13 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
Published Sun, Jan 12 2014 2:55 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
మాచర్లటౌన్, న్యూస్‌లైన్ : అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సు ద్వారా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు శనివారం రాత్రి స్థానిక రింగ్‌రోడ్ సమీపంలో సోదాలు నిర్వహించారు. మాచర్ల నుండి నల్గొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల మధ్య 24టిక్కీలలో ఉన్న 13 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియయిన్న పోలీసుస్టేషన్‌కు తరలించారు. విచారణ నిర్వహించి చర్యలు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.
చింతపల్లిలో 64 బస్తాలు..
చింతపల్లి(కారంపూడి) : గుంటూరు విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చింతపల్లి గ్రామంలోని రెండు రేషన్‌షాపుల్లో శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హనుమంతరావుకు చెందిన రేషన్‌షాపునకు 70 మీటర్ల దూరంలోని ఓ ఇంట్లో 64 రే షన్ బియ్యం బస్తాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తమ షాపువి కావని నిర్వాహకుడు అంటున్నారని, విచారణ కొనసాగుతోందని విజిలెన్సు తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దాడుల్లో సీఎస్‌డీటీ నెహ్రూ, డిప్యూటీ తహశీల్దార్ జైలాద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement