
చట్టం.. బాబు చుట్టమా?
కార్మికుల చట్టాలు అమలు చేయడంలో చట్టం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చుట్టంలా మారిందని....
కలెక్టరేట్ ఎదుట రైస్‌మిల్లు కార్మికుల ధర్నా
నెల్లూరు(పొగతోట): కార్మికుల చట్టాలు అమలు చేయడంలో చట్టం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చుట్టంలా మారిందని సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్, మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. రైస్ మిల్లుల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదు ట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో జా ప్యం జరగడంతో ఈనెల 16 నుంచి సమ్మె చేస్తున్నామన్నారు. కార్మికులకు కేటాయించిన అగ్గిపెట్టె ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా కట్ చేశారన్నారు.
కార్మికులకు దినసరి వేతనం రూ.315 ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినా అమలు కావ డం లేదన్నారు. వేతనాలు, కూలీరేట్లు 50 శాతం పెంచాలని, మహిళా కార్మికులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం జేసీ ఏఎండీ ఇంతియాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకులు కత్తి శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా రైస్ మిల్లు వర్కర్స్ యూనియన్ నాయకులు ఆంజనేయులు,రఫీ పాల్గొన్నారు.