
నాగమణి (ఫైల్)
తలకు చుట్టుకున్నగుడ్డ యంత్రంలో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది.
సాక్షి, ములుగు (గజ్వేల్): తలకు చుట్టుకున్న గుడ్డ యంత్రంలో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నతిమ్మాపూర్‌కు చెందిన నాగమణి (35) వంటిమామిడిలోని జయలక్ష్మి రైస్ మిల్లులో పనిచేస్తోంది. ఆమె తలకు గుడ్డ చుట్టుకుని బియ్యం పట్టే యంత్రం వద్ద మట్టి పెళ్లలను వేరు చేస్తోంది.
ఆమె తలగుడ్డ ప్రమాదవశాత్తూ యంత్రంలో ఇరుక్కుపోయి మెడకు బిగుసుకుపోయింది. యంత్రానికి తల బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి జారుకుంది. అదేమిల్లులో పనిచేస్తున్న భర్త శంకర్ ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.