నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు.
బుచ్చిరెడ్డిపాలెం : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. అక్రమనిల్వలపై అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేశారు.
కాగా గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 13 వంటగ్యాస్ సిలిండర్లు, 60 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానురాలిపై నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేశారు.