అక్రమంగా రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 620 లీటర్ల కిరోసిన్‌తో పాటు భారీగా రేషన్ బియ్యం నిల్వలను గుర్తించి రైస్ మిల్లును సీజ్ చేశారు.
అక్రమంగా రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 620 లీటర్ల కిరోసిన్‌తో పాటు భారీగా రేషన్ బియ్యం నిల్వలను గుర్తించి రైస్ మిల్లును సీజ్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ సాయి రైస్‌మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా రేషన్ బియ్యం నిల్వలను గుర్తించారు. దీంతో రైస్ మిల్లును సీజ్ చేశారు.