
సాక్షి, న్యూఢిల్లీ: ఈ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి పండుగ ఆఫర్లకు తెరతీసింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. వీటితో పాటు ఎక్సేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులోఉంచింది. రాయితీ ధరల్లో హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీలు కొనుక్కోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా మైక్రోమ్యాక్స్, శాంసంగ్, వియూ, పానసోనిక్ , ఎల్‌జీ లకుచెందిన హై ఎండ్ బ్రాండ్ టీవీలపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తోంది. మార్చి 16-18 దాకా 70శాతం డిస్కౌంట్స్. ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్‌అదనం.
32 అంగుళాల మైక్రోమ్యాక్స్ హెచ్‌డీ ఎల్‌ఈడీ దాదాపు 3వేలనుంచి డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ టీవీని ప్రస్తుత ఆఫర్లో12,499 రూపాయల వరకు పొందవచ్చు, ఈ టీవీ అసలు ధర రూ. 19,990. కోడాక్ హెచ్‌డీ స్మార్ట్ర్ట్ టీవీ ధర రూ .14,999. దీని అసలు ధర రూ .20,990. రూ. 16వేల వియూ హెచ్‌డీ టీవీని రూ. 13,499కే పొందవచ్చు.
దీంతోపాటు శాంసంగ్ 40 అంగుళాల టీవీలపై 24శాతం డిస్కౌంట్. రూ. 47,999 విలువ చేసే శాంసంగ్ ఎల్‌ఈడీ టీవీ రూ.35,999లకే లభ్యం. ఎల్‌జీ 32ఇంచెస్ టీవీ రూ.18,4999 లకు అందిస్తోంది. దీని అసలు ధర రూ.23,990గా ఉంది. అలాగే టీవీల కొనుగోళ్ల సందర్భంగా రూ. 8వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లకు అందిస్తోంది. వీటితోపాటు ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లుకూడా అందుబాటులో ఉన్నాయి.
సూపర్ వాల్యూ వీక్
మార్చి 18-24 మధ్య స్మార్ట్‌ఫోన్లపై మరిన్ని ఆఫర్లతో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు సిద్ధమౌతోంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్‌వ్యాలూ వీక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. మీ డ్రీమ్ ఫోన్‌ను సొంతం చేసుకోమంటూ ఊరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment