Kamareddy Mla Gampa Govardhan Slapped Rice Mill Staff - Sakshi
Sakshi News home page

చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే గంప గోవర్థన్‌.. అసలు వివాదం ఏంటి?

Published Sat, May 6 2023 5:18 PM | Last Updated on Sat, May 6 2023 5:45 PM

Kamareddy Mla Gampa Govardhan Slapped Rice Mill Staff - Sakshi

సాక్షి, కామారెడ్డి: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్‌ వివాదంలో చిక్కుకున్నారు. రైస్‌మిల్లు సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నారు. బిక్నూర్‌ మండలం పెద్దమల్లారెడ్డిలో ఘటన జరిగింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే రైస్‌మిల్లుకు వెళ్లారు. రైస్‌ మిల్లు సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గంప గోవర్థన్‌ చెంప చెల్లుమనిపించారు.

సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా  మిల్లులో మిల్లర్లు లోడింగ్‌ నిలిపివేశారు. మిల్లరతో  కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్లకు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్‌ చేశారు.
చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌.. పొంగులేటి కొత్త పార్టీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement