కిరోసిన్ నిల్వలపై విజిలెన్స్ దాడి
నెల్లూరు (క్రైమ్) : నీలికిరోసిన్ నిల్వలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బు«ధవారం దాడులు చేశారు. 250 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల సమాచారం మేరకు.. కుక్కలగుంట రాజేంద్రనగర్‌లో కె. వెంకయ్య చిల్లర సరుకులు, సిమెంట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన కాలంగా వివిధ రేషన్‌షాపులు, వినియోగదారుల వద్ద నుంచి కిరోసిన్‌ను కొనుగోలు చేసి లీటరు రూ.30లకు బ్లాక్‌లో విక్రయిస్తున్నాడు. ఈ విషయమై బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డికి ఫిర్యాదు అందింది. ఆయన ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్లు కట్టా శ్రీనివాసరావు, బీటీæనాయక్, ఏఓ ధనుంజయరెడ్డి తమ సిబ్బందితో కలిసి వెంకటయ్య దుకాణంపై దాyì lచేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 250 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకుని, అతనిపై 6ఏ కేసు నమోదు చేశారు. సమీపంలోని రేషన్‌డీలర్ అమీర్‌జాన్‌కు చెందిన 42వ రేషన్‌షాపును అధికారులు తనిఖీ చేశారు. అక్కడ కిరోసిన్ నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అన్నీ పక్కాగా ఉండటంతో వెళ్లిపోయారు.