- 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
రేషన్ బియ్యం నిల్వ కేంద్రంపై దాడులు
Published Sat, Jul 23 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
హసన్‌పర్తి : హసన్‌పర్తిలో శనివారం రేషన్ బియ్యం నిల్వ కేంద్రంపై సివిల్‌సప్లయ్, రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అందులో నిల్వ ఉన్న సుమారు 80 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం చేసుకున్నారు. హసన్‌పర్తిలోని బుడిగ జంగాల కాలనీలో పెద్ద మొత్తంలో బియ్యం నిల్వ ఉన్నాయనే సమాచారంతో అధికారులు దాడులు చేశారు.
రాజబాబు అనే యువకుడు వివిధ వర్గాల నుంచి బియ్యాన్ని సేకరించి అమ్మకానికి భద్రపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్దమొత్తంలో బియ్యం నిల్వ ఉండడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, రాజ్‌కుమార్ తెలిపారు. దాడుల్లో తహసీల్దార్ రవి, స్థానిక ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒకే ప్రాంతంలో ఆరోసారి
బుడిగ జంగాల కాలనీలో ఆరు నెలల్లో ఆరోసారి దాడులు జరిగాయి. ప్రతినెలా ఇక్కడ రేషన్ బియ్యం పట్టుబడడం సర్వసాధారణంగా మారింది. ఇక్కడ ప్రతి నెలా ఒక్కో యువకుడిపై కేసు నమోదవుతూ వస్తోంది.
Advertisement
Advertisement