పెద్ద నోట్ల రద్దు దెబ్బకు దాదాపు విక్రయాలన్నీ డౌన్ అయ్యాయి. ఈ నోట్ల రద్దుతో పాటు, నగదు విత్డ్రాలో పరిమితులు విధించడం వినియోగదారుల తయారీ వస్తువులకు భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది. వచ్చే ఆరునెలల వరకు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల విక్రయాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వైట్ గూడ్స్గా పేరున్న టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 70 శాతం క్షీణించనున్నాయని, మార్కెట్లో ఈ గూడ్స్ ఎక్కువగా నగదు అమ్మకాలే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.