ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: రైస్‌మిల్లులోని ఓ కూలీపై తోటి కూలీలు ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. ఇబ్రహీంపట్నం సీఐ మహ్మద్‌గౌస్ కథనం ప్రకారం వివరాలు.. సాగర్ రహదారిపై మంగల్‌పల్లి గేట్ సమీపంలోని క్వార్టర్స్‌లో బీహార్‌కు చెందిన దినేశ్(27), బజన్‌లాల్(25) ఉంటున్నారు. వీరు స్థానికంగా ఉన్న ఓ రైస్‌మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు. అదే రైస్‌మిల్లులో చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ వివాహిత కూడా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆమె బహిర్భూమికి వెళ్తుండగా దినేశ్, బజన్‌లాల్ ఆమెను అటకాయించి సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. వివాహిత విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. శనివారం సాయంత్రం బాధితురాలు తన కుటుంబీకులతో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మహ్మద్‌గౌస్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు.
వివాహితపై ఇద్దరి లైంగిక దాడి
Published Sat, Nov 16 2013 11:58 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement