందిన 75వ షాపులో 1.015 కిలోలు, క్రాంతి కుమారికి చెందిన 84వ షాపులో 1.900 కిలోలు మోసం చేసినట్లు నిర్ధారన కావడంతో ముగ్గురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. కాగా, చౌక దుకాణాల్లో తూకాలను తనిఖీలు చేస్తున్నారనే సమాచారం డీలర్లకు వెళ్లిపోవడంతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. 70, 71, 69, 67 షాపుల్లోనూ తనిఖీలు చేయగా తూకాలు సక్రమంగా ఉన్నట్లు తేలింది. తనిఖీల సమాచారం డీలర్లకు వెళ్లడంతో జాగ్రత్తపడడంతోనే తూకాలు సక్రమంగా ఉంచినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో ఏఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ మహ్మద్, సిబ్బంది జాఫర్ హుస్సేన్, ఖాజా హుస్సేన్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తిరుమలరావు, సాయిబాబా పాల్గొన్నారు.
Advertisement