కీసర: నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేస్తున్న రైస్‌మిల్లుపై సోమవారం రాత్రి విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. సువూరు రూ.5 లక్షల విలువ చేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్, కీసర తహసీల్దార్ రవీందర్‌రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. మండ లంలోని అహ్మద్‌గూడ ప్రధాన ర హదారి సమీపంలోని దత్తసాయి ైరె స్‌మిల్లు యాజమాన్యం నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని దళారుల ద్వారా కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులకు సవూచారం అందింది.
ఈ మేరకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో అహ్మద్‌గూడ గ్రామంలోని దత్తసాయి రైస్‌మిల్లుపై దాడి చేసి సుమారు రూ. 5 లక్షల విలువైన రేషన్ బియ్యూన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం రైస్‌మిల్లులో రైతులు పండించిన ధా న్యం మాత్రమే ఉండాలన్నారు. ఒకవేళ ఆ బియ్యుం రైతులనుంచే కొనుగోలు చేసిందైతే సంబంధిత రశీదులుండాలన్నారు.
ఇవేమీ లేకపోవడంతో రేషన్ బియ్యాన్ని అక్రవుంగా రీసైక్లింగ్ చేస్తున్నట్లు విచారణలో తెలిందన్నారు. ఈ మేరకు బియ్యాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా గతంలో కుడా ఈ రైస్‌మిల్లులో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ యూజవూన్యం పట్టుబడింది. అరుునా రైస్‌మిల్లులో అక్రమ దందా మాత్రం ఆగడం లేదని స్థానికులు వాపోతున్నారు.
రూ. 5 లక్షల రేషన్ బియ్యం స్వాధీనం
Published Tue, Dec 23 2014 11:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement