♦ నోటిమాటతో కార్డుల జారీ
♦ పట్టించుకోని అధికార యంత్రాంగం
‘ఇంట్లో నేనొక్కదాన్నే. గతంలో తెల్లాకార్డు ఉండేది. మూన్నెళ్లాయె కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసి. ఆఫీసు చుట్టు తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంటలేరు’ ఇదీ లష్కర్ సింగారానికి చెందిన భాగ్యమ్మ ఆవేదన.
సాక్షి, హన్మకొండ : ‘నాకు కొత్త కార్డు మంజురు కాలేదని రేషన్ షాపుల బియ్యం ఇస్తలేరు. ఎమ్మార్వో కాడికి పోయి కార్డు తెచ్చుకోమని చెప్పిళ్లు. మూడునెలల నుంచి తిరుగుతున్నా పనైతలేదు. ఆటోలకే డబ్బులు అయితన్నై. పాతకార్డు మీదనన్న బియ్యం ఇస్తే బాగుండేది’ ఇదీ జహహర్‌నగర్‌కు చెందిన గుగులోతు మరియ ఆక్రందన. ఇలాంటి వారికి లేనది అర్హత కాదు.. రేషన్ డీలర్ల అనుగ్రహం! అవును.. రేషన్‌కార్డుల జారీలో డీలర్లు చక్రం తిప్పుతున్నారు. రేషన్ డీలర్లను కాదని.. నిబంధనలు అన్ని పాటించినా కార్డు సంపాదించడం గగనమవుతోంది.
కూలీనాలీ చే సి పొట్టపోసుకునే పేదలు అటు పనులుకు వెళ్లలేక ఇటు ఆఫీసుల్లో పని కాక తిప్పలు పడుతున్నారు. కొత్త రేషన్ కార్డు జారీలో పేదరికం, కుటుంబ వార్షిక ఆదాయం అర్హతగా కాకుండా తమకు నచ్చిన, తమను మెప్పించిన రేషన్ డీలర్ పరిధిలోకి వస్తాడా ? రాడా ? అనేదే పట్టించుకుంటున్నారు. సదరు దరఖాస్తుదారుడి ప్రాంతానికి చెందిన రేషన్‌డీలర్‌తో ‘డీల్’ కుదిరేదాక కార్డులు జారీకి మొరారుుస్తున్నారుు. ఫలితంగా.. దరఖాస్తుల్లో మూడొంతుల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు.
స్వయంగా దరఖాస్తు చేసుకున్నవారికి, వీఆర్వోలు ప్ర తిపాదించిన వారికి తక్కువ మొత్తంలో అంత్యోదయ కార్డు లు అందగా... డీలర్లు ప్రతిపాదించిన పేర్లలో 95 శాతం మందికి అంత్యోదయ కార్డులు జారీ అయ్యాయని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
డీలర్‌తోనే డీల్!
Published Fri, Apr 17 2015 3:17 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement