రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం
-
రూ.6 లక్షల వరకు నష్టం
కొరుటూరు (ఇందుకూరుపేట): షార్ట్ సర్క్యూట్ కారణంగా రైస్‌మిల్లులో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కొరుటూరులో ఉన్న ఆంజనేయస్వామి రైస్‌మిల్లు గోడౌన్‌లో ధాన్యాన్ని నిల్వ చేసి ఉన్నారు. గోడౌన్ గురువారం నుంచి పొగలు రావడంతో పని చేస్తున్న కూలీలు గమనించారు. తలుపులు తీసి చూసే సరికి మంటలు చెలరేగుతున్నాయి. వెంటనే చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పేందకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు ఎగబాకి సుమారు 800 బస్తాల ధాన్యం కాలిపోయింది. రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైస్‌మిల్లు యజమాని ఆంజనేయలు తెలిపారు.