waight
-
కిలోగ్రామ్‌కు సరికొత్త నిర్వచనం
వర్సెయిల్స్: ప్రపంచవ్యాప్తంగా బరువును కొలిచేందుకు వాడుతున్న కిలోగ్రామ్(కేజీ) ప్రమాణం నిర్వచనాన్ని మార్చేందుకు ఫ్రాన్స్ లో సమావేశమైన 50 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. దీంతో పాటు విద్యుత్ ప్రవాహానికి వాడే ఆంపియర్, ఉష్ణోగ్రతకు వాడే కెల్విన్, పదార్థ రాశిని కొలిచేందుకు వాడే మోల్ ప్రమాణాల నిర్వచనాలను సవరించాలని నిర్ణయించాయి. ఫ్రాన్స్‌లోని వర్సయిల్స్లో జరిగిన ఓ సమావేశంలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. 1889 నుంచి ఇప్పటివరకూ ఫ్రాన్స్‌లోని ఓ హైసెక్యూరిటీ లాకర్లో భద్రపరిచిన ప్లాటినం–ఇరీడియం అల్లాయ్ గోళాన్ని ఇన్నాళ్లూ కేజీకి ప్రమాణంగా పరిగణిస్తూ వచ్చారు. ఈ లోహపు వస్తువు కిందపడ్డా, మరే కారణంచేత అయినా దెబ్బతిన్నా కేజీ బరువులో మార్పులు జరిగే అవకాశముండేది. ఈ నేపథ్యంలో తాజా నిర్వచనం ప్రకారం కేజీని ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండేలా డిజిటల్ మాధ్యమంలో సంఖ్యల రూపంలో తెలియజేయనున్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రజల జీవితాల్లో పెద్దగా వచ్చే మార్పేమీ ఉండబోదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వచ్చే మే 20 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. -
డబ్బు కోసం ఏది పడితే అది చేయను
‘‘ఈ బిళ్లలు మింగండి. ఎంచక్కా సన్నబడిపోండి’ అనే యాడ్ చూస్తే.. లావుగా ఉన్నవాళ్లల్లో చాలామంది ఎట్రాక్ట్ అయిపోతారు. ఏముంది? ఓ మందు బిళ్లే కదా.. మింగేస్తే పోలా? అనుకుంటారు. డబ్బు గురించి ఆలోచించకుండా కొనేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆలోచించరు. కానీ, ప్రమోట్ చేసేవాళ్లు మంచివాళ్లైతే ఆలోచిస్తారు. పూజా హెగ్డే ఈ కేటగిరీలోకే వస్తారు. ఓ ప్రముఖ ఉత్పత్తిదారులు ‘వెయిట్ లాస్ పిల్’ను ప్రమోట్ చేయమని పూజా హెగ్డేని సంప్రదించారు. భారీ పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ, పూజా ఆ ఆఫర్‌ని తిరస్కరించారు. డబ్బు కోసం ఏది పడితే అది చేయనని తెగేసి చెప్పారు. ‘‘స్ట్రిక్ట్ డైట్, యోగ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అయితే బరువు తగ్గటం పెద్ద కష్టం కాదు. వెయిట్ లాస్‌కు నేచురల్ పద్ధతిని ఫాలో అవ్వడమే మంచిది. టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని మిస్ గైడ్ చేయడం నాకిష్టం లేదు. ఆరోగ్యం పట్ల అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజుల్లో హెల్త్ ఈజ్ వెల్త్ అని గుర్తించుకోవాలి. ఎట్లీస్ట్ 45 మినిట్స్ డైలీ వ్యాయామం చేసేలా లైఫ్‌స్టైల్‌ను చేంజ్ చేసుకోవాలి. అప్పుడే హెల్త్ పరంగా గుడ్ రిజల్ట్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు పూజా. -
తూకంలో మోసం
- రేషన్ దుకాణాల్లో అధికారుల తనిఖీ - కిలో నుంచి రెండు కిలోల వరకు బియ్యం కాజేసీని డీలర్లు - ముగ్గురిపై కేసులు నమోదు కర్నూలు(అగ్రికల్చర్) : పౌరసరఫరాల, తూనికలు కొలతల శాఖల అధికారులు సోమవారం కర్నూలులోని వివిధ చౌక ధరల దుకాణాల్లో తూకాలను తనిఖీ చేశారు. దుర్గాంజలికి చెందిన 73వ షాపులో 1.035 కిలోలు, హనుమంతయ్యకు చెందిన 75వ షాపులో 1.015 కిలోలు, క్రాంతి కుమారికి చెందిన 84వ షాపులో 1.900 కిలోలు మోసం చేసినట్లు నిర్ధారన కావడంతో ముగ్గురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. కాగా, చౌక దుకాణాల్లో తూకాలను తనిఖీలు చేస్తున్నారనే సమాచారం డీలర్లకు వెళ్లిపోవడంతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. 70, 71, 69, 67 షాపుల్లోనూ తనిఖీలు చేయగా తూకాలు సక్రమంగా ఉన్నట్లు తేలింది. తనిఖీల సమాచారం డీలర్లకు వెళ్లడంతో జాగ్రత్తపడడంతోనే తూకాలు సక్రమంగా ఉంచినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ మహ్మద్, సిబ్బంది జాఫర్ హుస్సేన్, ఖాజా హుస్సేన్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తిరుమలరావు, సాయిబాబా పాల్గొన్నారు.