ration cards Issuing
-
రి‘కార్డు’ వేగం: దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా ఇంటికే రేషన్ కార్డులు
సాక్షి, అమరావతి: వివాహితుడైన వీర వెంకటశివ విడిగా రేషన్ కార్డు కావాలని గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా నిరాశే మిగిలింది. ఇప్పుడు 15 రోజుల్లోనే ఆయన చేతికి బియ్యం కార్డు వచ్చింది. రెండేళ్ల పాటు ప్రయత్నించి విసిగి వేసారిపోయిన స్వరూప వలంటీర్ సాయంతో సచివాలయంలో కార్డు అందుకుంది. అర్హులైనప్పటికీ మంజూరు కాక నిస్పృహకు గురైన ఎంతోమంది పేదలు ఇప్పుడు రోజుల వ్యవధిలోనే ఇంటి వద్దే బియ్యం కార్డులు అందుకోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంతృప్త స్థాయిలో.. అర్హులైన ఎందరో పేదలు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుకు కూడా నోచుకోలేదు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి ముడుపులు చెల్లించినా ఫలితం దక్కలేదు. వివాహం తరువాత విడిగా కాపురాలు ఉంటున్న లక్షల మంది గోడును టీడీపీ సర్కారు ఆలకించలేదు. ఎంతసేపూ కార్డులను ఎలా తగ్గించాలనే అంశంపైనే దృష్టి పెట్టి పేదలకు పట్టెడన్నం పెడదామనే ఆలోచనే చేయలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇలాంటి కష్టాలను స్వయంగా చూశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్ నవశకం ద్వారా వలంటీర్లతో ఇంటింటి సర్వేను నిర్వహించారు. బియ్యం కార్డు అర్హత ఆర్ధిక పరిమితి పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.పది వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా బియ్యానికి ప్రత్యేకంగా కార్డులు మంజూరు చేశారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో కొత్త బియ్యం కార్డులను మంజూరు చేశారు. అంతే కాదు.. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా వెంటనే పరిశీలించి బియ్యం కార్డు మంజూరు చేసేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు చేశారు. నిర్దిష్ట వ్యవధి నిర్ణయించి అమలు.. సంక్షేమ పథకాల అమల్లో గత ఏడాది జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా బియ్యం, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి స్థలం మంజూరుకు నిర్ణీత కాల వ్యవధిని నిర్ధారించి పక్కాగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 13 నెలల వ్యవధిలో గత ఏడాది జూన్ 9వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై 15వతేదీ వరకు 16.45 లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డులను మంజూరు చేశారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అర్హులకు బియ్యం కార్డు మంజూరు చేయాలనే నిబంధన అమలు చేస్తున్నారు. దీంతో పేదలకు కొత్త బియ్యం కార్డులతో పాటు పెళ్లి తరువాత వేరు కాపురం ఉంటున్న దంపతులకు కొత్త కార్డులు సకాలంలో మంజూరవుతున్నాయి. అలాగే వారికి పిల్లలు పుట్టినా లేదా తల్లిదండ్రులు గతంలో ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఇప్పుడు వారి వద్దకు వచ్చినా సరే పేర్లను నమోదు చేస్తున్నారు. అర్హత ఉంటే చాలు కార్డు మంజూరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల గత రెండేళ్లపైగా ఎక్కడా రేషన్ కార్డు లేదని, ఇవ్వడం లేదనే మాటే వినిపించడం లేదు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావులేకుండా, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అర్హులకు వారి గ్రామాల్లోనే సచివాలయాల్లో కార్డులు మంజూరు అవుతున్నాయి. పది రోజుల్లోనే... వివాహం కావడంతో రేషన్ కార్డు కోసం గ్రామ వలంటీరును సంప్రదించా. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు దరఖాస్తు అందచేసిన పది రోజుల్లోనే కార్డు మంజూరైందని తెలియడంతో ఆశ్చర్యం కలిగింది. రేషన్‌కార్డుతో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఉపాధిహామీ జాబ్ కార్డులు కూడా వారం వ్యవధిలోనే మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఇలా కార్డులు అందిన దాఖలాలు లేవని అంతా చెబుతున్నారు. –తామరి రాధాకృష్ణ, చింతలవీధి, పాడేరు మండలం, విశాఖ జిల్లా 15 రోజుల్లోనే వచ్చింది... నాకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు అబ్బాయిలు. గత ప్రభుత్వ హయాంలో మా కుటుంబానికి విడిగా రేషన్ కార్డు కోసం ఎంతో ప్రయత్నించా. జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగినా పని కాలేదు. ఇప్పుడు వలంటీర్ మా ఇంటికి వచ్చి దరఖాస్తు చేయించారు. 15 రోజుల్లోనే రేషన్ కార్డు మంజూరు కావడంతో ఎంతో సంతోషంగా ఉంది. – గుర్రాల వీర వెంకట శివ, ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా రెండుసార్లు రాని కార్డు 27 రోజుల్లోనే.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 27 రోజుల్లోనే మంజూరైంది. టీడీపీ హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఏడాది పాటు ప్రదక్షిణలు చేసినా రేషన్ కార్డు రాలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్ మా ఇంటికే వచ్చి దరఖాస్తు చేయించారు. దరఖాస్తు చేసిన 27 రోజుల్లోనే సచివాలయంలో కార్డు అందుకున్నా. –ఈ. స్వరూప (జోగంపేట, నర్సీపట్నం నియోజకవర్గం, విశాఖ జిల్లా) అర్హులకు ఇవ్వకుండా ఎలా ఉండగలం? గతంలో ఎప్పుడూ వివాహం తరువాత వేరు కాపురం ఉంటున్న వారికి కొత్తగా కార్డులు మంజూరు చేయలేదు. దీనివల్ల ప్రభుత్వంపై భారం పడుతుందన్న వాదనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విభేదించారు. వివాహం అయిన తరువాత విడిగా ఉంటున్న వారు అర్హులా.. కాదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అర్హులేనని తెలియచేయడంతో వారికి కార్డులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భారం పడుతోందనే సాకుతో అర్హులకు ఇవ్వకుండా ఎలా ఉంటామని సీఎం ప్రశ్నించారు. దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి అర్హులకు బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నాం. కంప్యూటర్ డేటా ప్రకారం పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. – కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
30 నిమిషాల్లోనే రేషన్‌కార్డులు
లింగగూడెం (పెనుగంచిప్రోలు) /ఎ.కొండూరు: ఏళ్లపాటు కాళ్లరిగేలా తిరిగినా మంజూరు కాని రేషన్‌కార్డులు ఇప్పుడు నిమిషాల్లోనే చేతికి అందుతున్నాయి. కృష్ణాజిల్లాలో శుక్రవారం దరఖాస్తు చేసుకున్న 30 నిమిషాల్లోనే ముగ్గురికి రేషన్ కార్డులు అందాయి. సీఎం ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల సమస్యలు గంటల్లోనే పరిష్కారం అవుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనమంటున్నారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో గంగదారి అరుణ, రామారావు దంపతులు, మాదిరాజు నరేష్, రమాదేవి దంపతులు గతంలో కార్డుకోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో వారు శుక్రవారం వలంటీర్‌ను కలిసి ఉదయం 10.15 గంటలకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేశారు. అయితే 10.30 గంటలకు గ్రామ సచివాలయంలో కార్డులు ప్రింటయ్యాయి. 10.40 గంటలకల్లా తహసీల్దార్ షకీరున్నీసాబేగం, ఎంపీడీవో రాజు గ్రామానికి వచ్చి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఎ.కొండూరు మండలం వల్లంపట్లలో బాణావత్ పాప కుటుంబం గ్రామ సచివాలయంలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. వెంటనే కార్డు మంజూరైంది. 30 నిమిషాల్లోనే సచివాలయ సిబ్బంది కార్డును ప్రింట్ తీసి లబ్ధిదారులకు అందజేశారు. -
6 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ
-
ఏపీ: ఐదు రోజుల్లోనే కొత్త రేషన్‌కార్డు..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరింత పకడ్బందీగా రేషన్ కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. (4 నెలల ముందుగానే వైఎస్సార్ వాహన మిత్ర) రేషన్ డోర్ డెలివరీలో భాగంగా కార్డుదారులకు బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి 10,15 కిలోల చొప్పున సంచులను అందిస్తామన్నారు.ఒక్కో సంచీ తయారీకి రూ.25 ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు కోన శశిధర్ తెలిపారు. (బీసీలకు ‘పథకాల’ పంట) -
‘కుదరకపోతే మాన్యువల్‌గా కూడా రేషన్’
సాక్షి, హైదరాబాద్: బయోమెట్రిక్ పనిచేయకపోతే మాన్యువల్‌గా లేదంటే ఐరిష్‌తో వినియోగదారులకు సరుకులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆగస్టు 15 తర్వాత ఈ విధానం అమలులోకి తీసుకువస్తామన్నారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అర్హులకు ఎప్పుడంటే అప్పుడు కార్డు అందించి సరుకులను ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కల్తీకి ఆస్కారం లేకుండా సన్న బియ్యం సరఫరా చేస్తామని ఉద్ఘాటించారు. లాభదాయకమైన శాఖ కాకపోయినప్పటికీ సమాజ సేవలో ముందుండే శాఖ సివిల్ సప్లై అని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం లేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ప్రతి కిలో వరి ధాన్యాన్ని కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూశామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామినిచ్చారు. సివిల్ సప్లై కార్పొరేషన్ తో పాటు నాలుగు శాఖల రాష్ట్ర, జిల్లా అధికారుల సమావేశం నిర్వహించామని అన్నారు. ఇకపై ప్రతినెలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతికి తావులేకుండా చేసి సివిల్ సప్లై శాఖను గొప్ప సంస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఎన్నో దాడులు నిర్వహించారనీ, కల్తీలకు ఆస్కారం లేకుండా చేసి ప్రజలకు నాణ్యమైన సరుకులు అందేలా చూస్తామన్నారు. -
ఈ–పాస్‌తో కూపన్లకు బ్రేక్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రేషన్ సరఫరాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన సంస్కరణలతో పౌరసరఫరాల శాఖకు మిగులుబాటు కనిపిస్తున్నా అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు దక్కకుండా పోతున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి ఎప్పుడో మంగళం పాడిన ప్రభుత్వం చివరకు ఆహార భద్రత కార్డులకూ ఎర్రజెండా చూపింది. ఫలితంగా.. రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల జారీ నిలిపివేసి పదినెలలు కావస్తోంది. రేషన్ దుకాణాలు కేంద్రాలుగా జరుగుతున్న అక్రమాలకు బ్రేక్ వేసే ఉద్దేశంతో ఈ–పాస్ (ఎలక్ట్రానికి పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మొదట మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ–పాస్ అమలును మొదలు పెట్టిన సమయంలో అనూహ్యంగా పెరిగిన అదనపు కూపన్ల జారీని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డులు కానీ, కొత్త కూపన్లు జారీ చేయొద్దని నిర్ణయించారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందకుండా అయ్యింది. మొత్త కార్డుల్లో ఇప్పుడున్న యూనిట్ల స్థానంలో కొత్తగా ఎవరినీ చేర్చడం, లేదా తొలగించడం వంటి మార్పులు చేర్పులనూ బంద్ చేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని 943 రేషన్‌షాపులు, సూర్యాపేట జిల్లాలో 605 షాపులు, యాదాద్రి జిల్లా పరిధిలో 461 రేషన్‌షాపుల్లో ఈ–పాస్ యంత్రాలు అమర్చ డం పూర్తయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినా, కొత్త కార్డుల జా రీ, కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్త కూపన్ల జారీ వంటి అంశాలపై ఎలాంటి నిర్ణయమూ వెలువడకపోవడంతో అర్హులు సరుకులు పొందలేక పోతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్లే ! జిల్లాలో ఆహార భద్రత కార్డుల సంఖ్య ఎప్పటికప్పటికీ పెరిగిపోవడం వల్లే అసలుకు ఎసరు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీ–సేవా కేంద్రాలనుం చి వెళ్లిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇక, తహసీల్దార్లు ఆమోదించిన దరఖాస్తులను సివిల్ సప్లయీస్ అధికారులు యధాతధంగా ఆమోదిస్తున్నారు. కొత్త కార్డులకు వస్తున్న దరఖాస్తులు, ఉన్న కార్డుల్లో కొత్తగా పేర్లు జత చేయడంలో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు శాఖా కమిషనర్‌కు వెళ్లడంతోనే కూపన్ల జారీకి బ్రేక్ వేశారని చెబుతున్నారు. అక్రమాలకు చెక్ ఇలా.. లబ్ధిదారులు దుకాణాలకు వచ్చి వేలిముద్రలు వేస్తేనే, డీలర్లు వారికి సరుకులు పంపిణీ చేస్తారు. కార్డుపై ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైన వేలిముద్రలు వేసి సరుకులు పొందే వీలుంది. ప్రస్తుతం కార్డుదారులు రేషన్‌షాప్‌కు రాకున్నా, సరుకులు తీసుకోకపోయినా వచ్చినట్లు జాబితాలో చూపించి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి అక్రమాలకు ఈ–పాస్ విధానంతో చెక్ పడుతుంది. బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, ఆహారభద్రత కార్డుతో కూడా రేషన్‌కార్డును అనుసంధానం చేస్తారు. దీనిల్ల సరుకులు తీసుకోని లబ్ధిదారులకు సంబంధించిన కోటా అంతా మిగులుగానే డీలర్ల దగ్గర ఉండిపోతుంది. మిగులును బట్టే మరుసటి నెలకు డీలర్లకు సరుకుల కోటాను నిర్ణయిస్తారు. ఇంకా...ఎదురుచూపులే! ఈ–పాస్ విధానం మొదట ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేయడం ద్వారా సివిల్ సప్లయీస్ శాఖకు అయిన ఆదాను పరిగణనలోకి తీసుకుని జిల్లాలకు విస్తరించారు. గతేడాది ఏప్రిల్ నుంచి జిల్లాలో ఈ–పాస్ యం త్రాలను రేషన్ షాపుల్లో బిగిస్తున్నారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 461 రేషన్ దుకాణల్లో ఈ–పాస్ అమల్లోకి వచ్చింది. ఆ జిల్లాలో ఉన్న 2లక్షల పైచిలు కు కార్డుల్లో జనవరిలో లక్షా 80వేల మంది కొనుగోళ్లు జరిపారు. ఒక్క నెలలో ఈ–పాస్ అమలు ద్వారా యాదాద్రి భువనగిరిలో రూ.93లక్షలు ఆదా అయ్యింద ని సమాచారం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే నల్లగొండ, సూర్యాపేట జి ల్లాలో ఈ–పాస్ యంత్రాలను అమర్చడం పూర్తి చేశారు. ఫిబ్రవరి ఆఖరుకు ఈ జిల్లాలో జరిగే విక్రయాలను బట్టి ఎంత ఆదా అవుతుందో ఓ నిర్ణయానికి రానున్నారు. ఆ తర్వాతే కొత్త కార్డులు, మార్పులు చేర్పులు, కొత్త కూపన్ల జారీ చేస్తారని అంటున్నారు. దీంతో అర్హులై ఉండి కార్డులు, కూపన్లు లేని వారు మరికొన్ని నెలలు ఎదురుచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. -
డీలర్తోనే డీల్!
♦ నోటిమాటతో కార్డుల జారీ ♦ పట్టించుకోని అధికార యంత్రాంగం ‘ఇంట్లో నేనొక్కదాన్నే. గతంలో తెల్లాకార్డు ఉండేది. మూన్నెళ్లాయె కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసి. ఆఫీసు చుట్టు తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంటలేరు’ ఇదీ లష్కర్ సింగారానికి చెందిన భాగ్యమ్మ ఆవేదన. సాక్షి, హన్మకొండ : ‘నాకు కొత్త కార్డు మంజురు కాలేదని రేషన్ షాపుల బియ్యం ఇస్తలేరు. ఎమ్మార్వో కాడికి పోయి కార్డు తెచ్చుకోమని చెప్పిళ్లు. మూడునెలల నుంచి తిరుగుతున్నా పనైతలేదు. ఆటోలకే డబ్బులు అయితన్నై. పాతకార్డు మీదనన్న బియ్యం ఇస్తే బాగుండేది’ ఇదీ జహహర్నగర్కు చెందిన గుగులోతు మరియ ఆక్రందన. ఇలాంటి వారికి లేనది అర్హత కాదు.. రేషన్ డీలర్ల అనుగ్రహం! అవును.. రేషన్‌కార్డుల జారీలో డీలర్లు చక్రం తిప్పుతున్నారు. రేషన్ డీలర్లను కాదని.. నిబంధనలు అన్ని పాటించినా కార్డు సంపాదించడం గగనమవుతోంది. కూలీనాలీ చే సి పొట్టపోసుకునే పేదలు అటు పనులుకు వెళ్లలేక ఇటు ఆఫీసుల్లో పని కాక తిప్పలు పడుతున్నారు. కొత్త రేషన్ కార్డు జారీలో పేదరికం, కుటుంబ వార్షిక ఆదాయం అర్హతగా కాకుండా తమకు నచ్చిన, తమను మెప్పించిన రేషన్ డీలర్ పరిధిలోకి వస్తాడా ? రాడా ? అనేదే పట్టించుకుంటున్నారు. సదరు దరఖాస్తుదారుడి ప్రాంతానికి చెందిన రేషన్డీలర్తో ‘డీల్’ కుదిరేదాక కార్డులు జారీకి మొరారుుస్తున్నారుు. ఫలితంగా.. దరఖాస్తుల్లో మూడొంతుల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. స్వయంగా దరఖాస్తు చేసుకున్నవారికి, వీఆర్వోలు ప్ర తిపాదించిన వారికి తక్కువ మొత్తంలో అంత్యోదయ కార్డు లు అందగా... డీలర్లు ప్రతిపాదించిన పేర్లలో 95 శాతం మందికి అంత్యోదయ కార్డులు జారీ అయ్యాయని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.