మిర్యాలగూడ : పట్టణంలోని రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. షాపుల్లోని రికార్డులకు, ఉన్న నిల్వలకు తేడాలు ఉన్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహిం చారు. రేషన్ షాపుల్లో పక్కదారి పడుతున్న బియ్యం, సరుకులపై ‘బినామీ డీలర్లు’ శీర్షికన ఈ నెల 15వ తేదీన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టణంలోని బంగారుగడ్డలోని 37వ రేషన్‌షాపు, గాంధీనగర్‌లోని 3వ రేషన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారావు మాట్లాడుతూ పట్టణంలోని బంగారుగడ్డలోని 37వ రేషన్ షాపు డీలర్ సుదర్శన్ వద్ద రికార్డుల్లో 23.12 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా 36.50 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని పేర్కొన్నారు.
షాపులో అదనంగా 13.38 క్వింటాళ్ల బియ్యం, చెక్కర 16.50 కిలోలు తక్కువగా ఉండడంతో పాటు 110 లీటర్ల కిరోసిన్ తక్కువగా ఉందని చెప్పారు. దీంతో డీలర్‌పై సివిల్ సప్లయీస్ యాక్డ్ 6 (ఏ) కేసు నమోదు చేసి షాపు సీజ్ చేసినట్లు తెలి పారు. గాంధీనగర్‌లోని షాపులో రికార్డుల్లో ఉన్న ప్రకారం ఉన్నాయని తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏఈ శివకృష్ణ, నర్సింహారెడ్డి, సివిల్ సప్లయీస్ డీటీ రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
రేషన్ షాపుల్లో ‘విజిలెన్స్’ తనిఖీలు
Published Wed, May 17 2017 3:15 AM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM
Advertisement
Advertisement