అనంతపురం : విజిలెన్స్ అధికారుల దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ పాస్‌పుస్తకాలు పట్టుబడ్డాయి. అనంతపురం పట్టణంలోని 3వ రోడ్డులో నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ గోదాముపై విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమిళనాడులోని శివకాశి నుంచి వచ్చిన 6,300 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి అనంతపురంకు చెందిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి పేరుతో వచ్చినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.