కల్వకుర్తి: కల్వకుర్తిలో రేషన్‌బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న రైస్‌మిల్లులపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు చేసి స్వాధీనం చేసుకున్న చౌకబియ్యాన్ని సీజ్‌చేశారు. బియ్యం విలువ రూ. 76.40లక్షలుగా నిర్ణయించారు. బుధవారం హైదరాబాద్ సిటీ-2 విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి సీజ్‌చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం ఏఎస్‌ఓ వనజాత, షాద్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రమాదేవి, భూత్పూర్ డీటీ కృష్ణ, కల్వకుర్తి డీటీ అజ ంఅలీ గణేష్ ట్రేడర్స్, రాధాకృష్ణ, రాజ్యలక్ష్మి, వాసవి మిల్లులో సీజ్‌చేసిన బియ్యం విలువ తేల్చారు. దీంతో ఆయా మిల్లుల్లో 1649 క్వింటాళ్ల బియ్యానికి రూ. 76.40లక్షలుగా విలువ లెక్కగట్టారు. వాసవి మిల్లులో 419 క్వింటాళ్లు, గణేష్ ట్రేడర్స్‌లో 82 క్వింటాళ్లకు రూ.1.60లక్షలు, రాధకృష్ణ మిల్లులో 895క్వింటాళ్లకు రూ.36,21,620, రాజ్యలక్ష్మి మిల్లులో 253 క్వింటాళ్లకు రూ.26,87,480గా లెక్కగట్టారు. ఈ బియ్యాన్ని ఇతర వ్యాపారులకు బాధ్యత అప్పగించారు.
గతంలో పట్టణంలోని గణేష్ ట్రేడర్స్‌లో 220 క్వింటాళ్ల బియ్యం సీజ్‌చేసి ఓ వ్యాపారికి బాధ్యత అప్పగిస్తే మాయమయ్యాయి. తిరిగి అదే మిల్లులో 82 క్వింటాళ్ల రేషన్ బియ్యం ల భ్యమయ్యాయి. పాత బియ్యం 220 క్వింటాళ్లకు గురువారం రూ.2.20 లక్షల చలాన్ తీశారు. నాలుగు మిల్లుల్లో స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని ఏఎస్‌ఓ వ నజాత తెలిపారు. కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు.
చౌకబియ్యం సీజ్
Published Fri, Feb 27 2015 12:01 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
Advertisement
Advertisement