శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడి చేశారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్లు యజమానిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైస్ మిల్లును సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 3 క్వింటాళ్ల వరకు ఉంటాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.