రైస్మిల్లులో అగ్నిప్రమాదం: భారీగా ఆస్తి నష్టం | fire accident in rice mill in nellore district | Sakshi
Sakshi News home page

రైస్మిల్లులో అగ్నిప్రమాదం: భారీగా ఆస్తి నష్టం

Published Fri, Jun 10 2016 9:47 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in rice mill in nellore district

నెల్లూరు : నెల్లూరు జిల్లా కోవూరు శాంతినగర్లోని ఓ రైస్మిల్లులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులోని ధాన్యం, యంత్ర పరికరాలు దగ్ధమవుతున్నాయి. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో భద్రత సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు.

ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ. 70 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైస్ మిల్లు యాజమానులు వెల్లడించారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రైస్ మిల్లు వద్దకు చేరుకుని... భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement