Ration rice seized
-
150 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
సాక్షి, తాండూరు: వందల క్వింటాళ్లు రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం విజిలెన్స్, సివిల్‌సప్లయ్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, సివిల్ సప్లయి తహసీల్దార్లు నందిని, పద్మ, రూరల్ సీఐ జలేంధర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన వడ్డె వెంకటేశం గత కొంతకాలంగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గౌతంపూర్ శివారులో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనకాల ఓ గదిలో 150 క్వింటాళ్ల (15టన్నుల) రేషన్ బియ్యంను అక్రమంగా నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులు ఆ ఇంటిపై ఆదివారం దాడులు చేశారు. కాగా ఆ గదిలో 450 బస్తాల రేషన్ బియ్యం ఉన్నాయి. ఇందులో 300 బస్తాల దొడ్డు బియ్యం, 150 బస్తాల నూకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని తాండూరులోని స్టాక్‌పాయింట్‌కు తరలించారు. సంబంధిత వ్యాపారులు రేషన్ బియ్యం సేకరించి కొడంగల్, జహీరాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంత్సరాలుగా ఇలా సేకరిస్తున్న రేషన్‌బియ్యాన్ని ఇక్కడ నిల్వ ఉంచి.. వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాండూరులో ఈ అక్రమ దందా కొనాసాగుతున్న ఈ దాడులు నిర్వహించినవారిలో కరన్‌కోట్ ఎస్ఐ సంతోష్‌కుమార్ ఉన్నారు. కేసు నమోదు చేశాం గౌతపూర్లోని రిలయన్స్ పెట్రోల్‌బంక్ వెనకాల ఓ గదిలో 15 టన్నులు అక్రమంగా రేషన్‌బియ్యం ఉన్నట్లు గుర్తించాం. రేషన్‌బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన సంబంధిత వ్యక్తి (వెంకటేశ్)పై క్రిమినల్ కేసుతో పాటు 6ఏ కేసు నమోదు చేశాం. కేసు నమోదు తర్వాత జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ ఉంటుంది. – నందిని, తహసీల్దార్, సివిల్‌సప్లయ్, వికారాబాద్ -
టీడీపీ నేత రైస్‌మిల్లులో రేషన్ బియ్యం పట్టివేత
సాక్షి, కావలి (నెల్లూరు): ఓ టీడీపీ నేత రైస్‌మిల్లులో 5.6 టన్నుల రేషన్ బియ్యంపట్టుబడిన విషయం మరువక ముందే మరో టీడీపీ నేతకు చెందిన రైస్ మిల్లులో భారీగా 18.5 టన్నుల బియ్యం పట్టుబడ్డాయి. పట్టణంలోని మద్దురుపాడులో ఉన్న టీడీపీ నేత పులి చక్రపాణికి చెందిన రైస్‌మిల్లులో భారీగా రేషన్ బియ్యం ఉన్నట్లు శనివారం సాయంత్రం కావలి రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో మిల్లు వద్దకు చేరుకొన్నారు. మిల్లులో రేషన్ బియ్యంను పాలిష్ చేసి గుట్టగా పోసి ఉండగా గుర్తించారు. దీంతో పోలీసులు పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే జిల్లా పౌరసరఫరాలశాఖ అధి కారి బాలకృష్ణారావు ఆదివారం మధ్యాహ్నం వరకు మిల్లు వద్దకు చేరుకోలేదు. తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్థానిక అధికారులు కాలక్షేపం చేశారు. అయితే పోలీసులు మాత్రం రైస్‌మిల్లులోని రేషన్ బియ్యం మాయం కాకుండా కాపలా పెట్టారు. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం రేషన్ బియ్యంగా నిర్ధారించారు. పాలిష్ చేయడంతో అందులో 16 టన్నులు బియ్యం, 2.5 టన్నుల నూకలుగా లెక్కలు తేల్చి స్వాధీనం చేసుకొన్నారు. మిల్లు యజమాని, టీడీపీ నేత పులి చక్రపాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నేత రైస్ మిల్లులో రేషన్ బియ్యం పట్టివేత
సాక్షి, కావలి (నెల్లూరు): పట్టణంలోని మద్దూరుపాడులో టీడీపీ నేత దామిశెట్టి శ్రీనివాసులునాయుడుకు చెందిన రైస్‌మిల్లులో సోమవారం సుమారు 5.6 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. లారీలో నుంచి రైస్‌మిల్లులో 5 టన్నుల రేషన్ బియ్యం దించుతుండగా గుర్తించి పట్టుకున్నారు. ఆ బియ్యంను పౌరసరఫరాలశాఖ, పోలీస్ అధికారులు పరిశీలిస్తుండగానే, మరో ఆటోలో రేషన్ బియ్యం తీసుకుని మిల్లులోకి వచ్చింది. దాన్ని బయటకు పంపేందుకు శ్రీనివాసులునాయుడు సోదరుడు ప్రయత్నంచగా గమనించిన కావలి రూరల్ సీఐ మురళీకృష్ణ, ఎస్సై అరుణకుమారి, ఏఎస్సై తిరుమలరెడ్డి వాటినీ పట్టుకున్నారు. రేషన్ బియ్యం ‘పాలిష్’ కావలిలో కొందరు రైస్‌మిల్లుల యజమానులు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో రేషన్ బియ్యాన్ని సేకరించి వాటికి పాలీష్ పట్టి బహిరంగ మార్కెట్లో దర్జాగా అమ్మకాలు చేసుకొని లాభాలు గడిస్తున్నారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ తంతుపై అనేక సార్లు పలు మిల్లులపై దాడులు కూడా జరిగాయి. అయినా మిల్లర్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా టీడీపీ నేత దామిశెట్టి శ్రీనివాసులు నాయుడుకు చెందిన మిల్లులో 5.6 టన్నుల బియ్యం పట్టుబడడం విశేషం. వేపకాయల మిల్లు కేంద్రంగా.. శ్రీనివాసులునాయుడుకు చెందిన వేపకాయల మిల్లు కేంద్రంగా రేషన్ బియ్యం సేకరణ జరుగుతోంది. కావలికి చుట్టు పక్కల మండలాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వారు రేషన్‌కార్డు లబ్ధిదారులు దగ్గర, రేషన్ డీలర్ల వద్ద సేకరించిన బియ్యాన్ని ఎరువుల బస్తాల్లో వేపకాయల మిల్లు వద్దకు చేరుస్తున్నారు. కేజీకి రూ.15 వంతున వారికి చెల్లిస్తున్నారు. ఇక్కడే స్టాక్ పాయింట్‌గా చేసుకొని వారి సొంత లారీలోనే లోడింగ్ చేసుకుని మద్దూరుపాడులో ఉన్న రైస్‌మిల్లుకు తరలిస్తుస్తున్నట్లు పౌరసరఫరాల శాఖాధికారులు, పోలీసులు గుర్తించారు. అంతా అప్పటికప్పుడే.. రేషన్ బియ్యాన్ని పాత యూరియా బస్తాల ద్వారా లారీలో నుంచి కిందకు దించడం, అప్పటికప్పుడే బస్తాల్లో నుంచి బియ్యాన్ని మిల్లులో పోయడం శరవేగంగా చేయస్తున్నారు. సోమవారం శ్రీనివాసులు నాయుడుకు చెందిన వేపకాయల బిల్లు నుంచి రేషన్‌బియ్యాన్ని రైస్‌మిల్లుకు లారీలో తలించి దించుతుండగా పౌరసరఫరాలశాఖ అధికారులకు రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అధికారులు వెళ్లేసరికి లారీలో కొన్ని బస్తాలు, మిల్లులో దించిన బస్తాలు, బస్తాల్లోంచి మిల్లులో పోసిన బియ్యం ఉన్నాయి. అధికారులను చూసిన కూలీలు పక్కకు వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ టి. మురళీకృష్ణ, ఎస్సై జె. మాల్యాద్రి, టి.అరుణ కుమారి రైస్‌మిల్లు వద్దకు చేరుకొన్నారు. నంబర్ ప్లేటు లేని ఆటోలో.. మిల్లులు పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తుండగా.. అంతలోనే నంబరు ప్లేటు లేని ఆటోలో పట్టణంలోని వెంగళరావునగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 600 కేజీల రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చారు. దీనిని గమనించి శ్రీనివాసులునాయుడు సోదరుడు మల్లికార్జున ఆ ఆటోను బయటకు పంపించేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించి సీఐ మురళీకృష్ణ, ఎస్సైలు ఆటో ఆపి తనిఖీ చేశారు. కాగా కావలి సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ కె.వెకంట్రామిరెడ్డి, కావలి డివిజన్ అసిస్టెంట్ సివిల్ సప్లయీస్ అధికారి ఐ.పుల్లయ్య, కోవూరు సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ జీఎస్ కృష్ణప్రసాద్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా మీడియా ముసుగులో ఉన్న రేషన్ డీలరు ఒకరు ఓవరాక్షన్ చేయడం గమనార్హం. శ్రీనివాసులు నాయుడు కుమారుడు మీడియాకు నోటీసులు ఇస్తానని బెదిరించడం విశేషం. -
‘రేషన్’కు రెక్కలు
సాక్షి, మెదక్ : అక్రమాలకు తావు లేకుండా ఈ–పాస్ విధానాన్ని అమలు చేస్తున్నా.. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పలువురు అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి పీడీఎస్ రైస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సివిల్ సప్లయీస్ శాఖ పట్టింపులేని తనం.. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వైఫల్యం.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కదారి పడుతున్న పీడీఎస్ బియ్యం రేషన్ బియ్యం దందా జిల్లాలో మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలు మూడు పూటలా అన్నం తినేలా రూపాయికి కిలో చొప్పున బియ్యం అందజేసే ఆహార భద్రత పథకం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా దందా నడిపిస్తూ రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు మామూళ్ల ఎర.. జిల్లా పరిధిలోని 20 మండలాల్లో మొత్తం 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ఆహార భద్రత కార్డులు 2,01,100 ఉండగా.. కిలోకు రూపాయి చొప్పున ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డులు 13,013 ఉండగా.. వారికి 35 కిలోలు ఇస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారులు 84 మంది ఉండగా.. వారికి ఉచితంగా ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతి నెలా 4,432.173 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. బియ్యం దొడ్డుగా ఉండడం, జీర్ణం కాకపోవడంతో చాలా మంది వాటిని తినేందుకు ఆసక్తి చూపడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సిబ్బందిని నియమించుకుని పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవినీతికి అలవాటు పడ్డ పలువురు సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ అధికారులు, సిబ్బందికి నెలవారీగా మామూళ్ల ఎర వేసి.. వారి అండదండలతో తమ అక్రమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. దందా సాగుతుందిలా.. అక్రమార్కులు నియమించుకున్న వారు.. డబ్బు ఆశతో దళారులుగా మారిన కొందరు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలోకు రూ.ఏడు నుంచి రూ.ఎనిమిదితో కొనుగోలు చేసి.. ఓ చోట డంప్ చేస్తున్నారు. వారి స్థోమతను బట్టి వివిధ రకాల వాహనాల ద్వారా మండల కేంద్రానికి తరలిస్తున్నారు. ఆ తర్వాత రాత్రి 9 నుంచి 11 మధ్యలో గానీ.. తెల్లవారు జాము నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో గానీ ఎంచుకున్న చోటుకు పంపిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల గ్రామం, మండలంలో రేషన్ సేకరించిన వారికి కిలోకు రూ.12 నుంచి రూ.15 సమకూరుతున్నాయి. పెద్దమొత్తంలో పీడీఎస్ రైస్ జమ అయిన తర్వాత లారీ, డీసీఎం వాహనాల్లో అక్రమార్కులు పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా తూప్రాన్ , నర్సాపూర్, మెదక్ పట్టణ శివారు ప్రాంతాల కేంద్రంగా పీడీఎస్ బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలుతున్నట్లు సమాచారం. 50 శాతం మహారాష్ట్రకు.. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లోని డీలర్లు, లబ్ధిదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యంలో సుమారు 50 శాతానికి పైగా మహారాష్ట్రకు తరలుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాగపూర్, వీరూర్‌లో బియ్యం దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అక్కడ కిలో బియ్యానికి రూ.50 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. బియ్యానికి బదులుగా గోధుమలు, చక్కెర, తెల్ల జొన్నలు ఇస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి దందా నడిపిస్తున్నట్లు తెలిసింది. డీసీఎంలు, లారీల్లో రెండు, మూడు రోజులకోసారి అక్కడికి వేల క్వింటాళ్ల మేర రేషన్ బియ్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఫలితం ఇవ్వని ఈ–పాస్. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఈ–పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. కార్డుదారుడు తన వేలిముద్ర పెడితే తప్ప బియ్యం ఇచ్చేందుకు అవకాశం లేదు. కొంతమంది వేలిముద్రలు పడుతలేవనే కారణంలో డీలర్లు మ్యానువల్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో డీలర్లు మాయ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మా దృష్టికి రాలేదు. అక్రమ బియ్యం సరఫరాను ఉపేక్షించేది లేదు. అలాంటి వాటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – సాధిక్, సివిల్సప్లై, డిప్యూటీ తహసీల్దార్, మెదక్ అక్రమార్కుల దందా ఇలా.. ► ఇంటింటా సేకరించే బియ్యం (కిలోకు) రూ.7 నుంచి రూ.8 ► మిల్లర్లు లేదా మాఫియాకు అమ్మకం (కిలోకు) రూ.12 నుంచి రూ.15 ► మహారాష్ట్రలో అమ్మగా వచ్చే సొమ్ము (కిలోకు) రూ.50 నుంచి రూ.65 -
5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవలో ముగ్గురు వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డిపోల నుంచి లబ్ధిదారులు విడిపించుకుంటున్న బియ్యాన్ని ఇక్కడి వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రేషన్ డిపోలలో ఉచితంగా వస్తున్న బియ్యానికి కిలో రూ.10లు ధరల ఇవ్వడంతో లబ్ధిదారులు వ్యాపారులకు విక్రయించేస్తున్నారు. వాటిని వ్యాపారులు తిరిగి మిల్లర్లకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ఇలా ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ డిపోల నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని వ్యాపారులు కొంటున్నారు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని గుట్టుగా ఇళ్లలోనే నిల్వ ఉంచి నెలాఖరున మిల్లర్లకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొన్న విజిలెన్స్ అధికారులు ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు సీఐ మల్లిఖార్జునరావు, హెచ్‌సీలు ముబారక్, సత్యనారాయణ, సిబ్బందితో వచ్చి మంగళవారం దాడులు చేశారు. లీలాసుందరినగర్‌లో 1,240 కిలోలు, బాలాజీనగర్‌లో 740 కిలోలు, పాండురంగాపురంలో 2,800 కిలోల పీడీఎస్ బియ్యం పట్టుకొన్నారు. ఆయా వ్యాపారుల నుంచి ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. ముగ్గురు వ్యాపారులపైనా కేసులు నమోదు చేశారు. -
రేషన్‌బియ్యం పట్టివేత
గద్వాల క్రైం: ఇది నా ఇలాఖా.. ఇక్కడి ప్రాంతాల్లో పేదల రేషన్ బియ్యానికి నేనే పెద్ద డేగను..! నా కళ్లు గప్పి నా ప్రాంతంలోని రేషన్ బియ్యం విక్రయాలు చేసి తీసుకువెళ్తావా.. అంటూ గద్వాలకు చెందిన ఓ ముఠా సభ్యులు ఆక్రోశం..? ఎక్కడైతే ఏంటి.. కారుచౌకగా బియ్యం దొరుకుతాయంటే ఎవరి ప్రాంతంలోనైనా గుట్టుగా కొని సొమ్ము చేసుకుంటాం అంటూ.. కేటీదొడ్డి మండలానికి చెందిన మరో ముఠా సభ్యుల ఎదురుదాడి..!? ఇలా రెండు ముఠా సభ్యులు గద్వాల ప్రాంతంలో రేషన్ బియ్యం కొనేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీదొడ్డికి చెందిన ముఠా సభ్యులు గద్వాల నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకుని.. గద్వాలకు చెందిన ముఠా సభ్యులు వారిపై దాడి చేసి బియ్యం తరలిస్తున్న ఆటోను ధ్వంసం చేశారు. ప్రాణభయంతో కేకలు వేయగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పట్టణ పోలీసులు అక్కడికి చేరుకోగా.. దాడి చేసిన ముఠా సభ్యులు పారిపోయారు. బియ్యం తరలిస్తున్న గూడ్స్ ఆటో, ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన బుధువారం తెల్లవారుజామున మండలంలోని చేనుగోనిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దారి కాచి దాడి.. కాలూరుతిమ్మన్దొడ్డి మండల కేంద్రానికి చెందిన రాము, నరేష్‌లు గూడ్స్ ఆటోలో సుమారు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చెనుగోనిపల్లి గ్రామం నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుట్టుగా తరలిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న మరో ముఠా సభ్యులు దారి కాచి ఆటోను పట్టుకున్నారు. ఆటోలోని బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారు..? ఎవరు పంపిచారంటూ ఆటోపై దాడి చేశారు. అంతటితో ఆగక ఇద్దరిపై దాడి చేశారు. దెబ్బలకు తాళలేక వారు కేకలు వేయగా గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ముఠా సభ్యులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆటోను, ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొనుగోళ్లపై పోటాపోటీ.. గద్వాలలో రేషన్ బియ్యం కొనుగోళ్లు చేసేందుకు అక్రమార్కుల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతుంది. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో నిరుపేదలకు చౌకధర దుకాణాల ద్వారా కిలో రూపాయికి అందజేస్తుంది. అయితే బయటి మార్కెట్లో సుమారు రూ.20 ధర పలుకుతుంది. అయితే రేషన్ బియ్యం లబ్ధిదారుల నుంచి రూ.10–15 వెచ్చించి వివిధ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటకకు తరలించి అక్కడి ప్రైవేట్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మారుస్తారు. ఇలా చేసిన బియ్యాన్ని వ్యాపారులతో కుమ్మక్కై బయటి మార్కెట్లో కిలో రూ.30–35లకు అమాయక ప్రజలకు విక్రయిస్తారు. లాభసాటి వ్యాపారం కావడంతో జిల్లాకేంద్రంలో రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు పలు ముఠా సభ్యులు పోటీ పడుతున్నారు. వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి గద్వాల, డ్యాం, ఆత్మకూర్ మీదుగా కర్ణాటకలోని రాయిచూర్‌కు నిత్యం రేషన్ బియ్యం తరలిస్తున్నారు. కేసు నమోదు.. ఈ విషయమై గద్వాల పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ స్పందిస్తూ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సిబ్బందికి సమాచారం రావడంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే బియ్యం తరలిస్తున్న వారిపై దాడి చేసిన విషయమై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. రెండు క్వింటాళ్ల నల్లబెల్లం.. మన్ననూర్ (అచ్చంపేట): అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద రెండు క్వింటాళ్ల నల్లబెల్లం, 40 కిలోల పటికి పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని దోర్నాల నుంచి ఇండిగో కారులో నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారని దోమలపెంట పోలీసులకు సమాచారం అందడంతో నిఘా ఉంచారు. ఈ క్రమంలో అచ్చంపేట పట్టణ సమీప గ్రామాలకు చెందిన రమేష్, భరత్‌లు బెల్లంతో అక్కడికి వచ్చారు. కారుతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సిద్ధిఖ్, ప్రేమ్‌కుమార్, ఉపసర్పంచ్ ప్రసాద్ సంబంధిత అచ్చంపేట ఎక్సైజ్ అధికారులు శంకరయ్య, రమేష్, ఆంజనేయులుకు సమాచారం అందించి నిందితుల నుంచి అక్రమ బెల్లంను వారికి అప్పగించారు. బెల్లం ఎక్కడి నుంచి సరఫరా అవుతున్న విషయాలను దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామన్నారు. -
రామగిరి ప్యాసింజర్‌లో రేషన్ బియ్యం స్వాధీనం
కాజీపేట రూరల్ : కాజీపేట నుంచి బ ల్లార్షాకు వెళ్లే రామగిరి ప్యాసింజర్ రైలు లో శుక్రవారం కాజీపేట ఆర్పీఎఫ్ సిబ్బంది 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. రామగిరి ప్యా సింజర్‌లోని బోగీలను శుభ్రం చేసేందు కు తెల్లవారు జామున ఫాతిమానగర్ వద్ద ఉన్న వాషింగ్ సైడ్‌షెడ్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బంది రైలులో బియ్యం మూటలను చూసి స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అలాగే ఆర్పీఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వాషింగ్ సైడ్ వద్దకు వెళ్లి బి య్యం మూటలను స్వాధీనం చేసుకుని ఆర్పీఎఫ్ పోలీస్‌స్టేషన్ తరలించారు. తర్వాత హన్మకొండ డీటీ జయశంకర్‌ను పిలిపించి స్వాధీనం చేసుకున్న బియ్యంను ఆయనకు అప్పగించారు. కాగా, రేషన్ బియ్యాన్ని స్థానిక రేషన్ డీలర్ వీరస్వామికి అప్పగించినట్లు డీటీ తెలిపారు. -
రేషన్ బియ్యం నిల్వ కేంద్రంపై దాడులు
80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం హసన్‌పర్తి : హసన్‌పర్తిలో శనివారం రేషన్ బియ్యం నిల్వ కేంద్రంపై సివిల్‌సప్లయ్, రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అందులో నిల్వ ఉన్న సుమారు 80 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం చేసుకున్నారు. హసన్‌పర్తిలోని బుడిగ జంగాల కాలనీలో పెద్ద మొత్తంలో బియ్యం నిల్వ ఉన్నాయనే సమాచారంతో అధికారులు దాడులు చేశారు. రాజబాబు అనే యువకుడు వివిధ వర్గాల నుంచి బియ్యాన్ని సేకరించి అమ్మకానికి భద్రపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్దమొత్తంలో బియ్యం నిల్వ ఉండడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, రాజ్‌కుమార్ తెలిపారు. దాడుల్లో తహసీల్దార్ రవి, స్థానిక ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకే ప్రాంతంలో ఆరోసారి బుడిగ జంగాల కాలనీలో ఆరు నెలల్లో ఆరోసారి దాడులు జరిగాయి. ప్రతినెలా ఇక్కడ రేషన్ బియ్యం పట్టుబడడం సర్వసాధారణంగా మారింది. ఇక్కడ ప్రతి నెలా ఒక్కో యువకుడిపై కేసు నమోదవుతూ వస్తోంది. -
170 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
గజపతినగరం: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారనే అనుమానంతో 170 క్వింటాళ్ల బియ్యాన్ని స్థానిక తహశీల్దార్ ఆర్ఎల్ఎల్ ప్రసాద్‌పాత్రో పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ అనుమతి లేకుండా జిన్నాం గ్రామ సమీపంలో ఉన్న రామాంజనేయ రైస్ మిల్ యజమాని బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తహశీల్దార్ ప్రసాద్ పాత్రో బుధవారం రాత్రి గ్రామ సమీపంలో కాపు కాసి బియ్యాన్ని సీజ్ చేశారు. విషయూన్ని ఏజేసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తహశీల్దార్ తెలిపారు. ఇదిలాఉంటే మిల్లు యజమాని కొప్పల రామునాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. -
రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు
బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలోని శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ముందస్తు సమాచారంతో దాడి తనిఖీ చేశారు. రైస్‌మిల్లులో 38 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్లు యజమానిపై 6ఏ కింద కేసు నమోదు చేశారు. మిల్లు రికార్డులు పరిశీలించగా అవకతకవలను గుర్తించారు. కొనుగోలు కేంద్రం ద్వారా మిల్లుకు తరలించిన ధాన్యానికి రికార్డులు లేకపోవం, పరిమితికి మించి ధాన్యాన్ని నిల్వ ఉంచడాన్ని గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. రికార్డులు స్వాధీనం చేసుకుని సమగ్రంగా పరిశీలిస్తున్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ధనుంజయరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది నెలల్లో రెండోసారి శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. రేషన్ డీలర్ల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే విక్రయించడం, దళారుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. గతేడాది సెప్టెంబర్ 21న విజిలెన్స్ అధికారులు మిల్లుపై దాడి చేసి రూ.10 లక్షలు విలువైన 659 క్వింటాళ్ల ధాన్యానికి రికార్డులు లేనట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని 6ఏ కింద కేసులు నమోదు చేశారు. తాజాగా మరో మారు దాడులు నిర్వహించి రేషన్ బియ్యంతో పాటు రికార్డులు లేని ధాన్యాన్ని గుర్తించారు. -
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రెవిన్యూ అధికారులు భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాషామహల్లోని ఓ రైస్ మిల్లుపై అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో రేషన్ బియ్యం పట్టివేత
సికింద్రాబాద్ నుంచి బల్లార్ష వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు పట్టుకున్నారు. తరచూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
ముండ్లమూరు, న్యూస్‌లైన్ : అక్రమంగా తరలిస్తున్న 36 బస్తాల రేషన్ బియ్యాన్ని ముండ్లమూరు పోలీసులు గురువారం తెల్లవారుజామున స్థానికుల సాయంతో పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ముండ్లమూరు గ్రామం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కొందరు స్థానికులే ప్రధాన రోడ్లపై కాపుకాశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గ్రామంలోని ప్రధాన వీధిలో టాటా ఏస్ ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండటాన్ని గమనించి వెంటపడి పట్టుకున్నారు. అనంతరం స్థానిక ఎస్సైకి సమాచారం అందించారు. వేములలో విధి నిర్వహణలో ఉన్న ఎస్సై ద్వారా ఆదేశాలందుకున్న స్టేషన్‌లోని సిబ్బంది వెంటనే ముండ్లమూరు చేరుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అప్పటికే డ్రైవర్ పరారయ్యాడు. గురువారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఎన్ఫోర్స్మెంట్ అద్దంకి డీటీ కె.లింగారావు, పొదిలి ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.విజయశ్రీలు ఆటోలో ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. మొత్తం 36 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. స్థానిక గిడ్డంగికి బియ్యాన్ని తరలించారు. దీనిపై 6ఏ కేసు నమోదు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ కె.లింగరాజు తెలిపారు. అనంతరం స్థానిక రేషన్‌షాపును తనిఖీ చేసి రికార్డులు పరిశీలించగా... స్టాక్ రిజిష్టర్ ప్రకారం 31 క్వింటాళ్ల 70 కేజీల బియ్యం ఉండాల్సి ఉండగా, 9 కేజీలు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి కార్డుదారులను విచారించారు. డీలర్‌తో అధికారుల కుమ్మక్కు : గ్రామస్తుల ఆరోపణ స్థానిక రేషన్ డీలర్‌కు సంబంధించిన షాపు నుంచే బియ్యం తరలుతున్నప్పటికీ అతనితో అధికారులు కుమ్మక్కై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము ఎంతో కష్టపడి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని పట్టించినప్పటికీ అధికారుల అవినీతి కారణంగా ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా తనిఖీలు చేశారని, ఈలోగా షాపులోని రికార్డులను డీలర్ తారుమారు చేశాడని వారు అనుమానిస్తున్నారు. దీని పై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టంగుటూరులో 87 బస్తాలు... టంగుటూరు, న్యూస్‌లైన్ : అక్రమంగా తరలిస్తున్న 87 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వంగా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు గురువారం స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డులో పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ముందుగా మండలంలోని ఆలకూరపాడు నుంచి అప్పీ ఆటోలో సింగరాయకొండ వైపు తరలిస్తున్న 21 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒంగోలు నుంచి ట్రక్కు ఆటోలో తరలిస్తున్న 66 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 21 చిన్నచిన్న బస్తాల్లో ఏడు క్వింటాలు, 66 బస్తాల్లో 33 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. మొదటి ఆటోలో ఉన్న డ్రైవర్ పి.రాజారావు, రేవూరి శ్రీనివాసరావు, రెండో ఆటోలో ఉన్న చప్పిడి శ్రీనివాసరావు, డ్రైవర్ కదిలి బ్రహ్మనాయుడు, పలగర్ల శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అదే విధంగా కలెక్టర్ కోర్టులో 6(ఏ) కేసులు పెడుతున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు విజిలెన్స్ సీఐ కిశోర్‌కుమార్, ఎస్సై సాంబయ్య, ఎన్ఫోర్స్మెంట్ డీటీలు ఏసుదాసు, ప్రభాకరరావు పాల్గొన్నారు. -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
మాచర్లటౌన్, న్యూస్‌లైన్ : అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సు ద్వారా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు శనివారం రాత్రి స్థానిక రింగ్‌రోడ్ సమీపంలో సోదాలు నిర్వహించారు. మాచర్ల నుండి నల్గొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల మధ్య 24టిక్కీలలో ఉన్న 13 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియయిన్న పోలీసుస్టేషన్‌కు తరలించారు. విచారణ నిర్వహించి చర్యలు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. చింతపల్లిలో 64 బస్తాలు.. చింతపల్లి(కారంపూడి) : గుంటూరు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చింతపల్లి గ్రామంలోని రెండు రేషన్‌షాపుల్లో శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హనుమంతరావుకు చెందిన రేషన్‌షాపునకు 70 మీటర్ల దూరంలోని ఓ ఇంట్లో 64 రే షన్ బియ్యం బస్తాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తమ షాపువి కావని నిర్వాహకుడు అంటున్నారని, విచారణ కొనసాగుతోందని విజిలెన్సు తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దాడుల్లో సీఎస్‌డీటీ నెహ్రూ, డిప్యూటీ తహశీల్దార్ జైలాద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
17 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ పథకం ప్రకారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం సీజ్‌చేశారు. లారీలో ఉన్న 17 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీకి తోడుగా ముందు వెళుతున్న కారును కూడా సీజ్‌చేశారు. బాధ్యులైన ఆరుగురిపై 6ఏ, క్రిమినల్కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి విజిలెన్స్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన చిలకలూరిపేట, మార్టూరు సమీప గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు తరలించేందుకు లారీ బుధవారం తెల్లవారుజామున చిలకలూరిపేట నుంచి బయలుదేరింది. ఉదయం మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద విజిలెన్స్ అధికారులు వాహనాలను తనిఖీచేశారు. లారీలో రేషన్ బియ్యం తరలి వెళుతున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లారీ ముందు దీనికి అనుబంధంగా వెళుతున్న కారును గుర్తించి సీజ్‌చేశారు. రెండు వాహనాలను గుంటూరు విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. 17టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన దర్శి సుధీర్, చిలకలూరిపేటకు చెందిన ఏరువ సుబ్బారావు, లారీ డ్రైవర్ చిలకాబత్తిని పూర్ణచంద్రరావు, క్లీనర్ ఆరికట్ల చంద్రమౌళి, లారీ యజమాని ప్రసాద్‌లపై 6 ఏ, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ తెలిపారు. తనిఖీల్లో సీఐ కిషోర్‌బాబు, తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. రెండిళ్లలో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత రవ్వారం(నూజెండ్ల): రెండు నివాస గృహాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 70 బస్తాల రేషన్ బియ్యాన్ని రవ్వారం గ్రామంలో రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. గ్రామంలోని రెండిళ్లలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలమేరకు తహశీల్దార్ పి.నాగేశ్వరరావు, సీఎస్‌డీటీ జాన్కుమార్లు అక్కడకు వెళ్లి నిల్వ ఉంచిన బియ్యాని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన భవనాశి నాగయ్య ఇంటిలో 40 టిక్కీలు, కందుల రాంబాబు ఇంటిలో 30 టిక్కీలు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన బియ్యం 35 క్వింటాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బియ్యం నిల్వ ఉంచిన ఇళ్ల యజమానులపై 6ఏ కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామన్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని వీఆర్వో భుజంగరావుకు అప్పగించారు. కార్యక్రమంలో ఆర్ఐ నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.