
స్వరాజ్ మైదానంలోని రైతుబజార్ (పాత చిత్రం)
సాక్షి, విజయవాడ : స్వరాజ్ మైదానంలోని రైతుబజార్‌లో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఆరు బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతుబజార్‌లో ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా షాపులు నిర్వహిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని అధికారులు ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులతో పాటు తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
రైతుబజార్‌లో అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులు.. ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై, కూరగాయలను గ్రేడింగ్ చేసి బయట మార్కెట్‌కి పంపుతున్న వారిపై, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్‌లు సరిగా పనిచేయని షాప్ యాజమానులపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.