మైనింగ్ పై విజి‘లెన్స్’
Published Thu, Feb 6 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
సాక్షి, రాజమండ్రి :అక్రమంగా మైనింగ్‌పై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం మైనింగ్ కార్యకలాపాలపై విస్తృత దాడులు చేశారు. మైనింగ్ అధికారులతో కలిసి ముందుగా గ్రావెల్ తవ్వకాలపై తనిఖీలు చేపట్టారు.
పెద్దాపురంలో రూ.కోటికి పంగనామం
పెద్దాపురం ఏడీబీ రోడ్డుకు పది కిలోమీటర్ల లోపల గ్రావెల్ అక్రమ తవ్వకాలను విజిలె న్‌స అధికారులు మంగళవారం రాత్రి గుర్తిం చారు. ఇక్కడ అక్రమ తవ్వకాల ద్వారా సర్కారుకు ఏకంగా రూ.కోటి మేర సీనరేజి ఎగ్గొట్టినట్టు కనుగొన్నారు. ఇక్కడ లీజుదారుని లెసైన్సు గడువు డిసెంబర్ 31తో ముగిసింది. అయినా యథేచ్ఛగా తవ్వకాలు సాగించేస్తున్నాడు. సరిహద్దులో ఉన్న లీజు లేని భూమి నుంచి కూడా రూ.కోట్ల గ్రావెల్‌ను తరలించేశాడు. తవ్వకం నిబంధనలు బేఖాతరు చేస్తూ సుమారు 20 నుంచి 40 అడుగుల లోతులో గ్రావెల్‌ను తరలిస్తున్న విషయం అధికారులు గమనించారు.
మండలాలవారీగా తనిఖీలు
ఈ నేపథ్యంలో అన్ని మండలాల్లో జరుగుతున్న క్వారీ కార్యకలాపాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. మంగళ, బుధవారాల్లో కొన్ని మండలాల్లో మీడియాకు కూడా తెలియకుండా మైనింగ్ తవ్వకాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. మైనింగ్ సక్రమంగా జరుగుతోందా? ఎంతమేర తవ్వకాలకు అనుమతులున్నాయి? ఎంత తవ్వుతున్నారు? అనుమతులకు మించి ఎంత తరలిస్తున్నారు? తదితర అంశాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి కొలతలు తీసుకున్నారు. వీటిని అనుమతులతో పోల్చి సక్రమంగా ఉన్నాయా అన్న అంశంపై విచారణ సాగిస్తున్నారు. పర్మిట్ లేకుండా తవ్వకాలు సాగుతుంటే సీజ్ చేస్తామని, పర్మిట్ పరిమితికి మించితే భారీ జరిమానా వసూలు చేస్తామని వెల్లడించారు.
అంతా గోప్యం
ఈ దాడులను విజిలెన్స్, మైనింగ్ అధికారులు అత్యంత గోప్యంగా సాగించారు. దాడులపై విజిలెన్స్ ఎస్పీ రమేషయ్యను వివరాలు కోరగా ముందుగా పెద్ద వాళ్లపై దృష్టి సారించామని పేర్కొన్నారు. అంచెలంచెలుగా జిల్లాలోని అన్ని ప్రాంతాలపైనా దృష్టి సారిస్తామని చెప్పారు.
Advertisement