
రైస్ మిల్లుపై అధికారుల దాడి
త్రిపురారం
మండల కేంద్రంలోని లక్ష్మి ట్రెడర్స్ రైస్ మిల్లులో జిల్లా పౌర సరఫరాల, రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని బాబుసాయిపేట రోడ్డు సమీపంలో ఉన్న శ్రీనివాస మోడరన్ రైస్ మిల్లులో పొట్టుముత్తు నర్సింహ అనే వ్యా పారి లక్ష్మి ట్రెడర్స్ రైస్ మిల్లు పేరుతో రేషన్ బి య్యాన్ని కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం, నూకలు నిల్వ ఉన్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు దానిపై దాడి చేసి అక్రమం గా నిల్వ చేసిన 216 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 80 క్వింటాళ్ల నూకలు పట్టుకున్నారు.
మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 105 బస్తాల ధాన్యాన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న 216 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 80 క్వింటాళ్ల నూకలు, తుంగపాడులోని వంశీసాయి రైస్ మిల్లు యజమానికి అప్పగించారు. నర్సింహపైకేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పౌరసరఫరాల శాఖ ఏఎస్‌ఓ శేషన్న, తహసీల్దార్ ఆనంద్‌కుమార్, డీటీసీఎస్ రంగారావు, లక్ష్మణ్‌బాబు, ఎస్‌ఐ యాలాద్రి, ఆర్‌ఐ దీపక్ కుమార్, వీఆర్వోలు పల్లె శ్రీనివాస్, శంకర్, ప్రశాంత్, నాగయ్య, వీఆర్‌ఏ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసినా, అమ్మినా కేసు : డీఎస్‌ఓ ఉదయ్‌కుమార్ ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అయ్యే బియ్యాన్ని కొనుగోలు చేసినా, అమ్మినా కేసులు నమోదు చేస్తామని డీఎస్‌ఓ ఉదయ్ కుమార్ హెచ్చరించారు. పౌర సరఫరాల అధికారులు లక్ష్మి ట్రెడర్స్ రైస్ మిల్లుపై దాడులు నిర్వహించి పట్టుకున్న బియ్యాన్ని ఆయన మంగళవా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్‌టీడీఎస్ 2016 యాక్టు ప్రకారం రేషన్ బియ్యాన్ని విక్రయిస్తే కార్డును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ మూడుసార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.